సమంత షరతులు | Samantha Conditions | Sakshi
Sakshi News home page

సమంత షరతులు

Jul 23 2017 10:29 AM | Updated on Sep 5 2017 4:43 PM

సమంత షరతులు

సమంత షరతులు

హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక రేంజ్‌కు ఎదిగిన తరువాత కండిషన్స్ అప్‌లై చేయడం అన్నది

తమిళసినిమా: హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక రేంజ్‌కు ఎదిగిన తరువాత కండిషన్స్ అప్లై చేయడం అన్నది కామన్. నటి సమంత ఇందుకు అతీతం కాదు. మరికొన్ని రోజుల్లో ప్రియుడు నాగచైతన్యతో మూడు ముళ్లు, ఏడడుగులకు సిద్ధమవుతున్న సమంత నటనకు మాత్రం గ్యాప్‌ ఇవ్వలేదు. విరామం లేకుండా తమిళ, తెలుగు భాషల్లో ఎడా పెడా నటించేస్తున్న ఈ చెన్నై చంద్రం ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ కు జంటగా నటిస్తున్నారు.

ఇంకా పేరుపెట్టని ఈ చిత్రానికి పొన్ రాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెన్ కాశీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న సమంత తొలిరోజునే దర్శకుడిని పిలిచి ఒక కండిషన్ పెట్టారట.ఈ బ్యూటీకి స్కిన్ ఎలర్జీ ఉన్న సంగతి తెలిసిందే. పలుమార్లు చికిత్స చేయించుకున్నా అది పూర్తిగా తగ్గలేదని సమాచారం. ఈ సమస్య వల్లే సమంత దర్శకుడు శంకర్‌ ఇచ్చిన ఐ చిత్ర ఆవకాశాన్ని జార విడుచుకున్నారు.

ఇది జరిగి పోయిన విషయమే అయినా సమంత ఇదే సమస్య కారణంగా తాజాగా నటిస్తున్న చిత్ర దర్శకుడు పొన్ రాంను పిలిచి మండే ఎండల్లో తాను నటించను. అంతకు ముందే తనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించండి. మళ్లీ ఎండ తగ్గు ముఖం పట్టిన తరువాత తాను నటిస్తాను అని షరతులు పెట్టారట. అదే విధంగా తాను నటిస్తున్నప్పుడు తనకు ఎండ తగలకుండా పైన క్లాత్‌ ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement