‘సీమరాజా’ వస్తున్నాడు! | Seema Raja Telugu Dubbed Version Releasing On 8th February | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 31 2019 7:28 PM | Last Updated on Thu, Jan 31 2019 7:29 PM

Seema Raja Telugu Dubbed Version Releasing On 8th February - Sakshi

తమిళ నాట క్రేజీ హీరోగా మారుతున్నాడు శివ కార్తికేయన్‌. ‘రెమో’ సినిమాతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ హీరో.. ఆ చిత్రంతో పర్వాలేదనిపించాడు. తమిళనాట ‘సీమరాజా’గా హిట్‌ కొట్టిన ఈ హీరో... ఇక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. 

‘సీమరాజా’గా ఈ చిత్రాన్ని తెలుగులో డబ్‌ చేసేందుకు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 3న ఆడియోను .. ఫిబ్రవరి 8న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కీర్తి సురేష్‌, సమంతలాంటి స్టార్‌ హీరోయిన్స్‌ ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పొన్‌రాం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇమ్మాన్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement