
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లొని ఖాప్ పంచాయతీ.. వస్త్రధారణపై కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు జీన్స్, పురుషులు షార్ట్స్ వేసుకోవడంపై నిషేధం విధించింది. ఇకపై గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే శిక్షతో పాటు, బహిష్కరణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చార్తవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్సా గ్రామంలో మార్చి 2న జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు ర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ నాయకుడు, కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పూరన్ సింగ్ ప్రకటించారు.
మహిళలు సాంప్రదాయ భారతీయ దుస్తులైన చీరలు, ఘాగ్రాలు, సల్వార్-కమీజ్(పంజాబీ డ్రస్) ధరించాలని ఆయన సూచించారు. ప్రజల్లో భారతీయ వస్త్ర సంస్కృతి పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా గ్రామ ప్రజలు సైతం ఈ నిబంధనను అంగీకరించడం విశేషం. కాగా యూపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఖాప్ పంచాయతీ మండిపడింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది.
చదవండి : (రెండో పెళ్లి చేస్తారా? చావాలా?: 60 ఏళ్ల వ్యక్తి బెదిరింపులు)
(మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు)
Comments
Please login to add a commentAdd a comment