ban on jeans
-
జీన్స్, షార్ట్స్ వేస్తే ఊరు దాటాల్సిందే..
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లొని ఖాప్ పంచాయతీ.. వస్త్రధారణపై కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు జీన్స్, పురుషులు షార్ట్స్ వేసుకోవడంపై నిషేధం విధించింది. ఇకపై గ్రామస్థులందరూ సంప్రదాయ దుస్తులనే ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే శిక్షతో పాటు, బహిష్కరణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. చార్తవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపాల్సా గ్రామంలో మార్చి 2న జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు ర్ణయం తీసుకున్నట్టు పంచాయతీ నాయకుడు, కిసాన్ సంఘ్ చీఫ్ ఠాకూర్ పూరన్ సింగ్ ప్రకటించారు. మహిళలు సాంప్రదాయ భారతీయ దుస్తులైన చీరలు, ఘాగ్రాలు, సల్వార్-కమీజ్(పంజాబీ డ్రస్) ధరించాలని ఆయన సూచించారు. ప్రజల్లో భారతీయ వస్త్ర సంస్కృతి పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా గ్రామ ప్రజలు సైతం ఈ నిబంధనను అంగీకరించడం విశేషం. కాగా యూపీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంపై ఖాప్ పంచాయతీ మండిపడింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. చదవండి : (రెండో పెళ్లి చేస్తారా? చావాలా?: 60 ఏళ్ల వ్యక్తి బెదిరింపులు) (మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు) -
అక్కడ మహిళలకు జీన్స్, మొబైల్ నిషిద్ధం
సాక్షి, ఛండీగర్ : మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతుంటే పలు రూపాల్లో వివక్ష వారిని వెంటాడుతూనే ఉంది. యువతులు జీన్స్ ధరించరాదని, మొబైల్ ఫోన్లు వాడరాదని హర్యానాలోని ఓ గ్రామ పంచాయితీ నిర్ణయం తీసుకుంది. సోనిపట్ సమీపంలోని ఇసీపూర్ ఖేదీ గ్రామ పంచాయితీ ఈ మేరకు తీర్మానించింది. గ్రామ పెద్దల నిర్ణయంపై యువతులు సహా పలువురు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. ‘తామేం ధరించాలన్నది సమస్య కాదని..పురుషుల మనస్తత్వంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నా’యని గ్రామంలోని యువతులు చెబుతున్నారు. వేసుకున్న దుస్తుల ప్రకారం ఓ మహిళ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో రాజస్ధాన్‌లోనూ గత ఏడాది జులై 27న ధోల్పూర్ జిల్లాలోని ఓ పంచాయితీ యువతులు జీన్స్ వేసుకోరాదని, మొబైల్ ఫోన్లు వాడరాదని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజస్థాన్ మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. -
జీన్స్ ప్యాంట్లు ధరిస్తే తోలు తీస్తాం!
చెవిపోగులపైనా నిషేధం దేశంలో ఎవరూ జీన్స్ ప్యాంట్లు ధరించవద్దు. చెవిపోగులు పెట్టుకోకూడదు. పాశ్చాత్య ఫ్యాషన్లపై ఏ మాత్రం వ్యామోహం పెంచుకోకూడదంటూ ఉత్తర కొరియన్లపై ఆ దేశ నియంత మరిన్ని ఆంక్షలు విధించాడు. దేశవ్యాప్తంగా పాశ్చాత్య పోకడలపై అణచివేతను నియంత కిమ్ జాంగ్ ఉన్ ముమ్మరం చేశాడు. మరీ ముఖ్యంగా చైనాకు సమీపంలో ఉన్న నార్త్ హంగ్వాంగ్, యాంగాంగ్ ప్రావిన్స్‌ల్లో ఈ అణిచివేత ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్దేశించాడు. ఈ ప్రావిన్స్‌ల్లోని ప్రజలకు బయటి ప్రపంచంతో ఎక్కువ అనుబంధం ఉండటంతో, వీరిలో సహజంగానే పాశ్చాత్య ఫ్యాషన్లపై మోజు పెరుగుతున్నదని, ఇది అధికార వర్గాన్ని ఆందోళన పరుస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు. ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ 7వ కాంగ్రెస్ త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలుచేయాలని నిర్ణయించినట్టు జపాన్‌కు చెందిన ఏషియా ప్రెస్ తెలిపింది. దేశంలో అత్యధికులు పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుండటంతో 7వ కాంగ్రెస్ నాటికి దీనిని అణచివేసేందుకు చర్యలు కొనసాగనున్నాయని కొరియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న జపనీయన్ ఇషిమారు జిరో తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్‌కు విధేయులైన యూత్ గ్రూప్స్ ఈ నిబంధనలను అమలు చేయనున్నాయని, క్యాపిటలిస్టు టెండన్సీస్ అయిన జీన్స్, మినీ స్కర్ట్, టీ-షర్ట్లు, హెయిర్ స్టైల్‌ను పౌరులు అనుసరించకుండా ఈ గ్రూపులు కాపలా కాయనున్నాయి. దేశంలోని పురుషులంతా రెండు సెంటీమీటర్లకు మించి వెంట్రుకలు పెంచకుండా తన తరహాలోనే హెయిర్ స్టైల్ ను అనుసరించాలని కొన్ని నెలల కిందట కింగ్ జాంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. మహిళలేమో తన భార్య రి సోల్ జు బాబ్ హెయిర్ కట్‌ను ఫాలో కావాలని సలహా ఇచ్చారు. పాశ్చాత్య పోకడలు, హెయిర్ స్టైల్ విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. వారిని పెట్టుబడిదారుల అనుకూలురిగా భావించి నిఘా పెడతామని ఉన్ ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా వరుసగా అణ్వాయుద్ధ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.