సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకాన్ని అత్యధికంగా తెలంగాణ ఉపయోగించుకుంటుందన్న అక్కసు కేంద్రానికి ఉందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, మల్లా రెడ్డి విమర్శించారు. అందుకే అనేక నిబంధనలు పెట్టి నిధులు ఆపే కుట్ర చేస్తోందని ఆరోపించారు.
బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో పీఆర్ మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 8వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉపాధి హామీలో 10.66 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, మళ్లీ పనిదినాలు కావాలని అడిగితే కేంద్రం అనేక షరతులు పెట్టి 11 కోట్ల పనిదినాలు కలి్పంచిందన్నారు. ఎన్ని షరతులు పెట్టినా వాటన్నింటిని పాటి స్తూ కూలీలకు పనిదినాలు కలి్పస్తున్నామన్నారు. 12 కోట్ల పనిదినాలు కలి్పంచే లక్ష్యంతో కేంద్రాన్ని మరిన్ని పనిదినాలు కావాలని కోరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment