విత్‌డ్రా పరిమితికి త్వరలో ముగింపు! | conditions on withdraw ammount will lift soon | Sakshi
Sakshi News home page

విత్‌డ్రా పరిమితికి త్వరలో ముగింపు!

Published Thu, Dec 15 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

విత్‌డ్రా పరిమితికి త్వరలో ముగింపు!

విత్‌డ్రా పరిమితికి త్వరలో ముగింపు!

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతున్న ప్రజానీకానికి కొద్ది రోజుల్లో ఉపశమనం లభించనుంది. నగదు విత్‌ డ్రాపై ఉన్న ఆంక్షలను త్వరలో సడలించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 80శాతం కొత్త కరెన్సీ బ్యాంకులకు వచ్చిన వెంటనే నిబంధనలు సడలించనున్నట్లు తెలుస్తోంది.

రీమనీటైజేషన్‌ పూర్తి కాగానే సహకార బ్యాంకులపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం​. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లలో 50శాతం కొత్త కరెన్సీనే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం వీలయినంత త్వరలోనే ఆంక్షలు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement