రాజమండ్రి / ఏలూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద భక్తులు పాటించాల్సిన నియమావళిని రూపొందించారు. పుష్కర యాత్రికులు అప్రమత్తంగా ఉంటూ.. స్నానఘట్టాల వద్ద ఈ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
- ప్రభుత్వం సూచించిన స్నానఘట్టాలలోనే స్నానం చేయాలి
- పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ముందుగా స్నానం చేసే అవకాశం ఇవ్వాలి
- క్యూ పద్ధతి పాటించాలి
- వీలైనంత తక్కువ సమయంలో పుష్కర స్నానం చేసి మిగతా వారికి అవకాశం ఇవ్వండి
- ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించండి
- హారతి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం
- పొగతాగడం నిషేధం
- ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా వాహనాల్లోనే వెళ్లేందుకు ప్రయత్నించడం
- ఏదైనా సమస్య అనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. భక్తులు కంగారు పడి ఆందోళన కలిగిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని గుర్తించి మసలుకోవాలి
- స్నాన ఘట్టాల వద్ద భక్తులు వినియోగించే మెటీరియల్ వేసేందుకు ఆరెంజ్ రంగు డస్ట్బిన్ లు, పిండ ప్రదానం జరిగే ప్రదేశాల్లో వెదురు డస్ట్ బిన్లలో వ్యర్ధపదార్థాలను పడవేయాలి.