సిరిపురంలో పత్తి పంటను పరిశీలిస్తున్న జేడీఏ విజయనిర్మల
-
జేడీఏ విజయనిర్మల సూచనలు
సిరిపురం (వైరా) : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయశాఖ జేడీఏ విజయనిర్మల సిరిపురం గ్రామంలో శనివారం పత్తి, మిరప, కంది తదితర పంటలను పరిశీలించారు. బెట్ట పరిస్థితుల్లో పంటల యజమాన్యం గురించి రైతులకు వివరించారు.
lపత్తిలో రసం పీల్చే పురుగు అత్యధికంగా ఉందన్నారు. నివారణ చర్యల్లో భాగంగా కాండం పూత పూయాలని తెలిపారు. పత్తిలో పచ్చదోమ, తామర పురుగు నివారణకు మోనోక్రొటోఫాస్ 1.5 మి.లీ, ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటితో కలిపి ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలన్నారు.
lవర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పైర్లపై పొటాషియం నైట్రేట్‌ను లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇలా చేస్తే పంటలకు కొద్దికాలం వరకు ఇబ్బందులుండవన్నారు. రైతులు వ్యవసాయశాఖ, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు.
జేడీఏ వెంట ఏడీఏ శోభన్‌బాబు, ఏఓ ఎన్.అన్నపూర్ణ, ఏఈఓ ఎం. బాలకృష్ణ, సర్పంచ్ రామారావు పాల్గొన్నారు.