అయ్యప్పదీక్ష నియమాలలోని అంతరార్థాలు... | Rules Of Ayyappa Deeksha | Sakshi
Sakshi News home page

అయ్యప్పదీక్ష నియమాలలోని అంతరార్థాలు...

Published Mon, Nov 11 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

Rules Of Ayyappa Deeksha

రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది.

రోగనిరోధక గుణం గల తులసి, రుద్రాక్షలు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి. ఆహారనియమం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. ఇంద్రియ నిగ్రహానికి ప్రధానకారకమైన కామం పైన అదుపు ఉండటం కోసమే అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు.

పాదరక్షలు ధరించకపోవడం వల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. అంతేకాదు... పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు ఉంటుంది. మండలం రోజులపాటు ఈ నియమాలన్నీ సరిగ్గా పాటిస్తే మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుంది. అందుకే ఇన్ని నియమాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement