న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ఫోన్ యూజర్లకు హ్యాండ్‌సెట్ మొత్తాన్ని రిఫండ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఒక షరతు విధించింది. అదేమిటంటే.. సంవత్సర కాలంలో ఆ ఫోన్లో కనీసం రూ.1,500 మొత్తానికి రీచార్జ్ చేయించి ఉండాలి.
యూజర్లు తొలి ఏడాది గనక రూ.1,500 పెట్టి రీచార్జ్ చేయించి ఉంటే... ఫోన్‌ను వెనక్కు ఇచ్చి రూ.500 రిఫండ్ పొందొచ్చు. అదే విధంగా రెండో ఏడాది కూడా రీచార్జ్ చేయించి ఉంటే... అప్పుడు ఫోన్ వెనక్కు ఇస్తే రూ.1,000 రిఫండ్ ఇస్తారు. అలాగే మూడో ఏడాది కూడా చేస్తే... అప్పుడు ఫోన్ ఇచ్చేసి రూ.1,500 రిఫండ్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫోన్ రీచార్జ్ విలువ కనీసం రూ.1,500 కచ్చితంగా ఉండాలి. కాగా రిలయన్స్ జియో గత ఆదివారం నుంచి ఫోన్ల డెలివరీ ప్రక్రియను చేపట్టింది.