Reliance JioPhone
-
విడుదలకు ముందు ఆన్లైన్లో జియో ఫోన్ ఫీచర్స్ లీక్!
విడుదలకు ముందే బడ్జెట్ 'జియోనెక్ట్స్' ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇప్పటికే జియో ఫోన్ వినాయక చవితికి విడుదల రావాల్సి ఉండగా.. సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే, త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్ కాంపోనెట్స్ ధరల కారణంగా.. గతంలో అనౌన్స్ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. దీపావళికి రోజున (నవంబర్ 4న) జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను విడుదల చేస్తామని రిలయన్స్ జియో ధృవీకరించింది. జియో ఫోన్ ఫీచర్స్(అంచనా) 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్ అడ్రినో 306 జీపీయు 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ గో ఓఎస్ ధర - రూ.3,499 (చదవండి: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!) -
జియో ఫోన్‌పై మరో రూమర్, అదే నిజమైతే..!
బడ్జెట్ ఫోన్ 'జియోనెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే జియో ఫోన్ వినాయక చవితికి విడుదల కావాల్సి ఉండగా..సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్ కాంపోనెట్స్ ధరల కారణంగా..గతంలో అనౌన్స్ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే' విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. జియో ఫోన్ పై రూమర్స్ జియో - గూగుల్ భాగస్వామ్యంలో అతి తక్కువ ధరకే విడుదల కానున్న ఆండ్రాయిడ్ ఫోన్‌పై మరోసారి కొన్ని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. గతంలో (సెప్టెంబర్ 10 రిపోర్ట్ ప్రకారం) ఈ ఫోన్ ధర రూ.5వేలని ప్రచారం జరిగింది. ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్ ధరలతో జియో ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని, రూ.5వేలకే వచ్చే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా రూమర్స్‌తో ఫోన్ ధర రూ.3,499కే లభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తొలిసారి భారతీయలు అతితక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే అవకాశం లభించినట్లవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ సంగతి ఎలా ఉన్నా..ఈ ఫోన్ ధర ఎంత అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయ్ కాంపాక్ట్ డిస్ప్లేతో రానున్న ఈ ఫోన్ 5.5 అంగుళాలు ఉండనుంది. క్వాల్కమ్ క్యూఎం 215 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, 2500ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీబీ అండ్ 3జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ రేర్ కెమెరా, స్నాప్ చాట్ లెన్సెస్, వాయిస్ కమాండ్ కోసం గూగుల్ అసిస్టెంట్స్, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్,ఇతర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. -
జియోఫోన్ యూజర్లకు అదిరిపోయే కొత్త ఉచిత ఆఫర్స్!
ఎప్పటిలాగే రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.జియో ఫోన్ ప్రీ పెయిడ్ యూజర్లు కళ్లు చెదిరేలా 'బై వన్ గెట్ ఫ్రీ వన్' ఆఫర్లను ప్రకటించింది. ఉదాహరణకు జియో ఫోన్ యూజర్లు రూ.125తో రిఛార్జ్ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో ఎయిర్టెల్ 46.13 లక్షల మంది యూజర్స్‌ను కోల్పోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో జియో మొత్తం యూజర్లు 43.12 కోట్లకు చేరుకున్నారు. అయితే వీరి సంఖ్యను మరింతగా పెంచేందుకు జియో ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ సారి ముఖ్యంగా గ్రామాల్ని టార్గెట్ చేస్తూ కొత్త కొత్త ఆఫర్లతో ఊరిస్తుంది. మరి ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జియో రీఛార్జ్ ప్లాన్స్ జియో ఫోన్ వినియోగదారులకు జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. అందులో రూ.39,రూ.69,రూ.75,రూ.125 రూ.155,రూ.185గా ఉంది. రూ.39 రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్,14 రోజుల పాటు 100ఎంబీ డేటా అందిస్తుంది. ఆఫర్లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.69 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14రోజుల పాటు ప్రతీ రోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.75 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను అందిస్తుంది. ఆఫర్లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు. రూ.125 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.155 రీఛార్జ్ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్,28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.185 రీఛార్జ్ ప్లాన్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 2జీబీడేటాను అందిస్తుండగా ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను వినియోగించుకునేలా రిలయన్స్ జియో ఆఫర్లను ప్రకటించింది. -
జియో ఫోన్ కూడా పేలిందట..!
కశ్మీర్: దీపావళి పండుగకు జియో కస్టమర్ల చేతుల్లో మెరిసిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ లో ఒక జియోఫోన్ యూనిట్ పేలిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో శాంసంగ్, షావోమీ, ఆపిల్ స్మార్ట్‌ఫోన్ పేలుళ్ల ఉదంతాలు సంచలనం సృష్టించగా ఇపుడు జియో ఫీచర్ ఫోన్ పేలుడు ఘటన మరింత కలకలం రేపింది ఫోన్ రాడార్ అందించిన నివేదిక ప్రకారం చార్జింగ్ లో ఉండగా జియో ఫీచర్ పోన్ వెనుక భాగంలో పేలింది. దీంతో ఈ హ్యాండ్సెట్ వెనుగ భాగం పూర్తిగా మండి, కరిపోయినట్టు రిపోర్ట్ చేసింది. అయితే ముందుభాగం, బ్యాటరీ మాత్రం చెక్కుచెదరలేదని నివేదించింది. ఈ ప్రమాదం తమ దృష్టికి వచ్చిందని, అయితే జియో ఫీచర్ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్టు రిలయన్స్ రీటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. విడుదలకు ముందు ప్రతీ ఫోన్‌ను క్షుణ్ణంగా పరీక్షించినట్టు తెలిపింది. కావాలని సృష్టించిన వివాదంగా తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని వాదించింది. దీనిపై తదుపరి పరిశోధనల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని తెలిపింది. మరోవైపు తప్పు బ్యాటరీది కాదని లైఫ్ డిస్ట్రిబ్యూటర్ పేర్కొంది. పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తుందని, ఈ సంఘటన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వ్యాఖ్యానించిందని కూడా ఈ నివేదిక పేర్కొంది. -
జియో ఫోన్ : షరతులు వర్తిస్తాయి!!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ఫోన్ యూజర్లకు హ్యాండ్సెట్ మొత్తాన్ని రిఫండ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఒక షరతు విధించింది. అదేమిటంటే.. సంవత్సర కాలంలో ఆ ఫోన్లో కనీసం రూ.1,500 మొత్తానికి రీచార్జ్ చేయించి ఉండాలి. యూజర్లు తొలి ఏడాది గనక రూ.1,500 పెట్టి రీచార్జ్ చేయించి ఉంటే... ఫోన్‌ను వెనక్కు ఇచ్చి రూ.500 రిఫండ్ పొందొచ్చు. అదే విధంగా రెండో ఏడాది కూడా రీచార్జ్ చేయించి ఉంటే... అప్పుడు ఫోన్ వెనక్కు ఇస్తే రూ.1,000 రిఫండ్ ఇస్తారు. అలాగే మూడో ఏడాది కూడా చేస్తే... అప్పుడు ఫోన్ ఇచ్చేసి రూ.1,500 రిఫండ్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫోన్ రీచార్జ్ విలువ కనీసం రూ.1,500 కచ్చితంగా ఉండాలి. కాగా రిలయన్స్ జియో గత ఆదివారం నుంచి ఫోన్ల డెలివరీ ప్రక్రియను చేపట్టింది. -
జియో ఫోన్ల డెలివరీ అప్పటి నుంచే...
రిలయన్స్ జియో ఫోన్ ఆలస్యమయ్యే వార్త నిజమయ్యేటట్టే కనిపిస్తోంది. ఆగస్టు 24 ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఫోన్ల డెలివరీ మరికొంతకాలం పాటు పట్టవచ్చని రిపోర్టులు వెలువడుతున్నాయి.. ఆగస్టు 24వ తేదీని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో బుకింగ్స్‌కు వచ్చిన ఈ ఫోన్‌కు అరవై లక్షలకు పైగా ప్రీబుకింగ్స్ వచ్చాయని తెలిసింది. ప్రీబుకింగ్స్ మరింత వెల్లువెత్తుతుండటంతో, ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోలేక కంపెనీ వాటిని నిలిపివేసింది కూడా. కేవలం వినియోగదారుల ఆసక్తిని మాత్రమే ప్రస్తుతం నమోదుచేసుకుంటుంది. ఈ అనూహ్య స్పందనతో జియోఫోన్ డెలివరీని నవరాత్రి పండుగ నుంచి ప్రారంభమవుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకే ఈ డెలివరీ తేదీలు సెప్టెంబర్ 25గా కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్లే చెప్పారు. సెప్టెంబర్ 24 తేదీల్లో స్టోర్లలోకి ఈ ఫోన్లు వస్తాయంటూ రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్ ప్రతినిధులు తెలిపారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్‌లో ఈ ఫోన్‌ను అందించనున్నారు. నగరాల్లో అందుబాటు కూడా భిన్నమైన తేదీల్లో రానున్నాయి. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది. -
జియో ఫోన్ ప్రీ బుకింగ్స్, మరికొద్దిసేపట్లో..ఎలా?
ముంబై: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఫోన్ ప్రీ బుకింగ్ సమయం వచ్చేసింది. రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ ప్రీ బుకింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇవాళ (గురువారం, ఆగస్టు 24) సాయంత్రం 5గంటలనుంచి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో బుకింగ్ ప్రక్రియను, నగదు చెల్లింపు తదితర వివరాలను ఓ సారి చూద్దాం. అధికారిక జియో వెబ్సైట్ ద్వారా రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ నెట్ వర్క్ తో సహా జియో రిటైలర్లు మరియు మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. జియో యాప్ ద్వారా కూడా ఈ 4జీ ఫోన్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. పూర్తిగా ఉచితమైన ఈ 4జీ ఫోన్‌కోసం కస్టమర్లు గురువారం సాయంత్రం 5గంటల నుంచి మొదలుకానున్న ప్రీ బుకింగ్ సందర్బంగా రూ.500 చెల్లించాలి. ప్రీ బుకింగ్ తర్వాత మీకో టోకెన్ నంబర్ ఇస్తారు. దీన్ని డెలివరీ సమయంలో చూపించాల్సి ఉంటుంది. ఫోన్ల డెలివరీ మాత్రం సెప్టెంబర్‌లో ఇస్తారు. అప్పుడు మిగతా రూ.1,000 చెల్లించాలి. ఈ వాలెట్స్, జియో మనీ, పేటీఎం యూపీఐ, క్రెడిట్‌కార్డు, డెబిట్ కార్డులు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్ లో బుకింగ్ ఓపెన్ కాగానే ప్రీ బుక్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పేమెంట్ మోడ్ ఎంపిక చేసుకుని చెల్లింపు చేయాలి. అనంతరం "ప్రోగ్రెస్" బటన్ క్లిక్ చేయాలి. చెల్లింపు విజయవంతంగా జరిగితే, స్క్రీన్ పాపప్ మేసేజ్ వస్తుంది. అలాగే ఫోన్ బుకింక్ అయినట్టుగా మన మొబైల్ నంబర్‌కు కూడా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ మనం వేరొకరికి ఒక ఫోన్ బుక్ చేస్తోంటే, గ్రహీత వ్యక్తి ఫోన్ నంబర్ని నమోదు చేయాలని గుర్తుంచుకోండి. అలాగే మై బుకింగ్స్ ద్వారా బుక్ చేసుకున్న కస్టమర్లు తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో బుక్ చేసుకోవాలంటే ఆధార్ తప్పని సరి. ఒక్క ఆధార్ నంబర్ మీద ఒక్క ఫోన్ మాత్రమే ప్రి-బుకింగ్ చేసుకొనే వీలుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. - వాయిస్ కమాండ్స్పైపనిచేసే సామర్థ్యం - ఆల్ఫా న్యూమరికల్ కీప్యాడ్ - 2.4 అంగుళాల QVGA డిస్ ప్లే - ఎఫ్ఎం రేడియో మరియు టార్చ్‌లైట్ - ఎస్డీ కార్డ్ స్లాట్ - ఫోర్ వే నావిగేషన్ సిస్టమ్ -512 ఎంబీ ర్యామ్ - 0.3 ఫ్రంట్ కెమెరా - 2 ఎంపీ రియర్ కెమెరా - ఇంటర్నల్ స్టోరేజ్‌ను128 విస్తరించుకునే సదుపాయం - 2000 ఎంఏహెచ్‌బ్యాటరీ వీటితో పాటు జియో మ్యూజిక్, జియో సినిమా, జియో టీవీ లాంటి జియో ఇన్‌బుల్ట్ యాప్స్లభ్యం. రిలయన్స్ జియె ఫోన్ కోసం మూడు ప్లాన్లు ప్రకటించింది. వారానికి రూ. 53, రెండు రోజులకు రూ. 23 , రూ .153 ప్లాన్లు. వీటిల్లో అపరిమిత డేటా, అపరిమిత టాక్ టైమ్, అపరిమిత ఎస్ఎంఎస్లు అందిస్తోంది. ఈ మొత్తం రూ.1,500లను మూడేళ్ళ తర్వాత పూర్తిగా రిఫండ్ చేయనున్నామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ ఆధారంగా ఈ ఫోన్‌ను దక్కించుకునే అవకాశం లభించనుంది. సో.. నో మోర్ వెయిటింగ్..బీ హర్రీ అండ్ స్మార్ట్.. జియె సైట్ క్రాష్ అయిందా? జియో ఫోన్ ప్రీ బుకింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నపుడు జియో.కామ్ అందుబాటులోలేదు. ఓవర్ ట్రాఫిక్ కారణంగా సైట్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు జియో యాప్ లో ప్రీ బుక్ ఆప్షన్ కనిపించకపోవడం గమనార్హం.