ఏఐ సామర్థ్యం ఊహకందని విధంగా పలు రంగాల్లో తన హవా చాటుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మనకెంతో ఇష్టమైన వారు ప్రమాదవశాత్తు దూరమయ్యితే ఆ బాధను దిగమింగడం అంత ఈజీ కాదు. అలాంటి వాటిలో చక్కటి ఉపశమనం కలిగిస్తోంది ఏఐ సాంకేతికత. అలాంటి వాటికి సంబంధించిన ఇటీవల్ల కొన్ని భావోద్వేగ కథలను విన్నాం. అయితే ఇలా సాంకేతికతో స్వాంతన, ఉపశమనం పొందడం ఎంతవరు సరైనది. ఎన్నటికీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గదా..!. దీని కారణంగా వాస్తవికతకు దూరమయ్యే పరిస్థితి ఎదురవ్వుతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..
జస్టిన్ హారిసన్ అనే టెక్ వ్యవస్థాపకుడు తన తల్లి ఇంకొద్ది రోజుల్లో దూరమైపోతుందని తెలిసి తల్లిడిల్లిపోతాడు. దీంతో ఆమె గుర్తులు, జ్ఞాపకాలు తనను వీడిపోకుండా ఉండేలా ఏఐ సాంకేతికతో అమ్మ వాయిస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. అతడు ఆమె బతికున్న రోజుల్లోనే ఈ పనికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అన్ని చకచక జరిగిపోయాయి.
అయితే జస్టిన్ మాత్రం తన ఏఐ సామర్థ్యంతో రూపొందించిన తన తల్లి వాయిస్‌తో స్వాంతన పొందుతుంటాడు. తనతోనే తల్లి ఉందన్న భరోసాతో జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాపకం వచ్చినప్పుడల్లా ఆమె వాయిస్ రికార్డుతో కూడిన ఏఐ సాంకేతికతో తల్లితో మాట్లాడిన అనుభూతిని పొందుతుంటాడు. అంతేగాదు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. ఇది నిజంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఓ వరం అంటూ ఆ సాంకేతికతపై పొగడ్తల వర్షం కురిపించాడు.
అయితే మానసిక నిపుణుడు రుచి రుహ్ మాత్రం ప్రారంభ దశలో ఈ సాంకేతికత ఉపశమనంగా అనిపించినా రాను రాను వాస్తవికతలో ఉండేందుకు మెదడు అంగీకరించకపోవచ్చు లేదా ఇష్టపడకపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి దుఃఖం మనిషిని బలవంతుడిగా మారిస్తే..ఈ సాంకేతికతో లభించిన భరోసా..వాస్తవికతకు దూరం చేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ సాంకేతిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన వాళ్లను మాములు మనుషులు చేసేందుకు వినియోగించి ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగ్గా ఉండేలా చెయ్యొచ్చు. కానీ దీనిమీదే ఆధారపడిపోయేలా మాత్రం తయారు కాకూడదని చెబుతున్నారు. చెప్పాలంటే.. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధ కొన్నాళ్లకి తగ్గి సాధారణ మనుషులుగా సహజసిద్దంగానే మారిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం.
ఏనాటికైనా అందరూ చనిపోవాల్సిన వాళ్లే అనే సత్యాన్నికి కట్టుబడి ఉండేలా సహజసిద్ధంగా మనసు సిద్ధమవుతుంది. అందువల్లే పూర్వం వాళ్లు ముక్కుపచ్చలారని పసివాళ్లు దూరమైనా..బాధను దిగమింగి మరీ ధైర్యంగా బతుకును సాగించేవారు. సాంకేతికత పుణ్యమా అని ప్రాణాలు అల్పమైపోయాయి. చిన్న బాధను కూడా తట్టుకోలేని సున్నిత మనస్కులుగా, అల్పమైన జీవులుగా మారిపోతున్నాం. సెన్సిటివిటీ కంటే మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా మనిషి మారితేనా అన్ని విధాల శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
(చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..)
Comments
Please login to add a commentAdd a comment