
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశీయ స్థిరాస్తి రంగంలోకి రూ.110 కోట్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. గతేడాది జనవరి–మార్చి కాలంలో ఈ పెట్టుబడులు రూ.50 కోట్లు ఉండగా.. గతేడాది నాల్గో త్రైమాసిక నాటికి రూ.100 కోట్లుగా ఉన్నాయి. త్రైమాసికంతో పోలిస్తే 8.7 శాతం, ఏడాది కాలంతో పోలిస్తే 140.4 శాతం వృద్ధి రేటు నమోదైంది.
కరోనా మూడో దశ తర్వాత ఆర్ధిక వ్యవస్థ స్థిరపడటం, మార్కెట్లో సెంటిమెంట్ బలపడటం వంటివి ఈ పెరుగుదలకు కారణమని ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొల్లియర్స్ తెలిపింది. అయితే 2022 క్యూ1లోని సంస్థాగత పెట్టుబడులలో 95 శాతం ఆఫీస్, రిటైల్, పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకే వచ్చాయి. గత త్రైమాసికంలో ఆయా విభాగాల పెట్టుబడుల వాటా 83 శాతంగా ఉంది.
కానీ, గతేడాది క్యూ1లో మాత్రం ఈ సెక్టార్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వాటా 99 శాతం ఉండటం గమనార్హం. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్లలో 70 శాతం పెట్టుబడిదారులు విదేశీయులే ఉన్నారు. 30 శాతం దేశీయ ఇన్వెస్టర్లున్నారు.
చదవండి: ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్
Comments
Please login to add a commentAdd a comment