
ఎన్‌ఎస్‌ఈలో నేడు రియల్టీ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. లాక్‌డౌన్ సడలింపులతో నిర్మాణ రంగ పనులు పుంజుకోవడంతో రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 4 శాతం లాభపడి 202.90 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్‌లో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 197.05 పాయింట్ల వద్ద ప్రారభమై ఒక దశలో 205.20 వద్ద గరిష్టాన్ని, 194.65 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన గోద్రేజ్ ప్రాపర్టీస్ దాదాపు 11 శాతం పెరిగి రూ.849.95 వద్ద, ఒబెరాయ్ రియల్టీ 7శాతం పెరిగి రూ.24.45 వద్ద, ఐబీరియల్ ఎస్టేట్ 5శాతం పెరుగుదలతో రూ.46.45 వద్ద, ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ 4.18 శాతం లాభపడి రూ.172 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్రిగేడ్, ఫోనిక్స్, శోభా కంపెనీలు 1-2 శాతం పెరుగదలతో ట్రేడ్ అవుతున్నాయి. సన్‌టెక్ 1శాతం లాభంతో ట్రేడ్ అవుతుంటే డీఎల్‌ఎఫ్ , మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ కంపెనీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment