ఉప్పల్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
♦ ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్
♦ ప్రారంభ ధర రూ.35 లక్షలు
సాక్షి, హైదరాబాద్:
‘‘నిర్మాణంలో నాణ్యత, అందుబాటు ధర, గడువులోగా నిర్మాణం పూర్తి’’ ఇవే మా లక్ష్యమంటోంది శ్రీసాయి హరిహర ఎస్టేట్స్. పాతికేళ్ల రియల్టీ ప్రయాణంలో 50కి పైగా నివాస సముదాయాలను పూర్తి చేసిన ఈ సంస్థ ఉప్పల్‌లో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అందుబాటు ధరలో, ఆధునిక వసతులతో మధ్యతరగతి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమంటున్నారు సంస్థ ఎండీ ఏ యాదవ రెడ్డి.
మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
ఉప్పల్‌లోని చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్ సమీపంలో 5.07 ఎకరాల్లో శ్రీసాయి ఆనందమయి పేరిట గేటెడ్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నాం. ఉప్పల్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదే. 7 బ్లాకులు, ఒక్కో బ్లాక్ 2 లెవల్ పార్కింగ్+ ఐదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 390 ఫ్లాట్లు. 1,155–1,200 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1,600–1,800 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 2 బీహెచ్‌కే ధర రూ.35 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.50 లక్షలు. మొత్తం స్థలంలో 40 శాతం ఓపెన్ స్పేసే ఉంటుంది.
♦ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 20 నెలల్లో 70 శాతం నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే 155 ఫ్లాట్లు గృహప్రవేశానికి రెడీగా ఉన్నాయి. వచ్చే నెలల్లో కొనుగోలుదారులకు అందించనున్నాం. 2019 ఏప్రిల్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తాం.
పీఎంఈవై, సీఎల్‌ఎస్‌ఎస్ వర్తింపు..
శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్ కొనుగోలుదారులు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌యోజన (పీఎంఈవై), క్రెడిట్‌లింక్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్‌ఎస్‌ఎస్) పథకానికి అర్హులు. దీంతో కస్టమర్లు వడ్డీ రాయితీ కూడా పొందే వీలుంటుంది. వసతుల విషయానికొస్తే.. 15 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్‌పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, పవర్ బ్యాకప్, ల్యాడ్ స్కేపింగ్ వంటి వసతులన్నీ ఉంటాయి.
విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్నాయ్..
ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పాలంటే.. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి వరంగల్ హైవేలో 2 కి.మీ. దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. విద్యా, వైద్యం, వినోద కేంద్రాలకైతే కొదవేలేదు. కి.మీ. పరిధిలోనే బిగ్‌బజార్, డెకత్లాన్, ఏషియన్ సినీస్క్వేర్ షాపింగ్ సంస్థలు, స్పార్క్, ఆదిత్య, అంకుర వంటి ఆసుపత్రులు, గ్లోబల్ ఇండియన్, చైతన్య, ఆరోరా వంటి విద్యా సంస్థలున్నాయి. పోచారంలోని ఐటీ కేంద్రానికి 4 కి.మీ., ఘట్‌కేసర్ ఔటర్‌రింగ్ రోడ్డు జంక్షన్‌కు 7 కి.మీ. దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్.
బెస్ట్ అఫడబుల్ హౌజింగ్ అవార్డు
ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక శ్రీసాయి ఆనందమయి ప్రాజెక్ట్‌ను రియల్టీ ఐకాన్స్ 2017 అవార్డుకు ఎంపిక చేసింది. ఈస్ట్ జోన్‌లో బెస్ట్ అప్‌కమింగ్ అఫడబుల్ హౌజింగ్ విభాగంలో ఈ అవార్డు వరించింది. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. నిర్మాణ రంగంలో 25 ఏళ్ల అనుభవం, నిర్మాణంలో నాణ్యత, గడువులోగా నిర్మాణం, అందుబాటు ధర ఇవే అవార్డు ఎంపికకు కారణాలని శ్రీసాయి హరిహర ఎస్టేట్స్ ప్రై.లి. ఎండీ యాదవ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) సర్టిఫికెట్ కోసం కూడా దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు.
సైబర్‌సిటీకి బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ అవార్డు
సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రై.లి.ని టైమ్స్ రియల్టీ ఐకాన్స్ 2017 అవార్డు వరించింది. హైటెక్‌సిటీ సమీపంలో నిర్మిస్తున్న రెయిన్‌బో విస్టాస్–రాక్‌గార్డెన్ ప్రాజెక్ట్‌కు బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ అవార్డు దక్కిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 13 టవర్లు, 20 అంతస్తుల్లో ఉంటుంది.