Double Bedroom Flats : 14 ఫ్లోర్లు, 630 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు. ఒక్కో ఫ్లోర్‌లో 1370 స్క్వైర్ ఫీట్లలో 2 బీహెచ్‌కే నిర్మాణం. ఇప్పుడా ఫ్లాట్లను అమ్మేందుకు బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) సిద్ధమైంది. కొనుగోలు దారులకు హోమ్‌లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా 2బీహెచ్‌కే ఫ్లాట్ ధరలు తక్కువ ధరకే అమ్ముతుండడంతో కొనుగోలు దారులు పెద్ద ఎత్తున అప్లయి చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
బెంగళూరు ఈస్ట్ కోనదాసపూర్ ప్రాంతంలో బీడీఏ 14 ఫ్లోర్‌లలో అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టింది.ఈ అపార్ట్‌మెంట్లలో నిర్మించిన 630 ఫ్లాట్లను అమ్మేందుకు జులై 1 ప్రత్యేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 1370 స్కైర్ ఫీట్‌లో రెండు బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్ సౌకర్యాలు ఉన్నాయి. 1370 స్కైర్ ఫీట్‌లలో 806 స్కైర్ ఫీట్‌లలో కార్పెట్ ఏరియాను కేటాయించింది. ఒక్కో ఫ్లాట్‌ను ఒక్కో ధరకు అమ్మనుంది. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లయి ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
కార్‌పార్కింగ్ కోసం అదనం
నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ల గృహ కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌కు ముందు అపార్ట్‌మెంట్ల జోన్ ఆధారంగా తగిన మొత్తానికి వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని బీడీఏ అధికారులు తెలిపారు. అదనంగా, కేటాయింపుదారులు సంబంధిత కాలానికి విడిగా జీఎస్టీ చెల్లించాలి. అందుబాటులో ఉన్న కవర్డ్ కార్ పార్కింగ్ స్థలం కోసం ప్రతి ఇంటికి అదనంగా రూ .2 లక్షలు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఫ్లోర్‌ను బట్టి ధర మారుతుంది
ఫ్లాట్ల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు 24 నెలల మెయింటెనెన్స్ మొత్తాన్ని చెల్లించాలని బీడీఏ అధికారులు చెబుతున్నారు. మెయింటెనెన్స్ మొత్తం చెల్లించిన తర్వాత బీడీఏ స్వయంగా ఫ్లాట్లను రిజిస్టర్ చేస్తుంది. ఫ్లోర్ లెవల్‌ను బట్టి రెండు బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ధర మారుతుంది.
మొదటి అంతస్తు ఫ్లాట్ ధర ఎంతంటే?
మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు ఫ్లాట్ ధర రూ.48 లక్షలు, ఆరో అంతస్తు ధర రూ.48.24 లక్షలు, ఏడో అంతస్తు ధర రూ.48.72 లక్షలు. ఎనిమిదో అంతస్తు అపార్ట్ మెంట్ ధర రూ.48.96 లక్షలు. తొమ్మిదో అంతస్తు నుంచి 12వ అంతస్తు వరకు రూ.49.2 లక్షల నుంచి రూ.49.92 లక్షల వరకు ధరలు ఉన్నాయి. 13వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ధర సుమారు రూ.50.16 లక్షలు కాగా, 14వ అంతస్తు ధర సుమారు రూ.50.4 లక్షలు.
అంతేకాకుండా ఈ భవనంలోని ప్రీమియం ఫ్లాట్ల ధర ఎక్కువగా ఉంటుంది. మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు రూ.50.4 లక్షలు, ఆరో అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు రూ.50.65 లక్షల నుంచి రూ.52.65 లక్షల వరకు ధరలు ఉంటాయని బీడీఏ అధికారులు తెలిపారు.
చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, కేంద్ర ప్రభుత్వ రివర్స్ మార్ట్‌గేజ్ పథకం గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment