జూలై–సెపె్టంబర్ మధ్య 42 శాతం తక్కువ
ప్రధాన పట్టణాల్లో 18 శాతం క్షీణత
ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెపె్టంబర్ కాలంలో సుమారు 42 శాతం మేర తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే త్రైమాసిక కాలంలో విక్రయాలు 20,658 యూనిట్లుగా ఉన్నట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో సెపె్టంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద 18 శాతం తగ్గి 1,04,393 యూనిట్లుగా ఉండొచ్చని తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,26,848 యూనిట్లుగా ఉన్నాయి. తొమ్మిది పట్టణాలకు గాను ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 22 శాతం, నవీ ముంబైలో ఇళ్ల అమ్మకాల్లో 4 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. మిగిలిన అన్ని పట్టణాల్లో క్షీణించొచ్చని అంచనా వేసింది.
పట్టణాల వారీగా..
→ బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు జూలై–సెపె్టంబర్ కాలంలో 26% క్షీణించి 13,355 యూని ట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 17,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
→ చెన్నై మార్కెట్లో 18 శాతం తక్కువగా 4,634 యూనిట్ల విక్రయాలు జరగొచ్చు.
→ కోల్‌కతా మార్కెట్లో 23% తక్కువగా 3,590 యూనిట్లు అమ్ముడుపోవచ్చు.
→ పుణెలోనూ 19% క్షీణించి అమ్మకాలు 21,306 యూనిట్లుగా ఉంటాయి.
→ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 10% తగ్గి 20,460 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో 22,802 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
→ ముంబైలో 17 శాతం తక్కువగా 10,966 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు కావచ్చు. అదే నవీ ముంబైలో మాత్రం 4 శాతం అధికంగా 7,737 యూనిట్ల అమ్మకాలు జరగొచ్చు.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 22 శాతం వృద్ధితో 10,263 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదు అవుతాయి.
సాధారణమే..
‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో డిమాండ్ బలంగానే ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో విక్రయాలు కొత్త ఆవిష్కరణల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ, అమ్మకాల్లో స్వల్ప క్షీణత అన్నది చరిత్రాత్మకంగా ఉన్న ధోరణే కానీ, ప్రతికూల పరిస్థితులకు సూచిక కాదు’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment