బెంగళూరు: ఆఫీస్ స్పేస్ లీజు (కార్యాలయ వసతి) పరంగా హైదరాబాద్ మార్కెట్ మంచి వృద్ధిని చూపించింది. జూలై–సెపె్టంబర్ కాలంలో స్థూల లీజు పరిమాణం ఏకంగా రెండున్న రెట్లు పెరిగి 2.5 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్ స్పేస్ లీజు ఒక మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు సెపె్టంబర్ త్రైమాసికంలో 2 శాతం వృద్ధితో 13.2 ఎస్‌ఎఫ్‌టీగా నమోదైనట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది.
ఇందుకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజు పరిమాణం 12.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. స్థూల లీజు పరిమాణంలో లీజు రెన్యువల్, ఆసక్తి వ్యక్తీకరణపై సంతకం చేసిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నై మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ లీజుకు డిమాండ్ పెరిగినట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.
పట్టణాల వారీగా..
► బెంగళూరులో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు (తాజా) సెపె్టంబర్ క్వార్టర్‌లో 3.4 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని 4.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీతో పోలిస్తే తగ్గింది.
► ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కట్లోనూ స్థూల లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.2 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది.
► ముంబైలో స్పల్ప వృద్ధితో 1.6 మిలియన్ నుంచి 1.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
► చెన్నైలో ఒక మిలియన్ నుంచి 1.4 మిలియన్‌కు, పుణెలో 0.6 మిలియన్ నుంచి ఒక మిలియన్ చదరపు అడుగులకు స్థూల ఆఫీస్ స్పేస్ లీజు వృద్ధి చెందింది.
ఇదే ధోరణి కొనసాగొచ్చు..
‘‘భారత ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెపె్టంబర్) 2022లో మాదిరే ఉంది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉండడం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌కు మద్దతునిచి్చంది. ఇదే ధోరణి చివరి త్రైమాసికంలోనూ (అక్టోబర్–డిసెంబర్) కొనసాగొచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. 2022లో నమోదైన చారిత్రక ఆఫీస్ స్పేస్ లీజు రికార్డు 2023లో అధిగమిస్తుందేమో చూడాలన్నారు. చివరి త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలో డిమాండ్ బలంగా ఉంటుందని కొలియర్స్ ఇండియాకు చెందిన అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. బెంగళూరు దేశ ఆఫీస్ సేŠప్స్ లీజులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment