న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఓరియంట్ ఎలక్ట్రిక్ సంస్థ లాభం 7 శాతం పెరిగి రూ. 35 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 32 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 434 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలంలో వివిధ విభాగాల పనితీరు మెరుగ్గా ఉందని, ఆదాయం 37 శాతం వృద్ధి నమోదు చేసిందని సంస్థ వెల్లడించింది. ఎంట్రీ స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. ఇక ఎగుమతి మార్కెట్లు కూడా తెరుచుకుంటూ ఉండటంతో కొత్త ఆర్డర్లు కూడా లభించాయని ఓరియంట్ ఎలక్ట్రిక్ తెలిపింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం, మూడో క్వార్టర్‌లో పండుగ సీజన్, వర్షపాతం మెరుగ్గా ఉండటం తదితర అంశాలు డిమాండ్‌కు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు పేర్కొంది. వేసవి సీజన్‌లో దీని సానుకూల ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment