
సాక్షి, సిటీబ్యూరో: గతేడాది నగరంలో రూ.1.05 లక్షల కోట్ల విలువ చేసే గృహాలు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదిలో రూ.1.28 లక్షల కోట్ల విలువైన ఇళ్లతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. 2024లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయించిన యూనిట్ల విలువల్లో గ్రేటర్ వాటా 21 శాతంగా ఉందని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. గతేడాది టాప్–9 నగరాల్లో రూ.6.73 లక్షల కోట్ల విలువ చేసే గృహాలు అమ్ముడుపోయాయి.
దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల విలువలు 12 శాతం మేర పెరిగింది. గతేడాది దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 6.73 లక్షల కోట్ల విలువైన గృహాలు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 63 శాతం, ముంబైలో 13 శాతం విక్రయాల
విలువ పెరగగా.. హైదరాబాద్‌లో 18 శాతం క్షీణించాయి. గతేడాది నగరంలో గృహాల సçప్లయి 25 శాతం, డిమాండ్ 49 శాతం తగ్గాయి. ఫలితంగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు(ఇన్వెంటరీ) 2023లో 17 నెలలుగా ఉండగా.. 2024 నాటికి 20 నెలలకు పెరిగింది.
ఏడాదిలో రివర్స్..
2023లో ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, గుర్గావ్‌ల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ విలువైన గృహాలు అమ్ముడుపోయాయి. ఆ సంవత్సరం నగరంలో రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా ముంబైలో రూ.1.22 లక్షల కోట్లు, ఢిల్లీ–ఎన్‌సీఆర్ లో.. రూ.94,143 కోట్లు, గుర్గావ్‌లో రూ.64,314 కోట్ల విలువైన ఇళ్లు సేల్ అయ్యాయి. కానీ, గతేడాదికి నాటికి ఈ మూడు నగరాల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ విలువైన ఇళ్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ–ఎన్‌సీర్‌లో రూ.1.53 లక్షల కోట్లు, గుర్గావ్‌లో రూ.1.06 లక్షల కోట్లు, ముంబైలో రూ.1.38 లక్షల కోట్లు విలువ చేసే యూనిట్లు అమ్ముడు పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment