Dairy products
-
Akshali Shah: విజయంలో సగపాలు
‘పాడి రంగంలో మన దేశంలో మూడొంతుల మంది స్త్రీలే పని చేసి విజయం సాధిస్తున్నారు’ అని గత సంవత్సరం ‘వరల్డ్ డెయిరీ సమ్మిట్’లో ప్రధాని నరేంద్రమోడి అన్నారు. పశు పోషణ చేసి, పాలు పితికి, ఆదాయ మార్గాలు వెతికి విజయం సాధిస్తున్న మహిళలు ఎందరో నేడు ఆ మాటను నిజం చేస్తున్నారు. నేడు ‘వరల్డ్ మిల్క్ డే’ ‘ఎంజాయ్ డెయిరీ ప్రాడక్ట్’ అనేది థీమ్. ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ పేరుతో డెయిరీ ప్రాడక్ట్స్ దేశంలోనే అగ్రశ్రేణిగా నిలిచింది అక్షాలి షా. 32 ఏళ్ల అక్షాలి షా నేడొక దేశంలో ఉంటే రేపు మరో దేశంలో ఉంటుంది. ఏ దేశంలో పాడి రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో, పాడి ఉత్పత్తులలో ఎలాంటి సాంకేతికత చోటు చేసుకుంటున్నదో నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఆ మార్పులను తాను అధినాయకత్వం వహిస్తున్న ‘పరాగ్ మిల్క్ ఫుడ్స్’ సంస్థలో ప్రవేశపెడుతూ ఉంటుంది. అందుకే ఇవాళ ప్యాకేజ్డ్ పాల రంగంలో, డెయిరీ ఉత్పత్తుల రంగంలో పరాగ్ సంస్థ అగ్రగామిగా ఉంది. అందుకు పూర్తి క్రెడిట్ అక్షాలి షాకు దక్కుతుంది. 2010లో పగ్గాలు చేపట్టి ఎం.బి.ఏ.లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన అక్షాలి షా తన తండ్రి దేవేంద్ర షా స్థాపించి నిర్వహిస్తున్న పాడి పరిశ్రమ రంగంలో 2010లో అడుగుపెట్టింది. అయితే తండ్రి ఆమెకు వెంటనే సంస్థ పగ్గాలు అప్పగించకుండా పెరుగు తయారు చేసే ఒక చిన్న ప్లాంట్‌ను ఇచ్చి దానిని డెవలప్ చేయమన్నాడు. అక్షాలి విజయం సాధించేసరికి మెల్ల మెల్లగా సంస్థలో ఆమె స్థానం, స్థాయి పెరుగుతూ పోయాయి. ‘భారతీయుల సంస్కృతిలో పాలు, గోవు చాలా విశిష్టమైన స్థానంలో ఉంటాయి. మన పురాణాల్లో క్షీరం ప్రస్తావన ప్రముఖంగా ఉంటుంది. అందుకే నేను ఈ రంగాన్ని ఆషామాషీగా నిర్వహించదలుచుకోలేదు. నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగలిగితే కనుక సెంటిమెంట్ కనెక్ట్ అవుతుందనుకున్నాను’ అంటుంది అక్షాలి. ప్రొటీన్ ఉత్పత్తులు శాకాహారంలో 84 శాతం, మాంసాహారంలో 65 శాతం ప్రొటీన్ లోపం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ‘ఆరోగ్య, క్రీడా రంగంలో ప్రొటీన్ ప్రాడక్ట్స్‌కు నేడు దేశంలో ఏటా 2000 కోట్ల మార్కెట్ ఉంది. ప్రొటీన్ పౌడర్లు తీసుకునే ఫిట్నెస్ ప్రియులు చాలామంది ఉంటారు. అందుకే పాల నుంచి సేకరించిన ప్రొటీన్ ప్రాడక్ట్‌లను తయారు చేసి విక్రయిస్తున్నాం. అవతార్, గో ప్రొటీన్ పేరుతో మా ప్రాడక్ట్లు ఉన్నాయి’ అంటుంది అక్షాలి. పరాగ్ సంస్థ నుంచి ‘గోవర్థన్’ పేరుతో నెయ్యి దొరుకుతోంది. ఇక చీజ్ అమ్మకాల్లో అక్షాలి సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు... ఈ అన్ని ఉత్పత్తుల్లో సంస్థ మంచి అమ్మకాలు సాధిస్తోంది. పూర్వం పాలు, పెరుగు స్త్రీలే అమ్మేవారు. వారికి పాలను ఎలా ఆదాయవనరుగా చేసుకోవాలో తెలుసు. అక్షాలి లాంటి నవతరం డెయిరీ లీడర్లు అదే నిరూపిస్తున్నారు. గడప చెంతకు ఆవుపాలు అక్షాలికి పూణెలో గోక్షేత్రం ఉంది. 2011 నాటికి అక్కడి ఆవుల నుంచి పాలు పితికి, కేవలం ఆవుపాలు కోరే 172 మంది ఖాతాదారులకు అందించేవారు. అక్షాలి రంగంలోకి దిగాక శ్రేష్టమైన ఆవు పాల కోసం దేశంలో కోట్ల మంది ఖాతాదారులు ప్రయత్నిస్తుంటారని అర్థం చేసుకుంది. ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో ప్రీమియమ్ ఆవుపాలను అందించడానికి ముందుకు వచ్చింది. మానవ రహితంగా ఆవుల నుంచి పాలను పితికి, ప్యాక్ చేసి, విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చి తాజాగా ఖాతాదారుల గడప దగ్గరకు ప్యాకెట్టు పడేలా నెట్వర్క్ సిద్దం చేసింది. ఇంత శ్రేష్టత పాటించడం వల్ల మార్కెట్లో ఆవు పాల కంటే ఈ పాలు రెట్టింపు ధర ఉంటాయి. అయినా సరే కస్టమర్లు తండోప తండాలుగా ఈ పాలను కోరుకున్నారు. ఇవాళ అక్షాలి సరఫరా చేస్తున్న ఆవుపాలు ఢిల్లీ, ముంబై, పూణె, సూరత్‌లలో విశేషంగా అమ్ముడు పోతున్నాయి. 2027 నాటికి కేవలం ఈ ఆవుపాల టర్నోవర్ 400 కోట్లకు చేరుకుంటుందని అక్షాలి అంచనా. -
పాల ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం దృష్టి!
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి మందగమనం నేపథ్యంలో కేంద్రం డెయిరీ ప్రొడక్టుల దిగుమతుల అవకాశాలను పరిశీలిస్తోంది. పశుసంవర్ధక, డెయిరీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన అందించిన అధికారిక సమాచారం ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. ఇది అంతకు ముందు సంవత్సరం (2020–21)తో పోల్చితే (208 మిలియన్ టన్నులు) కేవలం 6.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వెల్లడించిన అంశాలు క్లుప్తంగా... ► ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేసిన తర్వాత అవసరమైతే వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ► పశువులలో గడ్డలు ఏర్పడడానికి సంబంధించిన చర్మవ్యాధి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనూ దేశ పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ వ్యాధి వల్ల గత ఏడాది దాదాపు 1.89 లక్షల పశువులు చనిపోయాయి. అదే సమయంలో దేశీయ డిమాండ్ 8–10% పెరిగింది. కరోనా మహమ్మారి అనంతరం డిమాండ్ పుంజుకుంది. ► పశువుల చర్మవ్యాధి ప్రభావం వల్ల 2022–23లో పాల ఉత్పత్తి కేవలం 1 నుంచి 2 శాతమే పెరిగింది. సాధారణంగా ఈ ఉత్పత్తి వృద్ధి ఏటా 6 శాతంగా ఉంటుంది. 2023–24పైనా అంచనాలు బలహీనంగానే ఉన్నాయి. ► దేశంలో పాల సరఫరాలో ఎటువంటి అడ్డంకు లు లేవు. స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (ఎస్ఎంపీ) నిల్వ లు తగినంతగా ఉన్నాయి. కానీ పాల ఉత్పత్తులు ముఖ్యంగా కొవ్వులు, వెన్న, నెయ్యి మొదలైన వాటి విషయంలో నిల్వలు తక్కువగా ఉన్నాయి. ► అయితే ఇప్పుడు డెయిరీ ప్రొడక్టుల దిగుమతులు కూడా ఖరీదయిన వ్యవహారమే. ఇది దేశీయ దిగుమతుల బిల్లును పెంచుతుంది. అంతర్జాతీయ ధరలు ఇటీవల పెరగడం దీనికి కారణం. అందువల్లే ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేయడానికి తొలుత ప్రాధాన్యత ఇస్తున్నాం. ► 20 రోజులుగా అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో ఉత్తర భారతదేశంలో పాల కొరత కొంత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నాం. ► పశుగ్రాసం ధరల పెరుగుదల డెయిరీ రంగంలో ద్రవ్యోల్బణానికీ దారితీస్తుంది. గత నాలుగేళ్లలో పశుగ్రాసం పంట విస్తీర్ణం భారీగా పెరగలేదు. సహకార రంగమే ప్రాతిపదిక... అయితే ఇక్కడ ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం మొత్తం ప్రైవేట్, అసంఘటిత రంగాన్ని కాకుండా సహకార రంగం నుంచి వచ్చే పాల ఉత్పత్తి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ అంచనాలు సహకార రంగం నుంచి అందే గణాంకాల ప్రాతిపదికనే ఉంటుంది. భారత్ 2011లో డెయిరీ ప్రొడక్టులను దిగుమతి చేసుకుంది. అటు తర్వాత ఈ పరిస్థితి రాలేదు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ..
సాక్షి, నల్గొండ: అధికారుల ఉదాసీన వైఖరిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంపాదనే ధ్యేయంగా తాగే నీటి నుంచి పాలు, అల్లం తదితర నిత్యావసరాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. బీబీనగర్ మండలం హైదరాబాద్ దగ్గరగా ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ పదార్థాలను మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లతో పాటు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. దీంతో బీబీనగర్ మండలం రోజురోజుకు కల్తీకి కేరాఫ్‌గా మారుతోంది. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో కల్తీ పాల తయారీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శవాలను భద్రపరిచే కెమికల్ కలుపుతూ.. గతంలో మండలంలోని బీబీనగర్, జైనపల్లి, కొండమడుగు గ్రామాల్లోని కొందరు అక్రమార్కులు పొలాల్లో చల్లే యూరియా వాడి పాలను కల్తీ చేసేవారు. ఇప్పుడు ఏకంగా మనుషుల శవాలను భద్రపరిచేందుకు వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను కలుపుతుండటాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తాజాగా మండలంలోని మొబైల్ టెస్టింగ్ వ్యాన్‌తో చేపట్టిన తనిఖీల్లో బయటపడింది. కొండమడుగు గ్రామంలోని ఓ పాల వ్యాపారి తన పాల సేకరణ సెంటర్లో పాలు పగలకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా మార్చురీల్లో మృతదేహాలు కుళ్లిపోకుండా వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. దాంతో పాటు పాలల్లో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్‌ను కలిపి అధికంగా పాలను తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదవండి: మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే.. నెమురుగొముల పరిధిలో బయటపడిన కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ (ఫైల్) అల్లం, నీళ్ల బాటిళ్లు సైతం పాల కల్తీతో పాటు కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ సైతం కల్తీ చేసి విక్రయించడాన్ని గతంలో నెమురగొముల గ్రామ పరిధిలో పోలీసులు గుర్తించారు. కుళ్లిపోయిన అల్లం, ఎల్లిగడ్డలను మిషన్లలో వేసి అది పాడవకుండా పేస్ట్‌లో కెమికల్‌ను వాడుతున్నట్లు తేలింది. అలాగే బీబీనగర్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు విక్రయించే వాటర్ బాటిళ్ల విషయంలో చిరు వ్యాపారులు కల్తీకి పూనుకున్నారు. కిన్లీ, బిస్లరీ స్లిక్కర్లతో కూడిన వాటర్ బాటిళ్లను సేకరించి వాటిలో మామూలు వాటర్‌ను నింపి విక్రయించారు. ఈ విషయాన్ని పోలీసులు గతంలో వెలుగులోకి తెచ్చారు. ఇలా మండలంలో ఒకదాని తర్వాత మరొకటి కల్తీ వ్యాపారం బయటపడుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కల్తీ జరగకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఉన్న బాటిళ్లలో మామూలు వాటర్‌ను నింపి అమ్ముతున్న అక్రమార్కులు (ఫైల్) తనిఖీలు ముమ్మరం చేస్తాం గ్రామాల్లో పాల కల్తీకి పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా కల్తీ పాలు తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాం. పాలు, ఇతర ఫుడ్ తయారీకి సంబంధించిన విషయాల్లో అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వాలి. – జ్యోతిర్మయి, జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
అమూల్ కంటైనర్లకు హైకోర్టు అనుమతి
సాక్షి, అమరావతి: విజయవాడలో అమూల్ సంస్థ పాల ఉత్పత్తుల విక్రయానికి కంటైనర్ బూత్‌ల ఏర్పాటుకు హైకోర్టు అనుమతించింది. అయితే వాటి కార్యకలాపాలను ప్రారంభించవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమూల్ కంటైనర్ల ఏర్పాటుకు విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ తీర్మానం చేయడాన్ని సవాలు చేస్తూ టీడీపీ కౌన్సిలర్ నెలిబండ్ల బాలస్వామి దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నామినేషన్ పద్ధతిలో బూత్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చారని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు తెలిపారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ (బీఎస్‌వో) ప్రకారమే నడుచుకున్నామని చెప్పారు. ఉచితంగా ఇవ్వలేదని, ఆ ప్రాంతాల్లో భూమి మార్కెట్ విలువలో 10 శాతానికి ఇచ్చామన్నారు. ఎలాంటి రాయితీలు, అదనపు ప్రయోజనాలు లేవన్నారు. దీని వెనుక మహిళా సాధికారిత ఉందన్నారు. మహిళా సంఘాల నుంచి పాలు, ఇతర ఉత్పత్తులు కొని, వాటిని బూత్‌ల ద్వారా విక్రయిస్తుందని తెలిపారు. ఇవి తాత్కాలిక షెడ్లు మాత్రమేనన్నారు. వీటిని రోడ్ల మార్జిన్లలో ఏర్పాటు చేస్తున్నారని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని ఆదినారాయణరావు చెప్పారు. రాష్ట్రంలో పాల సొసైటీలను ప్రోత్సహించకుండా ప్రభుత్వం అమూల్‌ను ప్రోత్సహిస్తోందన్నారు. దీనికి సుమన్ స్పందిస్తూ, ఇలాంటి వ్యాజ్యాల ద్వారా మహిళా సాధికారితను అడ్డుకుంటున్నారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కంటైనర్ల ఏర్పాటుకు అనుమతించింది. పాడి రైతుల సంక్షేమం కోసం అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
‘క్రీమ్‌లైన్’ ఏటా రూ.40 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ ఏటా రూ.30–40 కోట్ల దాకా పెట్టుబడి చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ సీఈవో భూపేంద్ర సూరి వెల్లడించారు. సీవోవో ప్రమోద్ ప్రసాద్‌తో కలిసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ సమీపంలోని కేశవరం వద్ద ఉన్న ప్లాంటు విస్తరణకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. టెట్రా ప్యాక్‌లో పాలు, పాల పదార్థాలు ఇక్కడ తయారవుతాయి. విస్తరణ పూర్తి అయితే ఈ కేంద్రం సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 22,000 నుంచి 70,000 లీటర్లకు చేరుతుంది. 10 ప్లాంట్లలో కలిపి రోజుకు 13.6 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది’ అని వివరించారు. రవాణా వ్యయాలు, పాల సేకరణ ఖర్చు అధికం అయినందున ధర పెరిగే అవకాశం ఉందన్నారు. -
టైఫాయిడ్ టైంలో ఇవి తినడం చాలా ప్రమాదకరం.. మరేం తినాలి?!
పరిసరాల అపరిశుభ్రత కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.. టైఫాయిడ్ లక్షణాలు ఏ వ్యాధినైనా ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత సులువుగా దానిని నయం చేయవచ్చు. టైఫాయిడ్‌ను కూడా తేలికగా గుర్తించవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు లేద మలబద్ధకం, అలసట..వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు.. టైఫాయిడ్ జ్వరం నుంచి త్వరగా తేరుకోవడానికి కొన్ని రకాల ఆహార అలవాట్లు తప్పక పాటించవల్సి ఉంటుంది. ముఖ్యంగా తొక్క తీయకుండా తినగలిగే పండ్లు, కూరగాయాలు, ఘాటుగా ఉండే ఆహారం, నెయ్యి లేదా నూనెతో వండిన పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ కడుపులో మంట లేదా తాపాన్ని పుట్టించే అవకాశం ఉంది. ఇవి కూడా తినకూడదు కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ వంటి వాటిని కూడా తినకపోవడం మంచిది. అలాగే వ్యాధి నివారణకు ఆటంకాలుగా పరిణమించే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి కూడా తినకూడదు. మరేం తినాలి? టైఫాయిడ్‌తో బాధపడే వారికి దివ్యౌషధం ఏంటంటే.. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు. అంటే.. సోయా బీన్స్, వివిధ రకాల గింజలు (నట్స్), భిన్న రకాలైన విత్తనాలు, గుడ్లు.. వంటివి తినాలి. ఆలుగడ్డ వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పాలు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు కూడా తినొచ్చు. అలాగే టైఫాయిడ్ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకూడదు. ఈ ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుకోవచ్చనేది నిపుణుల మాట. చదవండి: Health Tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇది తరచుగా తింటే సరి! -
50 రకాల కొత్త ఉత్పత్తులతో వస్తున్న ‘విజయ డెయిరీ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ మార్కెట్లోకి 50కిపైగా కొత్త ఉత్పత్తులతో దూసుకురానుంది. ఇప్పటివరకు పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకే పరిమితంకాగా.. త్వరలో తృణధాన్యాల లడ్డూలు, చిక్కీలు, చాక్లెట్లు, బూందీ ఇతర మిక్చర్లను అందుబాటులోకి తేనుంది. ఒకట్రెండు రోజుల్లో 12 వెరైటీలను, 10 రోజుల్లో మరో 10 రకాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని డెయిరీ అధికారులు చెప్తున్నారు. దసరా నాటికి మరో 20, దీపావళి నాటికి ఇంకో 10 ఉత్పత్తులను తమ ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తామని పేర్కొంటున్నారు. డెయిరీ ఉత్పత్తులకు ఆదరణ విజయ డెయిరీ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దూద్‌పేడా, మిల్క్కేక్లతోపాటు ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నెయ్యి మైసూర్పాక్కు కూడా మంచి గిరాకీ ఉంది. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఉత్పత్తులను మార్కెట్లోకి తేవాలని విజయ డెయిరీ గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలతో కూడిన స్వీట్లను అందుబాటులోకి తెస్తోంది. జొన్న, రాగి, మిల్లెట్ లడ్డూలతోపాటు బేసిన్ లడ్డూలను తయారు చేస్తోంది. ఇతర డెయిరీలకు దీటుగా సున్నుండలు, మలాయి లడ్డూ, బాదం హల్వా తయారుచేసి ఔట్లెట్లలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ►వేరుశనగతో పాటు కాజు, బాదం చిక్కీలు, గులాబ్‌జామ్, రస్మలాయ్ మిక్స్‌ల తయారీపై విజయ డెయిరీ అధికారులు ఇప్పటికే ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. నీళ్లలో కలుపుకొని తాగేలా బాదం మిక్స్ పొడిని తయారు చేస్తున్నారు. ►కొత్త ఉత్పత్తులన్నింటినీ మార్కెట్లో ఉన్న ఇతర సంస్థల కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ►ఇక అమూల్ డెయిరీకి దీటుగా చాక్లెట్ల తయారీ, కారం బూందీ, మిక్చర్ లాంటి స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తేవడంపైనా దృష్టిపెట్టారు. ►విస్తృతంగా మార్కెట్లోకి ప్రవేశించే ఏర్పాట్లలో భాగంగా ఈ నెలలోనే భారీ డెయిరీకి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిసింది. -
అన్నదాతలకు ‘అమూల్’ ఫార్ములా భేష్
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మూలం ఎక్కడుందో పాలకులు గ్రహించాలి. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కాదు కదా.. నామమాత్రపు ధర కూడా రావడం లేదు. ఇందుకు టమాటా, బెండ, ఉల్లి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలే ఉదాహరణ. మన కళ్లముందే అత్యద్భుతమైన అమూల్ డైరీ సహకార వ్యవస్థ ఉండగా, సాగు దిగుబడులకు సైతం అలాంటి సహకార వ్యవస్థను ఎందుకు వర్తింప చేయకూడదు? అమూల్ డైరీ సహకార వ్యవస్థలో వినియోగదారులు పాలపై వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 పైసల వరకు రైతుల చేతికి వస్తుంది. భారతదేశం విజయవంతమైన తన సహకార డైరీల బ్రాండ్ నుంచి పాఠం నేర్చుకోకూడదా? వినియోగదారు చెల్లించే ధరల్లో 40 నుంచి 50 శాతం రైతుకి దక్కేలా విధానాలు రూపొందించకూడదా? ఈ వార్త ఇప్పుడు ఎవరికీ షాక్ కలిగించకపోవచ్చు. బెండకాయలను మార్కెట్లో వినియోగదారులు కిలోకు రూ. 40లు వెచ్చిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని బద్వానీలో బెండకాయల హోల్‌సేల్ ధర కిలోకి ఒక్కరూపాయికు పడిపోయింది. దీంతో కడుపు మండిన రైతు నాలుగు ఎకరాల్లో పండించిన పంటను ట్రాక్టర్‌ను ఉపయోగించి దున్నించేశాడు. బెండకాయ ధరలు ఇంత తక్కువకు పడిపోవడం చూసిన ఈ జిల్లాలోని మరికొందరు రైతులు తమ భూమిలో పండిం చిన పంటను పశువులకు వదిలేశారు. మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, కూరగాయల అమ్మకాలు ఇలా పతనం కావడం అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతుండటం విషాదకరం. ఇప్పుడు పంజాబ్‌లో చెరకు రైతుల దుస్థితిని పరిశీలిద్దాం. చెరకు కోత సీజన్ ప్రారంభమవుతున్న సమయానికి కూడా రాష్ట్రంలోని 16 చెరకు మిల్లులలో 14 (సహకార, ప్రైవేట్ రంగాలకు చెందిన వాటిలో) మిల్లులు గత సంవత్సరం చెరకు కోతకుగాను చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయల బకాయిని ఇప్పటికీ చెల్లించలేదన్న విషయం బయట పడింది. ఒక్క పంజాబ్ మాత్రమే మినహాయింపు కాదు. సెప్టెంబర్ 11 నాటికి దేశవ్యాప్తంగా చెల్లించని చెరకు కోత బకాయిలు రూ. 15,683 కోట్లకు చేరుకున్నాయని, దీంట్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పార్లమెంటులో ఇటీవల ఒక సభ్యుడు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. తమ బకాయిలను చెరకు మిల్లులు ఒకటి రెండు సంవత్సరాలు సకాలంలో చెల్లించకపోయినప్పటికీ చెరకు రైతులు ఎలాగోలా జీవించగలిగారు. ఉద్యోగుల వేతనం ఒక్క నెల ఆలస్యం అయిందంటే చాలు ఎంత గగ్గోలు మొదలవుతుందో ఎవరైనా ఊహించుకోవలసిందే. ఈ వార్తల్లో అసాధారణమైన విషయం ఏముందని మీరు ప్రశ్నిం చవచ్చు. ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే కదా. పంటలకు గిట్టుబాటుధరలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు వీధుల్లోనే టమాటాలను, బంగాళదుంపలను, ఉల్లిపాయలను పారబోస్తున్న దృశ్యాలు మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. 2018–19 బడ్జెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వం రూ. 500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి పరిణామాలను దేశం చూసింది. సగటు కుటుంబం తీసుకునే కూరగాయల్లో ఈ మూడింటికి అగ్రభాగం ఉంటుంది. టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపల ధరను స్థిరీకరించడమే ఆపరేషన్ గ్రీన్స్ పథకం లక్ష్యం. అనేక కారణాల వల్ల ఈ పథకం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అయితే మూడింటికి మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని ఈ జూన్ నుంచి ఆరునెలల కాలానికి అన్ని కూరగాయలు, పండ్ల ఉత్పత్తులకు వర్తిస్తూ పొడిగించారు. ఈ ప్రకటనలతో పనిలేకుండానే, ఆయా సీజన్లలో పండే కూరగాయల ధరలు ఎప్పుడూ పతనదిశలోనే ఉంటాయి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా స్థానిక వాల్యూ చైన్‌కు అంతరాయం కలగక ముందే, కూరగాయలు పండించే రైతులు ధరల విషయంలో పదేపదే దెబ్బతింటూ వచ్చారు. తృణధాన్యాలకు, ఇతర ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ఉన్నట్లుగా కూరగాయలకు మద్దతు ధర అనేది లేకపోవడంతో తమ కూరగాయలకు మార్కెట్లో లభిస్తున్న రేటు నిజమైనదా కాదా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కూరగాయలు పండించడానికి, కోయడానికి, రవాణా చార్జీలకు అయిన ఖర్చులను తీసివేయగా రైతులు ఉత్తిచేతులతో మార్కెట్ నుంచి వెనుదిరగాల్సిన సందర్భాలు అనేకసార్లు వారికి అనుభవంలోకి వచ్చాయి. నిజానికి, రైతులు కూరగాయలను పండిస్తున్నప్పుడు, తాము పంటపై లాభాన్ని కాకుండా నష్టాలను పండిస్తున్నామన్న విషయం వారికి అవగాహనలో ఉండటం లేదు. 2000–2016 కాలానికి ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ సంయుక్త అధ్యయనం ప్రకారం, పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరను తమకు కల్పించనందుకు గానూ భారతీయ రైతులు ప్రతి ఏటా రూ.2.64 లక్షల కోట్లను నష్టపోతున్నారని తేలింది. అయితే ఈ అధ్యయనం పేర్కొన్న నష్టాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే తమ అధ్యయనంలో భాగంగా వీరు చాలా తక్కువ పంటలను మాత్రమే పరిశీలించారు. ఈ స్వల్ప స్థాయి అధ్యయనం సైతం.. ప్రతి ఏటా మన రైతులకు చివరికి ఏం మిగులుతోంది అనే అంశంపై దారుణ సత్యాలను వెల్లడించింది. రైతులు పండించే పంటలకు నిర్ణీత ధర చెల్లిస్తామన్న హామీ లేకుండా, పంటల తీరును వైవిధ్యభరితంగా మార్చాలన్న ఆలోచన అర్థరహితం మాత్రమే. అందుకనే పంజాబ్ రైతులను గోధుమ, వరి పంట నుంచి మళ్లించి పంటల వైవిధ్యత వైపు మళ్లించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటినీ ఆ రైతులు వమ్ము చేస్తూనే వచ్చారు. తృణధాన్యాలు, కాయ ధాన్యాలు, నూనె గింజలు, మొక్క జొన్న వంటి పంటలను పండించడం చాలా అవసరం అనే విషయాన్ని తోసిపుచ్చాల్సిన పని లేదు కానీ, తాము పండించే పంటలకు కచ్చితమైన ధర, సమర్థవంతమైన సేకరణ వ్యవస్థను ఏర్పర్చకుండా, మార్కెట్ శక్తుల ప్రభావానికి తమను బలిచేసే వైవిధ్యపూరితమైన పంటల వైపు రైతులు మారిపోతారని ఎలా భావించాలి? దశాబ్దాలుగా రైతులు న్యాయమైన ధరలకోసం పోరాడాల్సి వస్తున్న పరిస్థితుల్లో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్థిక నమూనా భారాన్ని నిశ్శబ్దంగా మోయాల్సి వస్తోంది. మరోవైపు పారిశ్రామిక అనుకూల దృక్పథాన్ని దాటి రైతుల వైపు చూడటంలో మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు విఫలమవుతున్నారు. దశాబ్దాలుగా వ్యవసాయంలో మార్కెట్ సంస్కరణలు అమల్లో ఉన్న అమెరికాలో సైతం చిన్న సన్నకారు రైతులు కుప్పగూలిపోయారు. అమెరికా వ్యవసాయం శ్రేష్టమైనదని భావిస్తుంటారు. వారి వ్యవసాయం జాతీయ, అంతర్జాతీయ వాల్యూ చైన్లలో భాగంగా ఉంటుంది కాబట్టి రైతులకు అది సంపదలను కొనితెస్తుందని భావి స్తుంటారు. కానీ వాస్తవికత మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. అమెరికా వ్యవసాయ విభాగం చెబుతున్న దానిప్రకారం వినియోగదారులు ఆహార పదార్థాలకోసం పెట్టే ప్రతి డాలర్ వ్యయంలో 8 శాతం మాత్రమే రైతులకు దక్కుతోందని తెలుస్తోంది. పైగా బడా రిటైల్ వ్యాపార సంస్థలు ఉనికిలోకి రావడంతో రైతుల వాటా మరింత క్షీణించిపోయింది. దీన్ని అమూల్ డైరీ సహకార వ్యవస్థతో పోల్చి చూడండి. అమూల్ పాల వినియోగదారులు పాలకోసం వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 శాతం వరకు రైతులకు అందుతోంది. మరి వ్యవసాయ సరకులకు కూడా ఈ దేశీయ డైరీ సహకార సంస్థ నమూనాను విస్తరింపచేస్తే ఉత్తమంగా ఉండదా? అమెరికా వ్యవసాయంలో బడా వ్యాపారులు అడుగు పెట్టడం అనేది అక్కడ చిన్న రైతులకు ఎలాంటి మేలూ కలిగించకపోగా వారిని వ్యవసాయంనుంచే పక్కకు నెట్టేశారు. మరి భారత దేశం తన సొంత విజయవంతమైన సహకార డైరీ వ్యవస్థల నుంచి పాఠం నేర్చుకోకూడదా? ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై వినియోగదారులు వెచ్చించే ప్రతి రూపాయలో (పాల విషయంలో 80 శాతం వాటా రైతులకే దక్కుతోంది) కనీసం 40 నుంచి 50 శాతం వరకైనా రైతు పరమయ్యే విధంగా సరికొత్త ఆర్థిక నమూనాలను తీసుకురావడంపై మన విధాన నిర్ణేతలు ఆలోచించకూడదా? వ్యవసాయ ధరలను క్షీణింప చేయడం ద్వారా వ్యవసాయంపై నిరంతరం భారం మోపుతూ ఆర్థిక సంస్కరణలు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగానే రైతులు న్యూఢిల్లీ వరకు మార్చ్ చేస్తున్నారు. శీతల వాతావరణంలో పోలీసులు తమపై ప్రయోగిస్తున్న వాటర్ కానన్లను సైతం లెక్క చేయని రైతులు తమ జీవితాలపై పేరుకున్న సుదీర్ఘ శీతాకాలానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఆర్థిక సంస్కరణలను చెల్లుబాటయ్యేలా చూడటానికి ఎంతకాలమిలా వ్యవసాయరంగాన్ని దారిద్య్రంలో ముంచెత్తుతూ ఉంటారు? వ్యవసాయదారులకు కూడా కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలను, పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. వేరు మార్గం లేక పండిం చిన పంటలను వీధుల్లోనే పారబోసే గతి పట్టకుండా తమను కాపాడే ఒక సమర్థ యంత్రాం గాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటిది అమలైనప్పుడు దశాబ్దాలుగా వ్యవసాయ వ్యాపారం ద్వారా కలుగుతున్న దుస్థితి నుంచి బయటపడగలమని వీరి నమ్మకం. అందుకనే రైతు అనుకూల విధానాలను రూపొందించడంలో కొనసాగుతున్న కరువుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. చారిత్రకంగా రైతులకు జరుగుతూ వస్తున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఢిల్లీలో రైతు మార్చ్ చెబుతోంది. అప్పుడు మాత్రమే వ్యవసాయం గర్వకారణంగా ఉండే పరిస్థితి మళ్లీ నెలకొంటుంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అన్నం తక్కువ తిందాం..!
సాక్షి, హైదరాబాద్: తిండి కలిగితే కండ కలదోయ్... కండకలవాడేను మనిషోయ్.. అన్నాడు కవి గురజాడ. అలాగని ఏది పడితే అది తింటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో మెజార్టీ జనాలు ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటూ.. కొవ్వులు, గ్లూకోజ్‌లు అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా లాగించేస్తున్నారు. దీంతో శరీర సౌష్టవం దెబ్బతినడంతో పాటు అనారోగ్యానికి దారితీస్తోంది. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరుగా విభజించి ప్రజల ఆహారపు అలవాట్లపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సంయుక్తంగా పరిశీలన చేశాయి. అనవసరమైన, శరీరానికి భారమయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించాయి. ఈ క్రమంలో ఏయే పదార్థాలను ఎంత మోతాదులో తింటే మేలు అన్న దానిపై ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ పలు సూచనలు చేశాయి. అలాగే వీటన్నింటినీ వివరిస్తూ ‘వాట్ ఇండియా ఈట్స్’ నివేదికను విడుదల చేశాయి. పరిశీలన సాగిందిలా... దేశాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్, నార్త్ ఈస్ట్‌గా విభజించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, తీసుకుంటున్న విధానాన్ని 24 గంటల(ఒక రోజు)ను ఒక యూనిట్ గా పరిగణించి పరిశీలన చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు భిన్న ఆహారపు అలవాట్లున్నా... తీసుకునే విధానం మాత్రం సరిగా లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలను, దక్షిణాది రాష్ట్రాల్లో అన్నం, జొన్న రొట్టెలు అధికంగా> తింటున్నారు. దీంతో ప్రొటీన్ల కంటే గ్లూకోజు అధికంగా పోగవుతూ.. క్రమంగా కొవ్వుల రూపంలోకి మారి అనారోగ్యానికి కారణమవుతోంది. దేశవ్యాప్తంగా తృణ, చిరుధాన్యాల వినియోగం అధికంగా ఉంది. పప్పులను తక్కువగా, మాంసాహారాన్ని మోతాదులోనే భుజిస్తున్నారు. పాల ఉత్పత్తులతో పాటు కాయగూరలు, పండ్లు, గింజలను తక్కువగా తీసుకుంటున్నారు. దుంపలను ఎక్కువగా తీసుకుంటుండగా... పట్టణ ప్రాంతాల్లో కొవ్వు పదార్థాల వినియోగం అధికంగా ఉంది. ‘మై ప్లేట్ ఫర్ ది డే’ మెనూ ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు సగటున 2 వేల కిలో కెలోరీల ఆహారం సరిపోతుంది. దీన్ని సరైన మోతాదులో తీసుకోవడం, వ్యాయామంతో శరీర సౌష్టవం, చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎన్ ఐఎన్ సూచిస్తోంది. రోజువారీగా ఏయే పదార్థాలు ఎంత శాతం తీసుకోవాలన్న దానిపై ఒక మెనూను రూపొందించి ‘మై ప్లేట్ ఫర్ ది డే’ పేరు పెట్టింది. ఇందులో 40% ఆహారంగా బియ్యం లేదా గోధుమలు, మొక్కజొన్నతో పాటు తృణ ధాన్యాలైన జొన్నలు, రాగులు, అరకలు, సజ్జలతో వండిన పదార్థాలు కూడా తీసుకోవాలి. 11% పప్పులు, 6% మాంసాహారం, 10% పాలు లేదా పెరుగు, 5% కాయగూరలు, 3% పండ్లు, 8% బాదం, ఖాజు, పల్లీ తదితర నట్స్ తినాలి. కొవ్వు లేదా నూనె పదార్థాలను 12% తీసుకోవాలి. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సగటు మనిషి ప్రామాణిక బరువును ఐదు కిలోలు పెంచగా, మనిషికి కావాల్సిన కేలరీలను వారి శ్రమ ఆధారంగా పోలుస్తూ మార్పులు చేశారు. ► పప్పుదినుసులతో చేసిన ఆహారానికి బదులుగా గుడ్లు, మాంసం, చేపలను అదే మోతాదులో తీసుకోవచ్చు. ► పండ్లను జూస్‌ల రూపంలో కాకుండా నేరుగా తినేలా తీసుకోవాలి. ► కొవ్వులు, నూనె పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నిత్యం ఒకే రకమైన నూనె పదార్ధాలు కాకుండా వేరువేరుగా తీసుకోవాలి. ► ఊబకాయం ఉన్నవారు, లేదా బరువు తగ్గాలనుకున్న వారు బియ్యం, గోధుమ తదితర ధాన్యాలతో చేసిన పదార్థాలను తగ్గించాలి. -
జిడ్డు చర్మ సమస్యను అధిగమించాలంటే..
సాక్షి, హైదరాబాద్: మానవ జాతికి అందమనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అందాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అనేక క్రీమ్‌లు, లోషన్లు వాడుతుంటారు. ప్రస్తుత పోటీ యుగంలో విపరీతమైన ఒత్తిడి, శరీర తత్వానికి కావాల్సిన ఆహారం తినకపోవడం తదితర కారణాలతో ప్రజలు జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిడ్డు సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని పదార్థాలను తినకూడదని అపోలో టెలిహెల్త్ సీనియర్ డర్మటాలజిస్ట్ డాక్టర్ రాధా గంగాతి సూచిస్తున్నారు. డాక్టర్ సూచిస్తున్న తినకూడని ఆహారాలు ఏవో చూద్దాం. డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండడం: జిడ్డు చర్మ సమస్యతో బాధపడుతున్న వారు డయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలని డాక్టర్ సూచిస్తున్నారు. కానీ కొందరు పిల్లలకు పాలు తాగే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ కేలరీలతో లభించే సోయా పాలను తాగవచ్చని తెలిపింది. మరోవైపు జిడ్డు చర్మ సమస్యను జయించాలంటే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండడం మేలని డాక్టర్ సూచిస్తున్నారు చాక్లెట్స్కు దూరంగా ఉండడం చాక్లెట్స్ తినడం ద్వారా జిడ్డు సమస్య వేదిస్తుంది. చాక్లెట్లో ఉండే చక్కెర శాతం చర్మం జిడ్డుగా మారడానికి ప్రేరేపిస్తుంది. అయితే చాక్లెట్ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్.. 15రోజులకు ఒకసారి డార్క్ చాక్లెట్ తిన్నట్లయితే అంత ఇబ్బంది ఉండదని డాక్టర్ సూచించింది జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం ప్రస్తుత ప్రపంచంలో జంక్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు చాలా అరుదు. కానీ జిడ్డు చర్మ సమస్యను నివారించాలనుకునేవారు జున్ను తదితర పదార్థాలకు దూరంగా ఉండాలని, డయిరీ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో నూనె గ్రంథుల పరిణామం పెరిగి జిడ్డు, మొటిమల సమస్య తలెత్తుతుంది మాంసాహారానికి దూరంగా ఉండడం మీరు మాంసాహార ప్రియులా, అయితే నిత్యం మాంసాహారం భుజించడం వల్ల శరీరంలో చెడు కొవ్వు శాతం అధికమయి జిడ్డు సమస్య తెలెత్తుతుంది. కాగా ఆహార నియమాల అనేవి శరీర తత్వానికి అనుగుణంగా తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని డాక్టర్ గంగాతి పేర్కొన్నారు -
ఇవి తీసుకుంటే మధుమేహానికి దూరం
లండన్ : కొవ్వు అధికంగా ఉండే వెన్న, పెరుగు, మీగడ వంటి డైరీ ఉత్పత్తులను తరచూ తీసుకుంటే టైప్ 2 మధుమేహం ముప్పు తగ్గించుకోవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. వీటిని తక్కువగా తినేవారితో పోలిస్తే అత్యధికంగా తీసుకునేవారిలో టైప్ 2 మధుమేహం ముప్పు 30 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా కొవ్వు తక్కువగా ఉండే డైరీ ఉత్పత్తులను ఎంచుకోవాలని అమెరికన్లకు యూఎస్ డైటరీ గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి. పాలు, ఇతర డైరీ ఉత్పత్తుల్లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో తాజా అథ్యయనం ఆసక్తికర అంశాలను ముందుకుతెచ్చింది. డైరీ ఉత్పత్తులను తీసుకోకుండా ప్రజలను ప్రోత్సహించరాదని తమ అథ్యయనంలో వెల్లడైందని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు తెలిపారు. డైరీ ఆహారంతో చేకూరే జీవక్రియల ప్రయోజనాలపై పునఃసమీక్ష అవసరమని పేర్కొన్నారు. డైరీ ఉత్పత్తుల్లో గుండె జబ్బులకు దారితీసే ఎల్డీఎల్ కొలెస్ర్టాల్‌ను పెంచే కొవ్వు ఉత్పత్తులు ఉంటాయని గత అథ్యయనాల ఆధారంగా వీటిని పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్న క్రమంలో తాజా అథ్యయనం వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. గత 20 ఏళ్లుగా 63,600 మందికి పైగా హెల్త్ రికార్డులను పరిశీలించిన మీదట తాజా అథ్యయనం ఈ అంచనాలకు వచ్చింది. వీరిలో అత్యధికంగా డైరీ కొవ్వులను తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహం వచ్చిన వారు తక్కువగా ఉన్నట్టు తేలింది. డైరీ ఫ్యాట్ తక్కువగా తీసుకున్న వారిలో టైప్ 2 మధుమేహం బారిన పడిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు పరిశోధనలో తేలింది. డైరీ ఫ్యాట్ బయోమార్కర్లకు వారి టైప్ 2 మధుమేహం ముప్పు తక్కువగా ఉండటానికి దగ్గరి సంబంధం ఉన్నట్టు తొలిసారిగా తమ అథ్యయనంలో వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి చెందిన డాక్టర్ ఫుమియకి ఇమముర పేర్కొన్నారు. దీనిపై విస్తృత అథ్యయనం అవసరమని తమ పరిశోధనలో గుర్తించామని చెప్పారు. -
మార్కెట్లోకి ‘విజయ’ మినరల్ వాటర్
సాక్షి, హైదరాబాద్: పాల ఉత్పత్తుల నుంచి నీటి వ్యాపారంలోకి విజయ డెయిరీ అడుగుపెట్టింది. త్వరలో ‘విజయ’బ్రాండ్‌తో మినరల్ వాటర్‌ను అందుబాటులోకి తేనుంది. ప్రముఖ బ్రాండ్లకు దీటుగా ‘విజయ’పేరుతో మినరల్ వాటర్ తీసుకొస్తున్నట్లు డెయిరీ యాజమాన్యం తెలిపింది. మరో 15 రోజుల్లో రాష్ట్ర మార్కెట్లోకి ప్రధానంగా హైదరాబాద్ వినియోగదారులకు ఈ వాటర్ అందుబాటులోకి తీసుకొస్తామని డెయిరీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లాలాపేటలో ఉన్న విజయ డెయిరీ ప్లాంటులోనే వాటర్‌ప్లాంటును నెలకొల్పారు. అందుకు సంబంధించి అత్యాధునిక వాటర్‌ప్లాంటు కొనుగోలు చేసినట్లు డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే మినరల్ వాటర్ తయారీ, అమ్మకాలకు సంబంధించి లైసెన్సు తీసుకున్నట్లు వెల్లడించారు. మినరల్ వాటర్‌ను ఇళ్లకు సరఫరా చేసేలా 20 లీటర్ల క్యాన్లు తీసుకొస్తున్నామని, ఒక లీటరు, అర లీటరు బాటిళ్లను కూడా వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. సమావేశాలు, శుభకార్యాలు తదితర అవసరాల కోసం పావు లీటర్ల బాటిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వివరించారు. వాటి ధరపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మార్కెట్లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల ధరలకు కొంచెం తక్కువ ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మరీ తక్కువ ధరకు అమ్మడం సాధ్యపడదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెప్పారు. తాగునీటి సరఫరాకు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించనున్నట్లు వివరించారు. పాల ఏజెంట్ల పునరుద్ధరణ.. విజయ డెయిరీ పాల విక్రయాలు గణనీయంగా పడిపోవడంతో యాజమాన్యం పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. డెయిరీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌రావు అందుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 4 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుండగా, రెండున్నర లక్షలే విక్రయాలు జరుగుతున్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టాక పలు చర్యల ఫలితంగా విక్రయాలు 2.7 లక్షలకు చేరినట్లు డెయిరీ వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల్లో మూడున్నర లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ధారించారు. వచ్చే ఏడాదికి 5 లక్షల లీటర్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు విజయ డైయిరీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లో గతేడాది 650 మంది ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసి 150 మందితో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను నెలకొల్పడం వల్లే పాల విక్రయాలు పడిపోయాయి. దీంతో తాజాగా 650 మంది ఏజెంట్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఆ ఏజెంట్లతో ఈ నెల 20 నుంచి పాల విక్రయాలు మళ్లీ ఊపందుకోనున్నాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. పాల ఉత్పత్తుల విక్రయాలు కూడా గణనీయంగా పెంచాలని నిర్ణయించారు. అందుకు వాటి ప్యాకెట్లు, నాణ్యతలో అనేక మార్పులు చేర్పులు చేయనున్నారు. మార్కెటింగ్, ప్రచార వ్యవస్థను పటిష్టం చేస్తారు. విజయ డెయిరీలో అంతర్గత వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అనేకమంది అధికారులకు స్థాన చలనం కల్పించారు. కొందరిని బదిలీ చేశారు. కాగా, ఇప్పటికే పేరుకుపోయిన రూ.100 కోట్ల విలువైన పాల ఉత్పత్తుల నిల్వలను ఎలా వదిలించుకోవాలన్న దానిపై యాజమాన్యం ఇంకా దృష్టిసారించలేదన్న ఆరోపణలున్నాయి. -
అధికారం.. అవినీతి పక్షమా!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు డెయిరీని అప్పుల్లో ముంచి సంక్షోభంలోకి నెట్టిన పాలకవర్గానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలవడంపై సొంత పార్టీ వర్గాల నుంచే వ్యతిరేకత పెల్లుబుకుతోంది. డెయిరీ విషయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇక సాక్షాత్తు టీడీపీ అనుబంధ సంఘాలైన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలు సైతం అధికార పార్టీ శాసనసభ్యుల తీరుపై విమర్శలు గుప్పిస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. డెయిరీని సంక్షోభం నుంచి గట్టెక్కించి వేలాది మంది రైతులు, ఉద్యోగులను ఆదుకోవాల్సిన పార్టీ నేతలు వారి గోడు పట్టించుకోకుండా డెయిరీ చైర్మన్‌కు ఆర్థిక సాయం అందించి, లాభం ఆర్జించి పెట్టేందుకు ప్రయత్నించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావును ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి డెయిరీకి ఆర్థిక సాయం చేయాలంటూ విన్నవించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చైర్మన్ చల్లా శ్రీనివాసరావు పాలనలో ఒంగోలు డెయిరీ పతానవస్థకు చేరింది. 2014 వరకు లాభాల్లో ఉన్న డెయిరీ గత మూడేళ్లలో రూ.80 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. పాల రైతులకు, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి పాలకవర్గం అవినీతి అక్రమాలే కారణం’ అని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన తెలుగు రైతు, టీఎన్టీయూసీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. డెయిరీలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల పెత్తనం లేదు. అంతా అధికార పార్టీ పెత్తనమే. ఇక్కడి ఉద్యోగులు సైతం అధికార పార్టీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీ పరిధిలో పని చేస్తున్నారు. డెయిరీని ముంచింది ‘చల్లా’నే.. డెయిరీ పతానవస్థను కళ్లారా చూసిన ఉద్యోగులు, రైతులు చైర్మన్ చల్లా శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. బహిరంగ విమర్శలకు సైతం దిగారు. డెయిరీలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 17 రోజులుగా టీఎన్టీయూసీ డెయిరీ వద్దే దీక్షలకు దిగింది. ఇంకా దీక్షలు కొనసాగుతున్నాయి. మరో వైపు రైతులు సైతం తమకు బకాయిలు చెల్లించకుండా పాలకవర్గం డెయిరీ ఆస్తులను కొల్లగొడుతోందని ఆరోపిస్తున్నారు. తెలుగు రైతు, టీఎన్టీయూసీ మొర అరణ్య రోదన అధికార పార్టీకి చెందిన తెలుగు రైతు, టీఎన్‌టీయూసీలు ఆరోపిస్తున్నా.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వారి మొర ఆలకించడం లేదు. రైతులు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు. డెయిరీని తిరిగి సహకార చట్టంలోకి మార్చాలన్న వారి డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. మూడేళ్లలోనే డెయిరీ రూ.80 కోట్ల అప్పుల్లో మునగడానికి పాలకవర్గం అవినీతి అక్రమాలే కారణమని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ అధిష్టానం ఏ మాత్రం స్పందించడం లేదు. పైపెచ్చు డెయిరీ సంక్షోభానికి కారణమైన చల్లా శ్రీనివాస్‌ను ఆదుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు తప్పితే రైతులను, ఉద్యోగులకు బాసటగా నిలిచి భవిష్యత్తులో మళ్లీ అవినీతి, అక్రమాలు జరగకుండా చూసే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రజాప్రతినిధుల తీరుపై రైతులు, ఉద్యోగులతోపాటు అధికార పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
చురుకైన కీళ్ల కోసం!
కీళ్లవాతం – ఆహారం ఆర్థరైటిస్ (కీళ్లవాతం) తగ్గడానికి పైటోకెమికల్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం పైటోకీన్స్తో పోరాడుతుంది. కొన్ని పదార్థాలు కీళ్లవాతం బాధ పెరగడానికి కారణమవుతుంటాయి. అందుకే కేవలం మందుల మీద ఆధారపడకుండా డైట్‌చార్ట్‌ను మార్చుకోవడం ద్వారా చక్కటి ఉపశమనం పొందవచ్చు. ఏమేమి తినకూడదో చూద్దాం! గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, రెడ్‌మీట్, చక్కెర, తేనె, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలో వేయించిన పదార్థాలు, వేయించి ఉప్పు చల్లిన గింజలు, తీపి కోసం కృత్రిమంగా వాడే ట్యాబ్లెట్లు– లిక్విడ్లు, మైదా, బేకరీ ఉత్పత్తులను మినహాయించాలి. కూరగాయల విషయానికి వస్తే... బంగాళాదుంప, వంకాయ, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, వండి చల్లబరిచి నిల్వ చేసిన పదార్థాల (ఫ్రోజన్ ఫుడ్)కు కూడా వాతాన్ని పెంచే గుణం ఉంటుంది. టీ, కాఫీ, ఆల్కహాలు సేవనాన్ని పూర్తిగా మానేయాలి. వీటిని తినవచ్చు! ఏమేమి తినకూడదో తెలియచేసే జాబితా చూశాక ఇక తినడానికి ఏమున్నాయి? అనిపిస్తుంది. కానీ ఆర్థరైటిస్ బాధ నుంచి ఉపశమనాన్నిచ్చే ఆహారం చాలానే ఉంది. అరటి, మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, తర్బూజ, బత్తాయి, కమలా వంటి సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. కూరగాయల్లో... ఆకుకూరలు, మామిడికాయ, నిమ్మ, క్యారట్, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, బ్రోకలి, లెటస్, అరటి, చిక్కుడు వంటి కాయగూరలు తీసుకోవచ్చు. అలాగే రోజుకు రెండు కప్పుల గ్రీన్‌టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్‌గ్రాస్, ముడిబియ్యంతో వండిన అన్నం, శనగలు, రాజ్మా వంటి పొట్టు తీయని ధాన్యాలు తీసుకోవాలి. -
హైదరాబాద్‌లో మదర్ డెయిరీ ఆవు పాలు
♦ అర లీటర్ ప్యాక్ ధర రూ.20 ♦ ఈ ఏడాది రూ.8,500 కోట్ల టర్నోవర్ ♦ కంపెనీ బిజినెస్ హెడ్ సందీప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న మదర్ డెయిరీ హైదరాబాద్ మార్కెట్లో ఆవు పాలను అందుబాటులోకి తెచ్చింది. అర లీటరు ప్యాక్ ధర రూ.20. కొద్ది రోజుల్లో 200 ఎంఎల్, లీటరు ప్యాక్‌లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కంపెనీ ఇక్కడ ప్యాకెట్ పాలను విక్రయిస్తోంది. 2-7 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆవు పాలు మంచివని మదర్ డెయిరీ పాల విభాగం బిజినెస్ హెడ్ సందీప్ ఘోష్ చెప్పారు. మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ అభిజిత్, సౌత్ సేల్స్ డీజీఎం భ్రహ్మయ్య పాటూరితో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 23 రకాల నాణ్యతా పరీక్షలు జరిపిన తర్వాతే కస్టమర్‌కు చేరుస్తామని, తెలంగాణ నుంచే ఆవు పాలను సేకరిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో ప్లాంటు..: దక్షిణాదిన మదర్ డెయిరీకి తిరుపతిలో ప్లాంటుంది. ఇక్కడి నుంచి పాలను సేకరించి తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 55,000 లీటర్ల పాలను కంపెనీ విక్రయిస్తోంది. హైదరాబాద్‌లో వాటా పెంచుకోవాలని చూస్తున్న మదర్ డెయిరీ... అమ్మకాలు ఆశించిన స్థాయికి చేరుకోగానే ప్లాంటు నెలకొల్పాలని భావిస్తోంది. 2015-16లో కంపెనీ ఆదాయం రూ.7,000 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్లను లక్ష్యంగా చేసుకుంది. -
వరంగల్ లో అమూల్ పాలు
హైదారబాద్: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ తాజాగా తన కార్యకలాపాలను వరంగల్‌కూ విస్తరించింది. చాలా పాల కంపెనీలు వరంగల్‌లో టోన్డ్ పాలను (లీటరు) ధర రూ.41కు విక్రయిస్తోంటే.. తాము మాత్రం వాటి కన్నా తక్కువ ధరలకే పాలను ప్రజలకు విక్రయిస్తున్నామని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అమూల్ టాంజా’ (టోన్డ్ పాలు) ధర లీటరుకు రూ.38గా, అమూల్ గోల్డ్ (క్రీమ్ మిల్క్) ధర లీటరుకు రూ.50గా, ‘అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్’ (డబుల్ టోన్డ్ పాలు) ధర రూ.10 (300 ఎంఎల్ ప్యాక్)గా ఉంటుందని పేర్కొంది. -
శాకాహారంతో ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్
పరిపరి శోధన ముప్పయ్యేళ్లు నిండిన తర్వాత పూర్తిగా శాకాహారులుగా మారితే పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. పాల ఉత్పత్తులు, గుడ్లు సహా జంతు సంబంధ ఆహారాన్ని పూర్తిగా మానేసి, శాకాహారం తీసుకుంటున్నట్లయితే, ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు 35 శాతం మేరకు తగ్గుతాయని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముప్పయ్యేళ్ల వయసుకు పైబడిన 26 వేల మంది పురుషులపై ఐదేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు సాగించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు అంటున్నారు. మాంసం మానేసి గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకున్న వారిలో కూడా మాంసాహారుల మాదిరిగానే ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగానే కనిపించాయని వివరిస్తున్నారు. -
డెయిరీ సైన్స్‌తో కొలువుల వెల్లువ
అప్‌కమింగ్ కెరీర్: మానవుడికి ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారం.. పాలు. పాలకు, పాల ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. భారత్‌లో క్షీర విప్లవంతో పాడి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్ రికార్డుకెక్కింది. మనదేశంలో డెయిరీ రంగంలో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు ఈ పరిశ్రమ కల్పతరువుగా మారిందని చెప్పొచ్చు. సూపర్వైజర్/ప్లాంట్ మేనేజర్ భారత్‌లో డెయిరీ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ భారీ పరిశ్రమగా అవతరించింది. దీనికి ప్రభుత్వాల నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డెయిరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ప్రొక్యూర్మెంట్, ప్యాకేజింగ్, స్టోరేజీ, క్వాలిటీ కంట్రోల్, ట్రాన్స్‌పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డెవలప్మెంట్, పరిశోధన-అభివృద్ధి(ఆర్ అండ్ డీ) వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం పాడి పరిశ్రమ ఆధునికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ రంగంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో డెయిరీ సైన్స్ కోర్సులను అభ్యసించినవారికి డిమాండ్ నెలకొంది. డెయిరీలు నిపుణులను నియమించుకుంటున్నాయి. వీటిలో సూపర్వైజర్, ప్లాంట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు. డెయిరీ సైన్స్/టెక్నాలజీ కోర్సులను చదివినవారు ఆసక్తి ఉంటే సొంతంగా డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఔత్సాహికులకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తోంది. మార్పులు తెలుసుకోవాలి పాడి పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తి ఉండాలి. ఎప్పటికప్పుడు ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలి. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ అవసరాలను అంచనా వేసే నేర్పు ఉండాలి. ఈ రంగంలో ఒడిదుడుకులు, ఇతరుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి, పట్టుదల, సహనం అలవర్చుకోవాలి. అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, డెయిరీ ఇంజనీరింగ్ కోర్సుల్లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా అభ్యసిస్తే ఉన్నత ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వేతనాలు: పాడి పరిశ్రమలో సూపర్వైజర్కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. తర్వాత పనితీరును బట్టి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వేతనం లభిస్తుంది. సహకార విభాగంలో ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో) నెలకు రూ.45 వేల నుంచి రూ.50 వేలు పొందొచ్చు. డెయిరీ సైన్స్/టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: 1. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.angrau.ac.in 2. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in 3. డెయిరీ సైన్స్ కాలేజీ-బెంగళూరు వెబ్సైట్: www.kvafsu.kar.nic.in 4. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.ndri.res.in వంద శాతం అవకాశాలు! ‘‘డెయిరీ టెక్నాలజీ కోర్సులను అభ్యసించిన విద్యార్థులకు డెయిరీ పరిశ్రమల్లో విస్తృత అవకాశాలున్నాయి. కోర్సు చివరి సంవత్సరంలోనే కంపెనీలు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. డెయిరీ టెక్నీషియన్, డెయిరీ ఫామ్ మేనేజర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, మేనేజర్, డెయిరీ టెక్నాలజిస్ట్ తదితర హోదాల్లో విధుల్లో చేర్చుకుంటున్నాయి. అభ్యర్థి ప్రతిభ, సంస్థను బట్టి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీలో కోర్సులనభ్యసించిన వారికి 100 శాతం ఉద్యోగాలు లభించాయి. కనీస వేతనం రూ. 18,000. విదేశీ కంపెనీలు సైతం కొందరు విద్యార్థులకు భారీ వేతనాలతో నియమించుకున్నాయి. డెయిరీ టెక్నాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివిన వారు విదేశాల్లోనూ మంచి అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు’’ - డా. ఐ.శంకర రెడ్డి, అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి -
డెయిరీకి లాభాలు... మాకు నష్టాలా?
రైతుల కష్టంతో కల్యాణమండపాలా? ఎంత పాలు పోసినా గిట్టుబాటు కాదు విశాఖ డెయిరీ డెరైక్టర్‌పై పాడి రైతుల ధ్వజం అచ్యుతాపురం : వెన్న తీసిన పాలను విశాఖ డెయిరీ లీటరు రూ.40కి అమ్ముకుంటుంది. మాకు మాత్రం వెన్నశాతం తక్కువన్న సాకుతో లీటరుకు రూ.15 ఇస్తుంది. లీటరు నీళ్లు బయట రూ.20కి అమ్ముతున్నారు. మేము సరఫరా చేసిన పాలు నీళ్ల పాటి చేయలేదా? మీరు చెప్పేవన్నీ రైతుల కోసం కాదు... డెయిరీ బాగుపడేందుకే’... అంటూ పాడి రైతులు విశాఖ డెయిరీ డెరైక్టర్ పిళ్లా రమాకుమారిపై మండిపడ్డారు. తిమ్మరాజుపేట పాల కేంద్రంలో బుధవారం 138 మంది రైతులకు రూ.2లక్షల 45,982 ఏరువాక బోనస్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు కల్పించుకుని ఎన్ని పాలు పోసినా తమకు లాభాలు రావడం లేదని ఆరోపించారు. పశువులను పోషించి పాలు సరఫరా చేస్తే తమకు ఏమీ దక్కడం లేదని అసహనం వ్యక్తం చేసారు. లీటరు పాలకు రూపాయి పెంచి దాణా బస్తా ధరను రూ.50కి పెంచారన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే డెయిరీకి వచ్చిన లాభాలను కల్యాణమండపాలు, వంతెనల నిర్మాణానికి కేటాయించడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ప్రయివేటు డెయిరీల నుంచి పాల ఉత్పత్తిదారులను ఆకట్టుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కుగా అభివర్ణించారు. వెన్నశాతం తీయడంలోను పలు అనుమానాలు ఉన్నాయని రైతులు తెలిపారు. రైతుల ఆరోపణలకు రమాకుమారి సమాధానమిస్తూ వెన్నశాతంలో అనుమానాలను తొల గించడానికి లేజర్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. పాలను వేరుచేసి వెన్న శాతంలో లోపాల్లేకుండా చూసుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ సభ్యుడు జనపరెడ్డి శ్రీనివాసరావు, పీలా తులసీరాం, సత్యారావు పాల్గొన్నారు. -
4 నుంచి రాజమండ్రిలో వైఎస్సార్సీపీ సమీక్షలు
మళ్లీ పెరిగిన ధరలు రెండు నెలలు గడవకముందే షాకిచ్చిన డెయిరీ లీటర్‌కు రూ. 2 వడ్డన నేటి నుంచి అమలు అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌లైన్: వినియోగదారులకు విశాఖ డెయిరీ మళ్లీ షాకిచ్చింది. రెండు నెలలు తిరక్క ముందే పాల ధర మళ్లీ పెంచింది. లీటరుకు రెండు రూపాయలు పెంచుతూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ధరలు ఆదివారంనుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో, ఈ ఏడాది ఏప్రిల్ 5న ధరలు పెంచిన డెయిరీ యాజమాన్యం రెండు నెలలు గడవకముందే మళ్లీ పెంచి సామాన్యుడిపై విపరీతమైన భారం మోపింది. ఇప్పటికే మోయలేని ధరలతో సతవుతవువుతున్న ప్రజలకు ఇప్పుడు పాల ధర మరో సమస్యగా మారనుంది. విశాఖ డెయిరీ గత ఏడాదిన్నర కాలంలో పాలరేట్లను పెంచడం ఇది ఆరోసారి. దీంతో సగటు వినియోగదారుడు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి తలెత్తింది. 2012 ఫిబ్రవరి, జూన్, గత ఏడాది మార్చి, సెప్టెంబర్లలో ఈ ఏడాది ఏప్రిల్‌లోని ప్రతిసారి రెండేసి రూపాయల వంతున ధర పెంచడంతో ఆ భారం ఒక్కో లీటరుకు పది రూపాయలనుంచి రూ.40 వరకు పెరిగింది. విద్యుత్ కోత, సిబ్బంది సమస్య, పెరిగిన ఇంధన ధరలు, పాల సేకరణ ధరల వంటి అనేక కారణాలు చూపుతూ ధరలు పెంచుతున్నట్టు డెయిరీ తెలిపింది. రైతుల నుంచి పాల సేకరణ తక్కువగా ఉండడంతో నిర్వహణ కష్టమవుతోందని ప్రకటనలో పేర్కొంది. -
రూ.కోటితో డెయి‘రిజర్వాయర్’
మరో రెండు నెలల్లో పూర్తి 200 ఎకరాలకు సాగునీరు ఏళ్లనాటి కల నెరవేరుతున్న వేళ కశింకోట, న్యూస్‌లైన్ : విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు రైతు జనబాంధవునిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు డెయిరీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సాగునీరు అందించే చిన్న జలాశయాల (మినీ రిజర్వాయర్) నిర్మాణం కూడా చేపట్టారు. కశింకోట మండలంలోని చెరకాంలో సుమారు రూ.కోటి ఖర్చుతో చిన్న జలాశయాన్ని నిర్మిస్తున్నారు. చెరకాం రైతులకు వర్షపునీరే ఆధారం. దీంతో ఏటా వాతావరణం అనుకూలిస్తే పంటలు పండటం, లేదంటే నష్టపోవడం జరుగుతోంది. సాగునీరు లేక చెరకు, వరి, కాయగూరలు వంటి పంటలకు రైతులు చాలా వరకు స్వస్తి పలికే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు ప్రత్యామ్నాయంగా సరుగుడు సాగుపై మళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ఎగువన ఉన్న కొండల ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు వృధాగా పోకుండా జలాశయాన్ని నిర్మించి పంట భూములకు సాగునీరు అందించాలని రైతులు కోరుతూ వస్తున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు దృష్టికి కూడా రైతులు ఈ విషయాన్ని దృష్టికి తెచ్చారు. దీంతో రైతుల కోరిక మేరకు జలాశయం నిర్మించాల్సిన ప్రాంతాన్ని సందర్శించి అందుకు డెయిరీ ఆధ్వర్యంలో రూ. 50 లక్షల అంచనా వ్యయం తో నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే జలాశయ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో నీరు నిల్వ చేయడానికి అడ్డుగా గట్టును నిర్మించారు. ఆయకట్టుకు రెండు కాలువల ద్వారా సాగునీరు అందించడానికి రెండు ఖానాలను, మిగు లు నీరు పోవడానికి పొర్లుకట్టు నిర్మాణానికి పునాదులు తీశారు. ఇంకా నెల రోజుల్లో దీన్నిపూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే సుమా రు 200 ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు నెలల్లో పూర్తి చేస్తాం జలాశయం ప్రధానమైన పనులు నెల రోజుల్లోగా పూర్తి అవుతాయి. చిన్నా చితకా పనులు మరో నెల రోజుల్లో పూర్తి చేసి ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీరు అందివ్వాలని చూస్తున్నాం. ప్రధానంగా జలాశయం నిర్మాణం వల్ల పంట భూములకు సాగునీరు అందడమే కాకుండా చెరకాం ప్రాంత వ్యవసాయ బోర్ల భూగర్భంలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజం కలుగ నుంది. కొండల్లో కురిసిన నీరు వృథాగా పోకుండా దీని కోసం జలాశయంలో నిల్వ ఉండేందుకు వీలుగా దీన్ని లోతు చేస్తున్నాం. - కె.సత్యనారాయణ, డెయిరీ జీఎం -
రాష్ట్రంలో ఇక అమూల్ తాజా పాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమూల్ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) హైదరాబాద్ మార్కెట్లో తాజా (ఫ్రెష్) పాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఐస్‌క్రీం, అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్‌తోపాటు ఇతర పాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తోంది. యూపీ, రాజస్థాన్ తర్వాత అత్యధికంగా పాలు ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్‌లోనే. అందుకే ఇక్కడ అడుగు పెట్టాలని జీసీఎంఎంఎఫ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. తాజా పాల మార్కెట్ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నట్టు సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఎప్పుడు ప్రవేశించేది కొద్ది రోజుల్లో వెల్లడిస్తామ న్నారు. పాలు, పాల ఉత్పత్తుల రంగం తీరుతెన్నులు, కంపెనీ లక్ష్యం గురించి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూ... దేశంలో పాల ఉత్పత్తి ఎలా ఉంది? 2013-14లో భారత్‌లో 14 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. పరిశ్రమ పరిమాణం రూ.3.6 లక్షల కోట్లు. వ్యవసాయ జీడీపీలో 26 శాతం వాటా డెయిరీదే. ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచ నంబర్-1 స్థానంలో భారత్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి రూ.2,400 కోట్ల విలువైన పాల పొడి వివిధ దేశాలకు ఎగుమతి అయింది. ప్రభుత్వం అనుమతిస్తే 2014-15లో ఈ విలువ రూ.3,000 కోట్లకు చేరుకోవచ్చు. ఇక దేశంలో రోజుకు ఒక వ్యక్తి సరాసరి పాల వినియోగం 290 గ్రాములుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన 278 గ్రాముల కంటే ఇది ఎక్కువ. పట్టణీకరణ, ఆరోగ్యం పట్ల అవగాహన, ఆదాయాల్లో పెరుగుదల పాలకు డిమాండ్ పెరిగేలా చేస్తోంది. డెయిరీ రంగంలో ఉన్న సవాళ్లేంటి? ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభా 20 ఏళ్లలో 540 కోట్ల నుంచి 700 కోట్లకు చేరింది. ప్రొటీన్ (మాంసకృత్తులు) వినియోగం రోజుకు 3.7 లక్షల టన్నుల నుంచి 5.4 లక్షల టన్నులకు ఎగసింది. అధిక వృద్ధి నమోదైంది ఆసియా దేశాల్లోనే. ఇక వ్యవసాయయోగ్య భూమి ఐదేళ్ల క్రితం సగటున 2.2 ఎకరాలుంటే నేడది 1.2 ఎకరాలకు కుచించుకుపోయింది. వ్యవసాయానికి పనికొచ్చే భూమి తగ్గితే పాలిచ్చే జంతువులకు దాణా కొరత వస్తుంది. ఈ పరిణామాలతో పాల ఉత్పత్తి తగ్గుతుంది. సమస్య పరిష్కారానికి మీరిచ్చే సలహా? పాలిచ్చే జంతువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించాలి. దేశీయ పశువుల ఉత్పాదకత మరింత పెరగాలి. రైతులకు తక్కువ ధరకే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావాలి. సమస్యలను అధిగమించకపోతే పాల డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరగడం ఖాయం. 2020 నాటికి భారత్‌కు 19 కోట్ల టన్నుల పాలు అవసరమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. ఐస్‌క్రీమ్ మార్కెట్ ఎలా ఉంది? ఐస్‌క్రీమ్ మార్కెట్ పరిమాణం దేశంలో రూ.3,000 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 18 కోట్ల లీటర్ల వినియోగంతో రూ.1,500 కోట్లుంది. భారత్‌లో ఒక ఏడాదిలో ఒక వ్యక్తి 350 మిల్లీలీటర్ల ఐస్‌క్రీమ్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రపంచ సరాసరి 2.3 లీటర్లు ఉంది. అమూల్ ఐస్‌క్రీమ్ ఆసియా టాప్ 10 బ్రాండ్లలో ఒకటి. ఏడేళ్లలో ఈ బ్రాండ్ భారత్‌లో తొలి స్థానానికి చేరుకోవడం విశేషం. జాతీయ బ్రాండ్ కూడా ఇదొక్కటే. ఐస్‌క్రీమ్ మార్కెట్లో 40 శాతం వాటా సొంతం చేసుకుంది. అమూల్ భవిష్యత్ విస్తరణ ఎలా చేపట్టబోతున్నారు? ఎంత ఆదాయం ఆశిస్తున్నారు? పాల పొడి, పాల ఉత్పత్తులను 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భారత్‌లో మరిన్ని చిన్న పట్టణాలకు పెద్ద ఎత్తున విస్తరించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన హైదరాబాద్‌లో తాజా పాలను ప్రవేశపెట్టే యత్నాల్లో ఉన్నాం. అమూల్, సాగర్ బ్రాండ్లలో ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. చాలా విభాగాల్లో మేమే నంబర్ 1. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18,160 కోట్ల ఆదాయం ఆర్జించాం. తొలిసారిగా 32 శాతం వృద్ధి నమోదు చేశాం. 2014-15లో 20 శాతంపైగా వృద్ధితో రూ.22,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా చేసుకున్నాం. -
రాష్ట్రంలో క్షీర విపవ్లం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ 2006-11 సంవత్సరకాలంలో పాల ఉత్పత్తిలో 41 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింది. వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం పాల ఉత్పత్తి పరిమాణం రీత్యా ఇంకా మూడో స్థానంలోనే ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో తలసరి పాల లభ్యతల్లో 36 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు అసోచామ్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయ్యింది. 2006-07 కాలంలో 79.38 లక్షల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2010-11 నాటికి 1.12 కోట్ల టన్నులకు చేరింది. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 19 శాతం వృద్ధితో 12.1 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి చేయడం ద్వారా ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2.1 కోట్ల లీటర్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, 1.3 కోట్ల లీటర్ల ఉత్పత్తితో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 2020కల్లా ఇండియాలో పాల ఉత్పత్తి 17.7 కోట్ల టన్నులు దాటొచ్చని అసోచామ్ అంచనావేసింది. పాల వినియోగం తక్కువే.. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ రోజువారి సగటు వినియోగంలో ఇండియా ఇప్పటికీ వెనుకబడే ఉంది. అంతర్జాతీయంగా రోజుకు ప్రతీ వ్యక్తి 279 గ్రాముల పాలను వినియోగిస్తుంటే ఆ సగటు ఇండియాలో 252 గ్రాములుగా ఉంది. అదే న్యూజిలాండ్ 9,773 గ్రాముల వినియోగంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఐర్లాండ్ (3,260 గ్రాములు), డెన్మార్క్ (2,411 గ్రాములు) ఉన్నాయి. కాని ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో సగటు పాల వినియోగం బాగా పెరిగినట్లు అసోచామ్ పేర్కొంది. 2006-07లో రోజుకు 268 గ్రాములుగా ఉన్న సగటు వినియోగం 2010-11 నాటికి 36 శాతం పెరిగి 364 గ్రాములకు పెరిగింది. కాని దేశం మొత్తం మీద హర్యానా 679 గ్రాములు వినియోగించడం ద్వారా మొదటి స్థానంలో ఉంది. వృద్ధికి మరిన్ని అవకాశాలు ప్రపంచ సగటు కంటే ఇండియా పాల వినియోగం తక్కువగా ఉండటంతో ఈ రంగంలో వృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నట్లు అసోచామ్ జాతీయ కార్యదర్శి డి.ఎస్.రావత్ తెలిపారు. ఏటా సగటున నాలుగు శాతం చొప్పున వృద్ధి చెందితే 2019-20 నాటికి దేశ పాల ఉత్పత్తి 17.7 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అనుగుణంగా చిన్న రైతులకు, డెయిరీ ఉత్పత్తులు తయారు చేసే వారికి అనుసంధానంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజల ఆదాయం కూడా పెరుగుతుండటంతో పాల ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతోందని అసోచామ్ పేర్కొంది. -
సోలార్ విద్యుత్తుకు ప్రోత్సాహం
మంత్రి గంటా వెల్లడి డెయిరీ ఆధ్వర్యంలో అతిపెద్ద సౌర విద్యుత్ వ్యవస్థ ప్రారంభం వ్యయం రూ. 7.5 కోట్లు; ఉత్పత్తి శక్తి 1.15 మెగావాట్లు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణహిత సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఓడరేవుల, మౌలిక వసతుల కల్పన మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.విశాఖడెయిరీలో సౌరశక్తి వ్యవస్థను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెయిరీ చైర్మన్ తులసీరావు వినూత్న ప్రయోగానికి నాంది పలికారని ప్రశంసించారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సోలర్ విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించడానికి చొరవ తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. విశాఖడెయిరీలో ఏ క్షణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అటువంటి సమస్యను సౌర విద్యుత్తుతో అధిగమించవచ్చని చెప్పారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన రెనిన్ సోలర్ సంస్థ సౌజన్యంతో సుమారు ఏడున్నర కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల విస్తరణలో దీన్ని నిర్మించినట్టు తెలిపారు. 1.15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పొందవచ్చని చెప్పారు. మరో రెండు చోట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోలార్ విద్యుత్‌ప్లాంట్ వల్ల ఎలాంటి కాలుష్య వాతావరణం చోటుచేసుకోదని, ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్‌ను వినియోగించే దిశగా ఆలోచించాలన్నారు. -
పండగ బోనస్‌గా రూ.17 కోట్లు
= 1.25 లక్షల మంది మహిళలకు చీరలు =డెయిరీ చైర్మన్ తులసీరావు గర్నికం (రావికమతం), న్యూస్‌లైన్ : డెయిరీ పాడి రైతులకు పండగ బోనస్‌గా రూ. 17 కోట్లు చెల్లిస్తున్నామని, 1.23 లక్షల మంది మహిళలకు చీరలు అదనంగా అందిస్తున్నామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తెలిపారు. గర్నికం, దొండపూడి, కన్నంపేట పాలకేంద్రాల్లో 383 మంది రైతులకు రూ.5,49,000 బోనస్‌ను, 297 మంది మహిళలకు చీరలు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పాడి రైతుల సంక్షేమమే డెయిరీ ధ్యేయమని చెప్పారు. ఇవి కాక తుఫాన్లో నష్టపోయిన రైతులకు రూ. 25 కోట్లు నష్టపరిహారం అందించామని చెప్పారు. ప్రతి రైతూ అర లీటరు పాలైనా పోసి డెయిరీ పథకాలు పొందాలని ఆయన కోరారు. డెయిరీ ఆవరణలో రూ.10 కోట్లతో సూ పర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. గుండె చికిత్స లు సైతం చేపడతామని చెప్పా రు. సుఖీభవ కార్డులు పొందిన రైతులకు వడ్డీలేని రుణాలు అంది స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ డెరైక్టర్ సత్యనారాయణ, మేడివాడ సర్పంచ్ రామారావు పాల్గొన్నారు. ప్రభుత్వం సమ్మతిస్తే వాలాబు నిర్మాణం అప్పలరాజుపురం(చీడికాడ) : ప్రభుత్వం అనుమతిస్తే కోనాం జలాశయం పైనగల వాలాబు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు చెప్పారు. ఆదివారం మండలంలోని అప్పలరాజుపురంలో రూ. 11 లక్షలతో నిర్మించిన కళ్మాణమండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజాప్రతినిధులు పోరాడి ప్రభుత్వం నుంచి అనుమతి సాధిస్తే, రిజర్వాయర్ నిర్మాణానికి తాము సిద్ధమని ప్రకటించారు. 2011 ఏప్రిల్ నుంచి 2012 మార్చి వరకు వరకు పాలు పోసిన పాడిరైతులకు సంక్రాంతి బోనస్ అందించనున్నట్టు ప్రకటించారు. చోడవరం డివిజన్లో గల ఏడు మండలాల్లో గల 21 వేల రైతులకు రూ. 3 కోట్లను సంక్రాంతి బోనస్‌గా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించని, నిర్మిస్తామన్న వారికి సహకరించదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే కురచా రామునాయుడు, సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.