వాటిని రద్దు చేయాలని లోకాయుక్తకు వినతి
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని హరించే విషపూరితమైన పాల ఉత్పత్తులు తయారు చేస్తున్న హెరిటేజ్ సహా పలు పాల కంపెనీల విక్రయాలను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం బుధవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. హెరిటేజ్, విజయ, రిలయన్స్, నంది, నెస్లే, మదర్‌డెయిరీ, జెర్సీ పాలల్లో ప్రమాదకరమైన బాక్టీరియా, యూరియాలు ఉంటున్నాయని ప్రభుత్వ ఆహార విశ్లేషణ్ సంస్థ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆయా కంపెనీల విక్రయాలను వెంటనే నిలిపి వేయాలని సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి జనవరి 6 లోగా నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఆయా పాల కంపెనీలపై ఎందుకు చర్యలు చేపట్టలేదో సమాధానమివ్వాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌లను కోరారు.
హెరిటేజ్ సహా.. పాల కంపెనీలపై ఫిర్యాదు
Published Thu, Oct 10 2013 12:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement