
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ ఏటా రూ.30–40 కోట్ల దాకా పెట్టుబడి చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ సీఈవో భూపేంద్ర సూరి వెల్లడించారు. సీవోవో ప్రమోద్ ప్రసాద్‌తో కలిసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ సమీపంలోని కేశవరం వద్ద ఉన్న ప్లాంటు విస్తరణకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
టెట్రా ప్యాక్‌లో పాలు, పాల పదార్థాలు ఇక్కడ తయారవుతాయి. విస్తరణ పూర్తి అయితే ఈ కేంద్రం సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 22,000 నుంచి 70,000 లీటర్లకు చేరుతుంది. 10 ప్లాంట్లలో కలిపి రోజుకు 13.6 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది’ అని వివరించారు. రవాణా వ్యయాలు, పాల సేకరణ ఖర్చు అధికం అయినందున ధర పెరిగే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment