= 1.25 లక్షల మంది మహిళలకు చీరలు
=డెయిరీ చైర్మన్ తులసీరావు
గర్నికం (రావికమతం), న్యూస్‌లైన్ : డెయిరీ పాడి రైతులకు పండగ బోనస్‌గా రూ. 17 కోట్లు చెల్లిస్తున్నామని, 1.23 లక్షల మంది మహిళలకు చీరలు అదనంగా అందిస్తున్నామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తెలిపారు. గర్నికం, దొండపూడి, కన్నంపేట పాలకేంద్రాల్లో 383 మంది రైతులకు రూ.5,49,000 బోనస్‌ను, 297 మంది మహిళలకు చీరలు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పాడి రైతుల సంక్షేమమే డెయిరీ ధ్యేయమని చెప్పారు.
ఇవి కాక తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు రూ. 25 కోట్లు నష్టపరిహారం అందించామని చెప్పారు. ప్రతి రైతూ అర లీటరు పాలైనా పోసి డెయిరీ పథకాలు పొందాలని ఆయన కోరారు. డెయిరీ ఆవరణలో రూ.10 కోట్లతో సూ పర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. గుండె చికిత్స లు సైతం చేపడతామని చెప్పా రు. సుఖీభవ కార్డులు పొందిన రైతులకు వడ్డీలేని రుణాలు అంది స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ డెరైక్టర్ సత్యనారాయణ, మేడివాడ సర్పంచ్ రామారావు పాల్గొన్నారు.
ప్రభుత్వం సమ్మతిస్తే వాలాబు నిర్మాణం
అప్పలరాజుపురం(చీడికాడ) : ప్రభుత్వం అనుమతిస్తే కోనాం జలాశయం పైనగల వాలాబు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు చెప్పారు. ఆదివారం మండలంలోని అప్పలరాజుపురంలో రూ. 11 లక్షలతో నిర్మించిన కళ్మాణమండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజాప్రతినిధులు పోరాడి ప్రభుత్వం నుంచి అనుమతి సాధిస్తే, రిజర్వాయర్ నిర్మాణానికి తాము సిద్ధమని ప్రకటించారు.
2011 ఏప్రిల్ నుంచి 2012 మార్చి వరకు వరకు పాలు పోసిన పాడిరైతులకు సంక్రాంతి బోనస్ అందించనున్నట్టు ప్రకటించారు. చోడవరం డివిజన్‌లో గల ఏడు మండలాల్లో గల 21 వేల రైతులకు రూ. 3 కోట్లను సంక్రాంతి బోనస్‌గా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించని, నిర్మిస్తామన్న వారికి సహకరించదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే కురచా రామునాయుడు, సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పండగ బోనస్‌గా రూ.17 కోట్లు
Published Mon, Dec 30 2013 2:06 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement