Tulsi Rao
-
అంతర్యుద్ధం
ఒంగోలు, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ కమిషనర్, ఉద్యోగుల మధ్య అంతర్యుద్ధం తార స్థాయికి చేరింది. కమిషనర్ విజయలక్ష్మి వేధింపులు తాళలేకపోతున్నామని ప్రణాళికా విభాగం సిబ్బంది ఇప్పటికే మూకుమ్మడి సెలవులు పెట్టిన విషయం తెలిసిందే. మూకుమ్మడి సెలవులు పెట్టిన ఎనిమిది మంది ప్రణాళికా విభాగం సిబ్బందికి కమిషనర్ ఎండార్స్మెంట్ నోటీసులు జారీ చేయడంతో సమస్య మరింత ముదిరింది. = గురువారం ఉదయం ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు తొలుత ఏసీపీ చంద్రబోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. = ఉద్యోగులూ అదే స్థాయిలో ఆగ్రహించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకే తాను సర్దిచెప్పేందుకు వచ్చానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. = ఈ నెల 12వ తేదీ వరకు వేచి చూడాలని, అప్పటికీ కమిషనర్ తన పద్ధతి మార్చుకోకుంటే తాము కూడా మీకు మద్దతు పలుకుతామంటూ యక్కల నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. మా బాధనూ అర్థం చేసుకోండి = యక్కల ప్రతిపాదనకు ప్రణాళికా విభాగం సిబ్బంది ససేమిరా అన్నారు. = తాము పడుతున్న మానసిక వేదన ఎవరికీ అర్థం కావడం లేదని, ఇలా మూకుమ్మడి సెలవులు పెట్టడం ఇది రెండోసారని చెప్పారు. = కమిషనర్ తీరు మారకపోగా తమను మరింత చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. = ఇప్పటికే రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ హృద్రోగానికి గురై ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరు మానసికంగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఉద్యోగులు వివరించారు. = కమిషనర్ సెలవు పెట్టుకొని వెళ్లిపోయేలా ఆమెపై ఒత్తిడి తీసుకురావాలని యక్కలకు సూచించారు. చేసేది లేక ఆయన అక్కడి నుంచి కమిషనర్ చాంబర్‌కు వెళ్లిపోయారు. నీళ్లివ్వకుండా పన్నులు ఎలా వసూలు చేస్తాం? = నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు అబ్బూరి రమేష్, రెవెన్యూ ఆఫీసర్ మంజులాకుమారిలు కమిషనర్ చర్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. = {పణాళికా సిబ్బందినే మాత్రమే కాదని, నగరపాలక సంస్థలో ఉన్న ఉద్యోగుల మొత్తాన్ని మానసికంగా కమిషనర్ వేధిస్తున్నారని ఆరోపించారు. = నగరంలో వారానికోసారి కూడా నీరు సక్రమంగా సరఫరా చేయకుండా నీటి పన్ను ఎలా వసూలు చేస్తామని ప్రశ్నించారు. = పన్ను వసూలు చేయలేదంటూ ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. = {పణాళికా విభాగం సిబ్బందికి మద్దతుగా తాము కూడా శుక్రవారం నుంచి సామూహిక సెలవుల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులూ మీరెక్కడ? = నగరపాలక సంస్థలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఉన్నతాధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. = ఇటువంటి సమస్యలను ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ అధికారులు మాత్రమే పరిష్కరించగలరు. = ఒంగోలు ఎమ్మెల్యే పేరుతో మున్సిపల్ మాజీ చైర్మన్ మధ్యవర్తిత్వం వహించడం ఏమిటంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. -
మళ్లీ అలిగిన సుందరపు
సయోధ్య సమావేశంలో విజయ్‌కుమార్‌కు పరాభవం వర్గపోరుకు అద్దం పట్టిన నాయకుల పోకడ అచ్యుతాపురం,న్యూస్‌లైన్ : సుందరపు విజయ్‌కుమార్‌కు సొంతపార్టీలోనే ఘోర పరాభవం ఎదురయింది. తీవ్ర మనస్థాపానికి గురయిన ఆయన సమావేశం మధ్యలోనే అలిగి బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాన్ని అతని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం ఇక్కడి పార్టీకార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు గొంతెన నాగేశ్వరరావు,లాలం భాస్కరరావు, సుందరపు విజయకుమార్, పప్పల చలపతిరావు, ఆడారి తులసీరావులు ఎవరికి వారు తమ వర్గీయులతో గ్రూపులుగా విడిపోయి చర్చించుకోవడం పార్టీలో వర్గపోరుకు అద్దం పట్టింది. విభేదాలను, వెన్నుపోట్లను పక్కనపెట్టి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పంచకర్ల గెలుపు కోసం చర్చించడానికి ఏర్పాటు చేసిన సయోధ్య సమావేశంలో తులసీరావు మాట్లాడుతూ యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల్లో తాను ఒక్కడ్నే రాజకీయం చేశానని చెప్పుకున్నారు. ఇది సుందరపు విజయ్‌కుమార్‌కు నచ్చలేదు. సమావేశానికి ముందు విజయ్‌కుమార్‌ను పిలవాలని కొందరు కార్యకర్తలు కోరగా, ఆ యువరాజుని ప్రత్యేకంగా పిలవాలేమిటంటూ తులసీరావు ఎగతాళి చే సిమాట్లాడారు. దీనిని మనసులో పెట్టుకుని గుర్రుగా ఉన్న విజయ్‌కుమార్ ఒక్కసారిగా ఆగ్రహం చెంది అంతా మీరే చేసుకుంటే తానెందుకంటూ అలిగి బయటకు వచ్చి కారు ఎక్కారు. ఇంతలో గొంతెన నాగేశ్వరరావు, ఇతర నాయకులు వచ్చి బతిమాలడంతో ఆయన శాంతించారు. పంచాయతీ,ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకుడ్ని గడ్డిపూచ కంటే హీనంగా చేసి మాట్లాడడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడుకొని వెన్నుపోటుపొడిచిన పార్టీలో సుందరపు ఏ ముఖం పెట్టుకొని ఎందుకు కొనసాగుతున్నారో అంటూ మరికొందరు వాపోయారు. తాను పార్టీలో లేకుంటే ఏమవుతుందో తెలిసొచ్చేలా విజయకుమార్ సత్తాచూపాలని ఆయన అభిమానులు మాట్లాడుకున్నారు. సయోధ్య సమావేశం కాస్తా బల ప్రదర్శనకు వేదిక కావడంతో ఇదేమి పోకడంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. -
పండగ బోనస్‌గా రూ.17 కోట్లు
= 1.25 లక్షల మంది మహిళలకు చీరలు =డెయిరీ చైర్మన్ తులసీరావు గర్నికం (రావికమతం), న్యూస్‌లైన్ : డెయిరీ పాడి రైతులకు పండగ బోనస్‌గా రూ. 17 కోట్లు చెల్లిస్తున్నామని, 1.23 లక్షల మంది మహిళలకు చీరలు అదనంగా అందిస్తున్నామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తెలిపారు. గర్నికం, దొండపూడి, కన్నంపేట పాలకేంద్రాల్లో 383 మంది రైతులకు రూ.5,49,000 బోనస్‌ను, 297 మంది మహిళలకు చీరలు ఆదివారం అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. పాడి రైతుల సంక్షేమమే డెయిరీ ధ్యేయమని చెప్పారు. ఇవి కాక తుఫాన్లో నష్టపోయిన రైతులకు రూ. 25 కోట్లు నష్టపరిహారం అందించామని చెప్పారు. ప్రతి రైతూ అర లీటరు పాలైనా పోసి డెయిరీ పథకాలు పొందాలని ఆయన కోరారు. డెయిరీ ఆవరణలో రూ.10 కోట్లతో సూ పర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు. గుండె చికిత్స లు సైతం చేపడతామని చెప్పా రు. సుఖీభవ కార్డులు పొందిన రైతులకు వడ్డీలేని రుణాలు అంది స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ డెరైక్టర్ సత్యనారాయణ, మేడివాడ సర్పంచ్ రామారావు పాల్గొన్నారు. ప్రభుత్వం సమ్మతిస్తే వాలాబు నిర్మాణం అప్పలరాజుపురం(చీడికాడ) : ప్రభుత్వం అనుమతిస్తే కోనాం జలాశయం పైనగల వాలాబు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు చెప్పారు. ఆదివారం మండలంలోని అప్పలరాజుపురంలో రూ. 11 లక్షలతో నిర్మించిన కళ్మాణమండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజాప్రతినిధులు పోరాడి ప్రభుత్వం నుంచి అనుమతి సాధిస్తే, రిజర్వాయర్ నిర్మాణానికి తాము సిద్ధమని ప్రకటించారు. 2011 ఏప్రిల్ నుంచి 2012 మార్చి వరకు వరకు పాలు పోసిన పాడిరైతులకు సంక్రాంతి బోనస్ అందించనున్నట్టు ప్రకటించారు. చోడవరం డివిజన్లో గల ఏడు మండలాల్లో గల 21 వేల రైతులకు రూ. 3 కోట్లను సంక్రాంతి బోనస్‌గా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించని, నిర్మిస్తామన్న వారికి సహకరించదని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే కురచా రామునాయుడు, సర్పంచ్ చుక్కా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.