శాకాహారంతో ప్రొస్టేట్ కేన్సర్‌కు చెక్
పరిపరి శోధన
ముప్పయ్యేళ్లు నిండిన తర్వాత పూర్తిగా శాకాహారులుగా మారితే పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ బారిన పడకుండా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. పాల ఉత్పత్తులు, గుడ్లు సహా జంతు సంబంధ ఆహారాన్ని పూర్తిగా మానేసి, శాకాహారం తీసుకుంటున్నట్లయితే, ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు 35 శాతం మేరకు తగ్గుతాయని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముప్పయ్యేళ్ల వయసుకు పైబడిన 26 వేల మంది పురుషులపై ఐదేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు సాగించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు వారు అంటున్నారు. మాంసం మానేసి గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకున్న వారిలో కూడా మాంసాహారుల మాదిరిగానే ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగానే కనిపించాయని వివరిస్తున్నారు.