వరంగల్ లో అమూల్ పాలు
హైదారబాద్: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ తాజాగా తన కార్యకలాపాలను వరంగల్‌కూ విస్తరించింది. చాలా పాల కంపెనీలు వరంగల్‌లో టోన్‌డ్ పాలను (లీటరు) ధర రూ.41కు విక్రయిస్తోంటే.. తాము మాత్రం వాటి కన్నా తక్కువ ధరలకే పాలను ప్రజలకు విక్రయిస్తున్నామని అమూల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అమూల్ టాంజా’ (టోన్‌డ్ పాలు) ధర లీటరుకు రూ.38గా, అమూల్ గోల్డ్ (క్రీమ్ మిల్క్) ధర లీటరుకు రూ.50గా, ‘అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్’ (డబుల్ టోన్‌డ్ పాలు) ధర రూ.10 (300 ఎంఎల్ ప్యాక్)గా ఉంటుందని పేర్కొంది.