అప్రతిష్ట‘పాలు’
♦ పాడిపరిశ్రమ శాఖ మంత్రి నోటికి తాళం
♦ పాలలో కల్తీ మాటలపై నిషేధం
♦ రాజేంద్రబాలాజీపై రూ.3 కోట్ల నష్టపరిహార పిటిషన్
ఆవిన్ పాలు అమ్ముకునేందుకు ప్రయివేటు పాలపై కల్తీ ఆరోపణల బురద చల్లిన రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ నోటికి తాళం పడింది. ఆధారాలు లేని ఆరోపణలు తగదంటూ మద్రాసు హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రయివేటు పాలు కల్తీమయమంటూ ఇక మాట్లేందుకు వీలులేదని కోర్టు సోమవారం నిషేధాజ్ఞలు జారీచేసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రయివేటు డెయిరీల పాల ఉ త్పత్తులపై ఆరోపణలు చేసిన మంత్రి కి నోటీసు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. పాలు కల్తీమయం అంటూ సంచనలనం సృష్టించిన రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ మూడు డెయిరీలో కోర్టుకెక్కాయి. హాట్సన్ ఆగ్రో, దొడ్ల డెయిరీ, విజయ డెయిరీ యాజమాన్యాలు మద్రాసు హైకోర్టులో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.
‘‘ప్రయివేటు పాల కంపె నీదారులు బ్లీచింగ్, ప్రమాదకర రసాయనాలను కలిపిన పాలను సరఫరా చేస్తున్నారంటూ మంత్రి రాజేంద్ర బా లాజీ నిరాధార ఆరోపణలు చే స్తున్నా రు. అంతర్గతంగా దురుద్దేశ్యంతో చేస్తున్న ఆరోపణలు పాల వినియోగదారుల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. అంతేగాక మా కంపెనీల ఉత్పత్తుల గురించి తప్పుడు సమాచారం ప్రజలకు చేరుతోంది. ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న పాలను పరీక్షించకుండానే ఆరోపణలు చేస్తున్నారు. మా ఉత్పత్తులు కల్తీ లేని శుద్ధికరమైనవని ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లే స్పష్టం చేశాయి.
కాబట్టి మా కంపెనీ ఉత్పత్తులపై నిరాధార ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలి. ప్రతిష్టాకరమైన మా కంపెనీలను అప్రతిష్టపాలు చేసిన మంత్రి రాజేంద్రబాలాజీ తలా రూ.1 కోటి చెప్పున నష్టపరిహా రం చెల్లించేలా ఆదేశించాలి’’అని పిటిషన్‌లో కోరాయి. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తయిన అనంతరం న్యాయమూర్తి కార్తికేయన్ మంత్రి తరపు న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ, పిటిషన్‌దారుల కంపెనీలు ఉత్పత్తి చేసే పాలు, పాల ఉత్పత్తుల గురించి ఆధారాలు లేకుండా మంత్రి వ్యాఖ్యానాలు చేయడానికి వీల్లేదని ఆదేశించా రు. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంలటూ మంత్రికి నోటీసు జారీచేయాల్సిందిగా కోర్టును ఆదేశించారు.
పాల ఉత్పత్తిదారుల హర్షం
అవాకులు చెవాకులు పేలుతున్న మంత్రి రాజేంద్రబాలాజీ నోటికి కోర్టు తాళం వేయడాన్ని స్వాగతిస్తున్నామని తమిళనాడు పాల ఉత్పత్తిదారులు, కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ఏ పొన్నుస్వామి అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ల్యాబ్ పరీక్షలో అవి కల్తీ పాలు అని తేలితే కంపెనీకి సీలు వేసి క్రమశిక్షణ చర్య తీసుకోవడంలో తప్పులేదని ఆయన తెలిపారు.
నిత్యావసర వస్తువైన పాలను ప్రజలు పదే పదే సేవిస్తుంటారని, ఈ పరిస్థితిలో వినియోగదారులను భయపెట్టేలా ప్రకటనల చేయడం సమంజసం కాదని అన్నారు. పాలు కల్తీ జరగకుండా ముఖ్యమంత్రి ఎడపాడి ఇప్పటికైనా ఒక చట్టాన్ని తీసుకురావాలని, ప్రభుత్వ పాలు, ప్రయివేటు పాలు అనే తేడా చూడకుండా ప్యాకెట్ల తయారీకి ముందే పరీక్షలు జరపాలని ఆయన కోరారు. పాల కల్తీ పరీక్షలకు ఐదుగురితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని పొన్నుస్వామి సూచించారు.