న్యూఢిల్లీ: ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ధరను రూ.2 పెంచింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం (డిసెంబర్ 27) నుంచి ఈ పాల ధర పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది.
అయితే, ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్‌ల ఎంఆర్‌పీ (MRP)లో ఎటువంటి పెంపు ఉండదని పేర్కొంది. ఈ సంస్థ రెండు నెలల్లో పాల ధరలను పెంచడం ఇది రెండోసారి కాగా, ఏడాది వ్యవధిలో ఇది ఐదోసారి.
డెయిరీ ఫుల్‌క్రీమ్ మిల్క్‌పై లీటర్‌కు రూ.2 పెంచడంతో రూ.66 చేరకోగా, టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.51 నుంచి రూ.53కి చేరుకుంది. డబుల్ టోన్డ్ పాల ధర లీటరుకు రూ.45 నుంచి రూ.47కి పెరిగింది. అయితే ఆవు పాలు, టోకెన్ (బల్క్ వెండెడ్) పాల వేరియంట్‌ల ధరలను పెంచకూడదని మదర్ డెయిరీ నిర్ణయించింది.
ఇదిలా ఉండగా పాల ధరల పెంపు సామాన్యుల గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. పాడి రైతుల నుంచి కంపెనీకి ముడి పాల సేకరణ వ్యయం పెరగడమే ధరల పెంపునకు కారణమని మదర్ డెయిరీ పేర్కొంది. కారణం ఏదైన ఈ పాల ధరల పెంపు సామాన్యులకు కొంత భారంగానే మారనున్నాయి.
Mother Dairy hikes milk rate by Rs 2/litre effective from tomorrow
— ANI (@ANI) December 26, 2022
There is no revision in the MRP of Cow Milk and Token Milk variants. pic.twitter.com/SXoQ8sbqBS
చదవండి: ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా.. ఇలా చేస్తే రూ.15 లక్షలు వస్తాయ్!
Comments
Please login to add a commentAdd a comment