Vijaya Dairy Milk Price Hike By Rs 4 Hyderabad - Sakshi

విజయ పాల ధరలు పెంపు

Sep 5 2022 3:34 AM | Updated on Sep 5 2022 9:22 AM

Vijaya Dairy Milk Price Hike By 4 Rs Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. గేదె, ఆవు పాల ధరలను లీటర్‌­కు రూ.4 చొప్పున పెంచుతున్నామని, ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. నిజానికి పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమా­వేశం నిర్వహించి.. ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ అధికారికంగా అ­లాం­టి సమావేశమేమీ నిర్వహించకుండానే.. గు­ట్టు­చప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా బ­య­టికి వచ్చాయి. అయితే నెలవారీ కార్డులు తీసుకున్న వారికి ఆ పరిమితి ముగిసేంతవరకు.. అంటే సెప్టెంబర్‌ 10, 13 తేదీల వరకు పాత రేట్లే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ప్రకటించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement