
సాక్షి, హైదరాబాద్ : విజయ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. ప్రస్తుతం విజయ పాలు లీటరుకు రూ.42 వంతున విక్రయిస్తుండగా... ఇకపై రూ.44కు విక్రయించాలని నిర్ణయించింది. పాలసేకరణ ధరలు పెరగడంతో పాల సరఫరా ధర పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్) ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. స్టాండడైజ్ పాలు, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు పెంచినట్లు ప్రకటించింది.
పాల ధరలను తగ్గించాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పెంచిన విజయ పాల ధరను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారాన్ని, అలాగే తల్లి పాలకు దూరమైన పిల్లలు ఆధారపడే పాల ధరను పెంచితే పేద, మధ్యతరగతి పిల్లలు పాలకు దూరమవుతారన్నారు.