Vijaya Milk prices
-
విజయ పాలు..లీటరు రూ.44
సాక్షి, హైదరాబాద్ : విజయ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. ప్రస్తుతం విజయ పాలు లీటరుకు రూ.42 వంతున విక్రయిస్తుండగా... ఇకపై రూ.44కు విక్రయించాలని నిర్ణయించింది. పాలసేకరణ ధరలు పెరగడంతో పాల సరఫరా ధర పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్) ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. స్టాండడైజ్ పాలు, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు పెంచినట్లు ప్రకటించింది. పాల ధరలను తగ్గించాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పెంచిన విజయ పాల ధరను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారాన్ని, అలాగే తల్లి పాలకు దూరమైన పిల్లలు ఆధారపడే పాల ధరను పెంచితే పేద, మధ్యతరగతి పిల్లలు పాలకు దూరమవుతారన్నారు. -
విజయ పాలు లీటరు రూ. 2 పెంపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాలను లీటరుకు రూ. 2 పెంచుతున్నట్లు విజయ డెయిరీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ప్రస్తుతం లీటరు రూ. 38కి అందిస్తున్న పాలు.. ఈ నెల 5వ తేదీ నుంచి రూ. 40కి విక్రయించనున్నారు. ఈ మార్పును పరిగణనలోకి తీసుకుని వినియోగదారులు సహకరించాలని డెయిరీ అధికారులు విజ్ఞప్తి చేశారు. -
పాల ధర మళ్లీ పెంపు
లీటరుకు రూ.2 సేకరణ ధరలోనూ పెరుగుదల విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయ పాల ధరలు మళ్లీ పెరిగాయి. లీటరుకు రూ.2 పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయించింది. జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య పాల సేకరణ ధరను కూడా లీటరుకు రూ.2 పెంచుతూ తీర్మానించింది. పెరిగిన పాల ధరలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ఎండీ టి.బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం రూ.2 కోట్ల విరాళాన్ని అందించాలంటూ కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి పాలకవర్గం తీర్మానించిన రోజే పాల ధర పెంచుతూ నిర్ణయించటం గమనార్హం. మరోపక్క పాల ధరల పెంపుపై వినియోగదారులు భగ్గుమంటున్నారు. ఏడాదికాలంలో మూడుసార్లు ధరలు పెంచటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపడమేనని మండిపడుతున్నారు.