Anchor Rashmi Gautam Responds For Netizens Post Who Share Her Milk Product Promotion - Sakshi
Sakshi News home page

Rashmi Gautam: అవును తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు మానేశా.. నెటిజన్‌ పోస్ట్‌కు రష్మీ వివరణ

Published Sat, Mar 4 2023 12:31 PM | Last Updated on Sat, Mar 4 2023 1:30 PM

Anchor Rashmi Gautam Respond Netizens Post Who Share Her Milk Product Promotion - Sakshi

బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్టార్‌ యాంకర్‌ రాణిస్తున్న రష్మీ తరచూ తన కామెంట్స్‌ వార్తల్లోకి ఎక్కుతుంది. జంతు ప్రేమికురాలైన ఆమె జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన స్పందిస్తుంది. సోషల్‌ మీడియా సదరు సంఘటనలకు వ్యతిరేకంగా తన గొంతును వినిపిస్తుంది. ఇటీవల జరిగిన అంబర్‌పేట్‌ వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై ఆమె స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. అనంతరం కుక్కలు కూడా మనలాగే ప్రాణులని వాటికి సపరేటు వసతి కల్పించాలంది.

దీంతో అంతా ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. తాజాగా రష్మీ మరో ఘటనపై స్పందించింది. పాల ఉత్పత్తుల కోసం పలు సంస్థలు జంతువులను హింసిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పాల ఉత్పత్తుల తయారి విధానంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని ఎవరు వినియోగించద్దోని, పాల ఉత్త్పత్తులను బ్యాన్‌ చేయాలంటూ రష్మీ వివాదస్పద ట్వీట్‌ చేసింది. ఇక దీనిపై స్పందించిన ఓ నెటజన్‌ గతంలో ఆమె ప్రమోట్‌ చేస్తూ ఒపెన్‌ చేసిన ఐస్‌క్రిం పార్లర్‌ ఫొటోలను షేర్‌ చేసి రష్మీకి చురక అట్టించాడు.

‘ఈ సెలబ్రిటీలందరూ ఇంతే.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. ఆ తర్వాత ఇలా పోస్టులు పెడతారు’ అని కామెంట్స్ చేశాడు. అతడిపై పోస్ట్‌పై రష్మీ స్పందిస్తూ.. ‘‘అవును.. గతంలో తెలియక కొన్ని తప్పులు చేశాను. అయితే అవి తెలుసుకున్నాను. కొన్నాళ్ల నుంచి నేను పాలు తాగడం మానేశా. పాలు తాగడం వలన నా చర్మంపై అనారోగ్య ప్రభావం పడటం నేను గమనించాను. అయితే.. ఫ్యాక్టరీలలో పాల ఉత్పత్తుల తయారీ విధానం గురించి తెలుసుకున్న తర్వాత పూర్తిగా వాటిని ప్రమోట్ చేయడం కూడా ఆపేశాను’’ అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

చదవండి: 
అక్క మంచు లక్ష్మిపై మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. ఏ జన్మ పుణ్యమో..
అమిగోస్‌ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌? ఎప్పుడు.. ఎక్కడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement