Anchor Rashmi Gautam Strong Reply To Netizen Who Called Her Dog Over Amberpet Incident - Sakshi
Sakshi News home page

Anchor Rashmi Gautam: అంబర్‌ పేట్‌ ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్‌, ఆమె రియాక్షన్‌ చూశారా?

Published Sat, Feb 25 2023 9:38 AM | Last Updated on Sat, Feb 25 2023 2:38 PM

Rashmi Gautam Strong Reply to Netizen Who Called Her Dog Over Amberpet Incident - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్‌ బిజీ అయింది. కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

చదవండి: పెద్దగా ఆఫర్స్‌ లేవు.. అయినా ఆ స్టార్‌ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి

తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్‌ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్‌గా రియాక్ట్‌ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్‌లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్‌ చేసింది. ఇక ఆమె ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు!

కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్‌ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్‌పై కామెంట్‌ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్‌కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్‌ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్‌’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement