Calcium Deficiency- Symptoms- Problems -Solutions: కాల్షియం అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి కీలక శరీర విధులకు కాల్షియం చాలా అవసరం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు, నరాల సంకోచ, వ్యాకోచాలకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా, అస్థిపంజర పనితీరుకు కాల్షియం నిదర్శనం. అయితే కొందరిలో కొన్ని కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది.
ఇలా కాల్షియం లోపించడాన్నే వైద్యపరిభాషలో ‘హైపోకాల్సీమియా’అని అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోకపోతే ‘ఆస్టియో పేనియా’ అనే ఎముకలు సన్నబడిపోయే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు (రికెట్స్, ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని నివారించుకోవచ్చు.
కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు
►వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు
►కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం
►బద్ధకం, తీవ్రమైన అలసట
►బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు
►దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం
►తికమకగా అనిపించడం
►ఆకలి లేకపోవడం.
దీర్ఘకాలిక కాల్షియం లోపం అనేక ఇతర శరీర భాగాలను బాధించవచ్చు. అందువల్ల మనకు పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్ష చేయించుకుని, లోపం ఉందని నిర్ధారణ అయితే తగిన మందులు వాడటం ఉత్తమం. లేదంటే ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవడం అవసరం.
కాల్షియం లోప నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు
►పాలు, పాల ఉత్పత్తులు: జున్ను, రసమలై, పెరుగు, పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి యోగర్ట్ అనే పదార్థం, పనీర్
►కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు
►కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్
►సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు
►ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి.
►కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి కాబట్టి కాల్షియం లోపం లేకుండా చూసుకోవడం అత్యవసరం.
చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment