
'తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు'
హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఎగుమతులే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూరగాయలు, పాల ఉత్పత్తులు పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.
తెలంగాణలో 72 నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రాజెక్టులు లేవు కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగుపై దృష్టి పెట్టామని వివరించారు. గత పాలకులు వ్యవసాయమే దండుగ అన్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం రైతన్నకు అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగగా మారుస్తామని పోచారం అన్నారు.