
త్వరలో మార్కెట్‌లోకి అమూల్ పాల ప్యాకెట్లు
కాచిగూడ, త్వరలోనే హైదరాబాద్ నుంచి అమూల్ పాల ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ మిల్క్ ప్రొడక్ట్స్ హెడ్ దేబోశిష్ చటోపాధ్యాయ తెలిపారు.
శని వారం హైదరాబాద్, కాచిగూడలో జరిగిన రాష్ట్రస్థాయి అమూల్ మిల్క్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. అమూల్ అందిస్తున్న పాల ఉత్పత్తులకు రాష్ట్ర ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రానున్న రోజుల్లో రోజువారీగా పాల ప్యాకెట్లను అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.