ముంబై: బిజినెస్ కన్సల్టెన్సీ సేవల్లోని ‘నెక్ట్స్‌జి అపెక్స్’ తన ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుకోనున్నట్టు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో ఎఫ్‌ఎంసీజీ, హెల్త్, ఎఫ్‌అండ్‌బీ తదితర విభాగాల్లోకి విస్తరించాలన్న తమ ప్రణాళికల మేరకు అదనపు ఉద్యోగులను తీసుకోనున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం ఈ సంస్థకు 543 మంది ఉద్యోగులు ఉండగా, 2023 మార్చి చివరికి 902కు తీసుకెళ్లనున్నట్టు ప్రకటించింది. అదే విధంగా 2025 మార్చి నాటికి రూ.5,361కి పెంచుకోనున్నట్టు తెలిపింది. ప్రధానంగా తమకు 80 శాతం వ్యాపారం వస్తున్న పట్టణాల నుంచి నియామకాలు ఎక్కువగా ఉంటాయని, తదుపరి 40-50 శాతం ద్వితీయ, తృతీయ పట్టణాల నుంచి తీసుకోనున్నట్టు పేర్కొంది. (హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?)
‘‘70 శాతం మంది ఫీట్ ఆన్ స్ట్రీట్ ఫ్లీట్ నుంచి ఉంటారు. 20 శాతం మంది మధ్యస్థాయి పర్యవేక్షక విభాగాల్లో, 5 శాతం నిర్వహణ స్థాయిలో, 3 శాతం బ్యాక్ ఎండ్, 2 శాతం టాప్ మేనేజ్‌మెంట్ కోసం ఉద్యోగులను తీసుకుంటాం’’ అని సంస్థ సీఈవో అమర్‌నాద్ హెలెంబర్ ప్రకటించారు.
ఇదీ చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment