Employee appointments
-
పదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలిచ్చాం
న్యూఢిల్లీ: రైల్వేలో పదేళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయినా నియామకాలపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. రైల్వేలో రిక్రూట్మెంట్ జరగలేదని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్యసభలో సోమవారం ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 12 లక్షల మంది ఉద్యోగుల్లో గత పదేళ్లలోనే 40 శాతం నియామకాలు జరిగాయని వెల్లడించారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఇటీవల జరిగిన లోకో పైలట్ల పరీక్షకు 156 నగరాల్లోని 346 కేంద్రాల్లో 18.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. లెవల్ 1 నుంచి లెవల్ 6 నియామకాలకు 2.32 కోట్ల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భర్తీ చేశామని తెలిపారు. రైల్వే, రక్షణ వంటి శాఖలపై రాజకీయాలు సరికాదన్నారు. మంత్రి స్పందన సరిగా లేదంటూ విపక్షాలు అభ్యంతరం వెలిబుచ్చాయి. నిరసన వాకౌట్ చేశాయి.అత్యాధునిక భద్రతా చర్యలు మహాకుంభ్ మేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా డేటా భద్రంగా ఉందని మంత్రి అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతోందని, దాదాపు 300 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు దేశ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 60 స్టేషన్లను గుర్తించామని వైష్ణవ్ తెలిపారు. వీటన్నింటిలోనూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. నిలకడగా ఆర్థిక పరిస్థితి రైల్వే ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందన్న మంత్రి.. కోవిడ్ మహమ్మారి సందర్భంగా ఎదురైన సవాళ్లను విజయవంతంగా అధిగమించిందని చెప్పారు. ప్యాసింజర్ రైళ్లు, కార్గో ట్రాఫిక్ రెండింటిలోనూ వృద్ధి నమోదైందన్నారు. 2023 –24 మధ్య సుమారు రూ 2,78,000 కోట్ల ఆదాయం వచి్చందన్నారు. సిబ్బంది వ్యయం, పెన్షన్ చెల్లింపులు, ఇంధన వ్యయాలు, ఫైనాన్సింగ్‌పై రైల్వే ఖర్చు చేసిందన్నారు. తన సొంత ఆదాయంతోనే వ్యయాన్ని భరిస్తోందని, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కార్గో, సరుకు రవాణా ఆదాయంతో ప్రయాణికుల చార్జీల సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే మన రైల్వేలో అన్ని కేటగిరీల్లో టికెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయని వివరించారు. మార్చి 31 నాటికి 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణాతో మన దేశం ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. 50 వేల కిలోమీటర్ల ట్రాక్‌ల నిర్మాణం, 12 వేల అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, 14 వేల వంతెనల పునరి్నర్మాణం మన రైల్వే సాధించిన విజయాలని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఎగుమతుల రంగంలో.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వస్తువుల ఎగుమతులను రైల్వే ఎలా పెంచుతోందో వివరించారు ఆ్రస్టేలియాకు మెట్రో కోచ్‌లు ఎగుమతి చేస్తున్నామన్నారు. బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆ్రస్టేలియాలకు బోగీలు, ఫ్రాన్స్, మెక్సికో, రొమేనియా, స్పెయిన్, జర్మనీ, ఇటలీలకు ప్రొపల్షన్లు, మొజాంబిక్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు ప్రయాణికుల బోగీలు ఎగుమతి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు లోకోమోటివ్లను ఎగుమతి చేస్తున్నామని, సమీప భవిష్యత్‌లో బీహార్‌లోని సరన్ జిల్లాలో ఉన్న మర్హోరా వద్ద తయారైన 100కు పైగా లోకోమోటివ్లను ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆయా రాష్ట్రాల సహకారాన్ని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో రైల్వేలు విఫలమయ్యాయన్న ఆరోపణలు వైష్ణవ్ తోసిపుచ్చారు. -
ఉద్యోగులను భారీగా పెంచుకోనున్న కంపెనీ
ముంబై: బిజినెస్ కన్సల్టెన్సీ సేవల్లోని ‘నెక్ట్స్జి అపెక్స్’ తన ఉద్యోగుల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచుకోనున్నట్టు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో ఎఫ్ఎంసీజీ, హెల్త్, ఎఫ్అండ్బీ తదితర విభాగాల్లోకి విస్తరించాలన్న తమ ప్రణాళికల మేరకు అదనపు ఉద్యోగులను తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు 543 మంది ఉద్యోగులు ఉండగా, 2023 మార్చి చివరికి 902కు తీసుకెళ్లనున్నట్టు ప్రకటించింది. అదే విధంగా 2025 మార్చి నాటికి రూ.5,361కి పెంచుకోనున్నట్టు తెలిపింది. ప్రధానంగా తమకు 80 శాతం వ్యాపారం వస్తున్న పట్టణాల నుంచి నియామకాలు ఎక్కువగా ఉంటాయని, తదుపరి 40-50 శాతం ద్వితీయ, తృతీయ పట్టణాల నుంచి తీసుకోనున్నట్టు పేర్కొంది. (హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?) ‘‘70 శాతం మంది ఫీట్ ఆన్ స్ట్రీట్ ఫ్లీట్ నుంచి ఉంటారు. 20 శాతం మంది మధ్యస్థాయి పర్యవేక్షక విభాగాల్లో, 5 శాతం నిర్వహణ స్థాయిలో, 3 శాతం బ్యాక్ ఎండ్, 2 శాతం టాప్ మేనేజ్మెంట్ కోసం ఉద్యోగులను తీసుకుంటాం’’ అని సంస్థ సీఈవో అమర్నాద్ హెలెంబర్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్ -
అవి ఓకే.. మరి ఇవి?
సాక్షి, వరంగల్: జిల్లా ప్రజా పరిషత్‌ల తుదిరూపుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఈనెల 7, 8వ తేదీల్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికతో ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కా ర్యాలయాల ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల కేటాయింపు, మౌలిక వసతులపై మార్గదర్శకాలు అందకపోవడంతో అధికారులు సందిగ్దావస్థలో ఉన్నారు. గత ఐదునెలలుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, లెక్కింపు, పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియలో జెడ్పీ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇక కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5వ తేదీ కొలువు దీరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, జిల్లా పరిషత్‌ల కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుకు సాగాలంటే ప్రభుత్వం నుంచి సూచనలు, సలహాలతో కూడిన మార్గదర్శకాలు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగుల విభజన, కేటాయింపే సమస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2014 ఎన్నికల సమయంలో ఒకే జిల్లా పరిషత్, 50 మండల పరిషత్‌లు ఉండగా... జిల్లా పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 71 మండల పరిషత్, జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లా పరిషత్‌లు, ఆ జెడ్పీల పరిధిలో 70 జెడ్పీటీసీ, 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆరు జిల్లా పరిషత్‌లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక 67 మండల పరిషత్‌లకు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినా జిల్లా పరిషత్ విభజనపై ఇప్పటికీ మార్గదర్శకాలు అందలేదు. కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు అవసరమైన కొత్త భవనాలు, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనపై కసరత్తుతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తారా.. లేదా వర్క్ టు సర్వ్ కింద ఉన్న సిబ్బందినే ఆయా జిల్లాలకు కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఆరు జిల్లాలకు నోడల్ జెడ్పీగా ఉన్న వరంగల్ జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కేడర్ల వారీగా.. ఇప్పటి వరకు ఉన్న మౌలిక సదుపాయాలు, సామగ్రి వివరాలను రెండు నెలల క్రితమే ఉద్యోగులు కమిషనర్‌కు నివేదించారు. ప్రస్తుతం 74 మంది.. వరంగల్ జెడ్పీలో ప్రస్తుతం జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓతో పాటు 8 మంది సూపరింటెండెంట్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 29 జూనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు టైపిస్టులు సహా రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 74 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడే ఒక్కో జిల్లా పరిషత్‌కు కనీసం 19 మంది సిబ్బంది అవసరం. సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్లు, ముగ్గురు సీని యర్ అసిస్టెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఆరుగురు ఆఫీస్ సబార్డినేట్లు ఇలా మొత్తం ఒక్కో జెడ్పీలో ఎంత తక్కువ అనుకున్నా కనీసం 19 మంది అవసరం అవుతుందని అంచనా. ఈ లెక్కన ఆరు జిల్లాలకు కలిపి 114 మంది అవసరమవుతా రు. అదే విధంగా ఫర్నీచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, జిరాక్సు యంత్రాలు తదితర సామగ్రి కూడా కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదోన్నతులు కల్పించి కొత్త జిల్లాలకు సిబ్బందిని బదిలీ చేస్తారా లేదా సర్వ్ టు రూల్ కింద ఆయా జిల్లాల కలెక్టర్లే సిబ్బందిని కేటాయిస్తారా అన్న అంశాలు జిల్లా పరిషత్ ఉద్యోగుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓలు ఏరీ? ఉమ్మడి జిల్లాలో జిల్లాల పునర్విభజనతో పాటే కొత్త మండలాలు ఏర్పడగా వాటిలో ఎంపీడీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, వేలేరు, దామెర, టేకుమట్ల, కన్నాయిగూడెం, పలిమెల, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, తరిగొప్పుల, చిల్పూరు తదితర మండలాలు ఏర్పడగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మండలాల్లో కొత్త ఎంపీడీఓ కార్యాలయాల ఏర్పాటుతోపాటు ఉద్యోగులను విభజించి కేటాయించాల్సి ఉంది. ఒక్కో మండల పరిషత్‌కు కనీసం 9 మంది ఉద్యోగులను నియమిస్తే పాలన సాఫీగా కొనసాగుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఓ ఎంపీడీఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు అవసరమని పేర్కొన్నారు. కాగా, కొత్త కార్యాలయాలు, సిబ్బంది కేటాయింపుల మార్గదర్శకాలు సైతం జెడ్పీకి ఇంకా రాలేదని అధికారిక సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ ఛైర్పర్సన్లతో పాలకవర్గాలు ఏర్పడగా.. వచ్చే జులై 5న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్ కార్యాలయాలతో పాలన ప్రారంభిస్తారా లేదా.. అద్దె భవనాల్లోనా, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను జెడ్పీకి కేటాయిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా... జిల్లా పరిషత్‌లు 06 మండల పరిషత్‌లు (4 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు) 71 ప్రస్తుతం వరంగల్ జెడ్పీలో ఉద్యోగులు 74 ఒక్కో కొత్త జెడ్పీకి కావాల్సిన ఉద్యోగులు 19 ఒక్కో ఎంపీడీఓ కార్యాలయానికి కావాల్సిన ఉద్యోగులు 9 -
అర్చకులకు రూ.8 వేల కనీస వేతనం
ఆలయాల ఉద్యోగులకు కూడా... - ప్రభుత్వానికి మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు - గ్రామాల్లో రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10–12 వేల వరకు - ఆలయ నిధులు సరిపోకుంటే ప్రభుత్వ గ్రాంటుతో భర్తీ - మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలను మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు.. పట్టణ ప్రాంతాల్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనాలుగా ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతి పాదించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల అంశంపై ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యం లో నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస యాదవ్‌లతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం ప్రభుత్వానికి ప్రతి పాదనలు సమర్పించింది. మంగళవారం తుది దఫా భేటీ అయి ప్రభుత్వానికి మరిన్ని సిఫార్సులు చేయనుంది. చాలా కాలంగా ఎదురుచూపులు తగిన ఆదాయం లేని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు ప్రస్తుతం నామమా త్రపు వేతనాలే అందుతున్నాయి. దాంతో తమ జీవనం దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో.. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ సబ్ కమిటీ అర్చకులు, ఉద్యోగులు, దేవా దాయశాఖ అధికారులతో పలు దఫాలుగా సమావేశమై చర్చించింది. ఇతర రంగాల్లో ఉన్నట్టుగానే దేవాలయాల్లోనూ కనీస వేతనాలు ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదిం చింది. అయితే ఓ పద్ధతంటూ లేకుండా, అర్హతలేమీ పట్టించుకోకుండా పాలక మండళ్లే అర్చకులు, ఉద్యోగుల నియామకాలు చేస్తున్నందున.. ప్రస్తుతానికి దేవాదాయ శాఖ గుర్తించిన ఆలయాలకే కనీస వేతనాలను పరిమితం చేశారు. 3,300 మందికి లబ్ధి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12,500 వరకు ఆల యాలు ఉన్నాయి. వాటిలో కనీస వార్షికా దాయం రూ.50 వేలు, ఆపైన ఉన్న ఆలయా లుగా దేవాదాయశాఖ గుర్తించినవి 650 వరకు ఉన్నాయి. దేవాదాయ శాఖ ఈ ఆలయాలకు ప్రత్యేకంగా ఈవోలు, క్లర్కులను నియమించి పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయాలన్నింటిలో కలిపి 6 వేల మంది అర్చకులు, ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 2,700 మంది ఎక్కువ ఆదాయమున్న ఆలయాల్లో నిర్ధారిత స్కేల్‌కు సమంగా వేతనాలు పొందుతున్నారు. మిగతా 3,300 మంది అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రత్యేక నిధి ఏర్పాటుకు నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో తాత్కాలిక పద్ధతిలో (రోజుకు మూడు నాలుగు గంటల పాటు) పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు రూ.8 వేలు... పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.10 వేలు ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక పట్టణ ప్రాంతా ల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్నవారికి రూ.10 వేలు, పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వారికి రూ.12 వేలు చొప్పున చెల్లించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం వీరందరి వేతనాల కింద ఆయా దేవాలయాలు రూ.28 కోట్లు చెల్లిస్తున్నాయి. ఇప్పుడా మొత్తం సుమారు రూ.68 కోట్లకు పెరగనుంది. అంటే మిగతా రూ.40 కోట్లను ప్రభుత్వం భరిస్తుంది. ఈ మొత్తాన్ని గ్రాంటు రూపంలో ఇచ్చే నిధి నుంచి చెల్లిస్తారు. ఎవరికి ఎంత మొత్తం చెల్లిం చాలనే విషయాన్ని దేవాదాయ శాఖ త్వరలో సర్వే చేసి నిర్ధారిస్తుంది. మరో 1,200 ఆలయాలకు ‘ధూప దీప నైవేద్యం’ కొత్తగా మరో 1,200 ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకం కిందకు తేవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ పథకం కింద ఆ ఆలయాలకు నెలకు రూ.6 వేలు చొప్పున అందజేస్తారు. ప్రస్తుతం 1,805 ఆలయాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఇక ఆలయాల భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని.. అన్ని ఆలయాల కైంకర్యాల వివరాలను భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఇక నుంచి కమిషనర్ అనుమతి లేకుండా ఆలయాల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకుండా నిబంధన తీసుకురావాలని, వారసత్వ అర్చక నియామకాలను చట్ట ప్రకారం చేపట్టాలని, సిటీ సివిల్ కోర్టు ఇచ్చే డిక్రీ తరహాలో దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ప్రతిపాదించింది. ఆలయాల్లో ఖాళీల భర్తీ, వీలైనంత త్వరలో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేయాలని సూచించింది. అర్చకులు, ఉద్యోగుల హర్షం ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలన్న మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలపై దేవాలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తాము చాలాకాలంగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఇక మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం పట్ల తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్ల రామశర్మ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు మంత్రులను కలసి హర్షం వ్యక్తం చేశారు.