హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మమ్మాస్ బ్రాండ్‌తో ఈజీ టు కుక్ ఉత్పత్తుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ మంగమ్మ ఫుడ్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచుతోంది. మార్చిలోగా ఎనిమిది ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్‌లో ఇటువంటివి రెండు కేంద్రాలున్నాయి. 2023 చివరినాటికి 100 స్టోర్ల స్థాయికి చేరతామని మంగమ్మ ఫుడ్స్ కో– ఫౌండర్ ప్రతిమ విశ్వనాథ్ తెలిపారు. ఈ ఏడాదే బెంగళూరు, పుణే నగరాల్లో అడుగుపెడతామని, విస్తరణకు నిధులు సమీకరిస్తామన్నారు.
‘పచ్చళ్లు, తృణధాన్యాలు, స్వీట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వంటి 100 రకాల ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నాం. 10 లక్షల మంది వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. మూడవ వార్షికోత్సవం సందర్భంగా యాప్ ద్వారా జరిపే కొనుగోళ్ళకు పలు ఉత్పత్తులపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం. ఇక అన్ని స్టోర్లనూ కంపెనీ సొంతంగా స్థాపిస్తోంది. ఫ్రాంచైజీ విధానానికీ సిద్ధమే. స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసి స్థల యజమానికి కమీషన్ ఇస్తాం. అమ్మకాల్లో ఆన్‌లైన్ వాటా 10 శాతం ఉంది’ అని ప్రతిమా విశ్వనాథ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment