Amazon India Expansion Plans: అమెజాన్‌ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కల్పన! - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కల్పన!

Published Thu, Jul 15 2021 7:48 PM | Last Updated on Fri, Jul 16 2021 4:49 PM

Amazon India Plans To Expand Storage Capacity In India - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అమెజాన్‌ తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, అమెజాన్ ఇండియా 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను ప్రారంభించనుంది. కాగా  ప్రస్తుతం ఉన్న 9 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను మరింత విస్తరించనుంది. ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు,  వేర్‌ హౌస్‌ సెంటర్లతో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్‌ సిద్ధమైంది. అంతేకాకుండా పదివేల ప్రత్యక్ష,  పరోక్ష ఉపాధి  అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

అమెజాన్ వైస్‌ ప్రెసిడెంట్‌  అఖిల్ సక్సేనా మాట్లాడుతూ.. అమెజాన్‌ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వినియోగదారులకు సేవలనదించడంతో పాటుగా తగినశక్తిని అందించాలనే మా వాగ్ధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో విస్తృత ఎంపిక,  వేగవంతమైన డెలివరీతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర, బీహర్‌, గుజరాత్‌, అసోం, రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement