warehouses
-
గడచిన ఐదేళ్లలో 40శాతం గోదాముల సామర్థ్యం పెంపు
గన్నవరం: గడిచిన ఐదేళ్లలో గోదాముల సామర్థ్యాన్ని 40 శాతం పెంచడం రైతుల పట్ల సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.11.88 కోట్లతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు, 60 టన్నుల కెపాసిటీ కలిగిన లారీ వేబ్రిడ్జిని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కాకాణి పేర్కొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్థాపించిన 65 ఏళ్లలో 8.86 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సొంత గోదాములను నిర్మించినట్లు చెప్పారు. వీటిలో 2,23,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే నిర్మించినట్లు తెలిపారు. మరో 24,600 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాముల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. పాత గోదాములను రూ.21 కోట్లతో ఆధునికీకరించినట్లు తెలిపారు. ఈ గోదాముల్లో నిల్వ చేసుకునే పంట ఉత్పత్తులకు సంస్థ జారీ చేసే నిల్వ రశీదుపై బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. నిల్వ చార్జీల్లో 25 శాతం రైతులకు రిబేటు కల్పిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ జనాబ్ కరిముల్లా షేక్ అమీన్ మాట్లాడుతూ.. ఈ గోదాముల్లో పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా కెమికల్ ట్రిట్మెంట్తోపాటు శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్, కో ఆపరేషన్ ముఖ్య కార్యదర్శి బాబు.ఏ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీ జి.ఓంకార్‌రెడ్డి, పలువురు ఏఎంసీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
వేర్ హౌజ్‌లకు తగ్గిన డిమాండ్.. హైదరాబాద్‌లో సైతం..
న్యూఢిల్లీ: దక్షిణాదిలోని ప్రముఖ పట్టణాలు హైదరాబాద్, బెంగళూరు గోదాముల లీజింగ్ గతేడాది స్వల్పంగా తగ్గినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ తెలిపింది. వీటితోపాటు చెన్నై కలిపి చూస్తే 10.2 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) లీజింగ్ నమోదైనట్టు పేర్కొంది. 2022లో లీజింగ్ పరిమాణం 10.7 మిలియన్ ఎప్‌ఎఫ్‌టీగా ఉంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు, ఈ–కామర్స్ సంస్థలు గతేడాది గోదాముల లీజింగ్ డిమాండ్‌లో కీలక వాటా ఆక్రమించాయి. 2022లో గోదాముల లీజింగ్‌లో ఈ మూడు దక్షిణాది పట్టణాల వాటా 34 శాతంగా ఉంటే, గతేడాది 27 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో గోదాములు, లాజిస్టిక్స్ వసతుల లీజింగ్ 21 శాతం పెరిగి 37.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 2022లో ఇది 31.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉండడం గమనించొచ్చు. పట్టణాల వారీగా.. ►హైదరాబాద్‌లో గతేడాది గోదాముల లీజింగ్ 3.1 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2022లో ఇది 3.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ►బెంగళూరులో లీజింగ్ పరిమాణం 2022లో ఉన్న 4.1 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 2023లో 3.6 మిలియన్ ఎస్ఎఫ్టీకి తగ్గింది. ►చెన్నైలో మాత్రం 2022లో ఉన్న 2.9 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2023లో 3.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ►ముంబైలో 10.2 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. 2022లో 6 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంది. ►ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో 2022లో ఉన్న 7.3 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 2023లో 8.8 మిలియన్లకు పెరిగింది. ► పుణెలో 5.2 మిలియన్ల నుంచి 7 మిలియన్ల చదరపు అడుగులకు గోదాముల లీజింగ్ వృద్ధి చెందింది. పుణెలోని చక్దాన్ ఎండీసీ వాణిజ్య కేంద్రం ఈ వృద్ధికి దోహదపడినట్టు వెస్టిన్ నివేదిక తెలిపింది. ఇది తయారీ, లాజిస్టిక్స్ పార్కులకు ప్రముఖ కేంద్రంగా ఉంది. ► కోల్‌కతాలో గోదాముల లీజింగ్ 2022లో 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే, 2023లో 1.6 మిలియన్ ఎస్ఎఫ్టీకి తగ్గింది. ఈ ఏడాది సవాలే.. ‘‘2024–25 కేంద్ర బడ్జెట్ వచ్చే కొన్నేళ్ల కాలానికి దిక్సూచీ కానుంది. మౌలిక వసతుల అభివృద్ధికి ఇటీవలి మధ్యంతర బడ్జెట్లో సంబంధించి చేసిన ప్రకటనలు ఈ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. 2023లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టినందున 2024 భారత గోదాముల రంగానికి సవాలుగా నిలవనుంది’’అని వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
554 గోదాముల నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)కు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న గ్రామీణ గోదాముల (బహుళ ప్రయోజన కేంద్రాలు – ఎంపీఎఫ్‌సీలు) నిర్మాణంపై ఈనాడు కథనాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే తీవ్రంగా ఖండించారు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేంత వరకు రైతులు వాటిని నిల్వ చేసుకునేందుకు గ్రామ స్థాయిలో రూ.1,584.61 కోట్లతో 2,536 ఎంపీఎఫ్సీ గోదాములు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. 15 సెంట్ల భూమిలో 500 టన్నులు, 25 సెంట్ల భూమిలో 1,000 టన్నుల సామర్థ్యంతో ఈ గోదాములను నిర్మిస్తున్నామన్నారు. తొలివిడతలో రూ.493.15 కోట్ల అంచనా వ్యయంతో 1,167 గోదాముల నిర్మాణం చేపట్టామని, వీటిలో రూ.166.83 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు కడప డివిజన్లో అత్యధికంగా 271, గుంటూరు డివిజన్లో 152, విజయవాడ డివిజన్లో 93, విశాఖ డివిజన్లో 38 చొప్పున 554 గోదాముల నిర్మాణం పూర్తయిందన్నారు. జనవరి నాటికి 780 గోదాములు, మార్చి నాటికి మిగిలిన గోదాముల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పనుల పురోగతిపై చీఫ్ ఇంజనీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన చోట్ల కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలి విడతలో నిర్మిస్తున్న గోదాముల్లో రూ.7.76 కోట్లతో తేమ శాతం నిర్ధారించే పరికరాలు, కాటాలు, కంప్యూటర్లు ఇతర మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు తెలిపారు. రెండో విడతలో నిర్మించనున్న గోదాముల కోసం స్థలాల ఎంపిక వేగంగా జరుగుతోందన్నారు. వాస్తవం ఇలా ఉంటే కేవలం 350 గోడౌన్లు మాత్రమే పూర్తయినట్టుగా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. -
గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి
ముంబై: పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో గ్రేడ్ ఏ వేర్‌హౌస్ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్ ఆక్రమించినట్టు తెలిపింది. దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు దీర్ఘకాలంలో గ్రేడ్–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్ నివేదిక తెలిపింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్సీఆర్ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. -
అద్దెకు గోదాములు
సాక్షి, అమరావతి: ఆర్థిక పరిపుష్టి సాధించుకునే దిశగా మార్కెటింగ్ శాఖ అడుగులేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకివ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకుంటోంది. రాష్ట్రంలో 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 1,015 గోదాములు ఉన్నాయి. వీటితో పాటు 3,352 చోట్ల షాపులు, మరో 407 చోట్ల షాపులతో కూడిన గోదాములున్నాయి. ఇప్పటి వరకు కమిటీల పరిధిలో ఉన్న ఈ–చెక్‌పోస్టుల ద్వారా సెస్ వసూలు చేయడం, వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయడం, గోదాములను ప్రభుత్వ శాఖలకు అద్దెకు ఇవ్వడం వంటి కార్యకలాపాల ద్వారా మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరేది. ఇలా ఏటా రూ.450 కోట్ల నుంచి రూ.550 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఒకే దేశం– ఒకేమార్కెట్ విధానంతో సెస్ వసూళ్లను నిలిపివేయడంతో దాదాపు ఏడాది పాటు ఆదాయానికి గండి పడింది. 2021–22లో ఈ పన్నుల వసూళ్లను పునరుద్ధరించడంతో కాస్త గాడిలో పడినప్పటికీ ఆర్థికంగా మరింత పరిపుష్టి సాధించే దిశగా మార్కెటింగ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునే వారు. అలాగే బియ్యం కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం, ఇతర నిత్యావసరాల నిల్వ కోసం పౌరసరఫరాల శాఖ, ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తుల నిల్వ కోసం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, రాష్ట్ర గోదాముల సంస్థ, మార్క్ఫెడ్లకు అద్దెకిచ్చేవారు. గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కూడా గోదాముల్లో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వీరికి అద్దెకివ్వడం ద్వారా మార్కెటింగ్ శాఖ అదనపు ఆదాయం సమకూర్చుకుంటోంది. ఇప్పటివరకు అద్దెకు 2,976 షాపులు ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి గోదాములను అద్దెకు ఇస్తున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా అద్దెను నిర్ణయించి,konugolu.ap. gov.in ద్వారా టెండర్లు పిలుస్తున్నారు. అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆయా మార్కెట్ కమిటీలకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,976 షాపులు, 367 షాపులతో కూడిన గోదాములు, 614 గోదాములు అద్దెకిచ్చారు. వీటి ద్వారా ఏటా రూ.24 కోట్లకు పైగా అదనపు ఆదాయం మార్కెటింగ్ శాఖ సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీగా ఉన్న షాపులు, గోదాములను కూడా అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్‌కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎఫ్‌సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్‌కు వెళ్లి అక్కడి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్‌కు తరలించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
సివిల్ సప్లైస్ గోదాములపై సోలార్ పలకలు
సాక్షి, హైదరాబాద్: నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందడం కోసం పౌర సరఫరాల శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ గోదా ములపై సోలార్ పలకలను అమర్చి.. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, ఇదే సమయంలో పలుచోట్ల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుద్ధర ణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో కలసి సివిల్ సప్లైస్ పరిధిలోని గోదాములతోపాటు పెట్రోల్, ఎల్పీజీ ఔట్‌లెట్లలోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం పౌర సరఫరాల భవనంలో రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, తెలంగాణ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్, ఇతర అధికారులతో రవీందర్‌సింగ్ సమావేశమై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన కరెంటు చార్జీలను తగ్గించుకు నేందుకు గోదాముల్లో సోలార్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్టు రవీందర్‌సింగ్ వెల్లడించారు. తొలిదశలో సంస్థకు చెందిన 19 గోదాములు, రెండు పెట్రోల్ బంకులు, ఐదు ఎల్పీజీ గోదాములు కలిపి మొత్తం 26 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపా దనలపై చర్చించామన్నారు. అందులో 24 చోట్ల అనుకూలంగా ఉన్న ట్టుగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఇక తమ పరిధిలోని రైస్‌మిల్లుల్లోనూ సౌర విద్యుత్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. సమావేశం అనంతరం రవీందర్‌సింగ్ సికింద్రాబాద్‌లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయంపై సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. -
AP: ఇక చింతలేకుండా పంట నిల్వ
సాక్షి, అమరావతి: రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు ఇక ఇబ్బంది ఉండదు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బహుళ ప్రయోజన కేంద్రాల (ఎంపీఎఫ్ఎస్) తొలిదశ పనులను మార్చి నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రామస్థాయిలో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో 500 టన్నుల సామర్థ్యంతో 1,021 గోదాములు ఒక్కొక్కటి రూ. 40 లక్షల చొప్పున రూ. 408.40 కోట్లతో నిర్మిస్తుండగా, 1,000 టన్నుల సామర్థ్యంతో 113 గోదాములు ఒక్కొక్కటి రూ. 75 లక్షల చొప్పున రూ. 84.75 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటితో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా రూ. 166.33 కోట్లతో 8 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 19 ప్యాకేజీల్లో 1,134 గోదాములు 500 టన్నుల గోదాములకు 15 సెంట్ల భూమి, 1,000 టన్నుల గోదాములకు 25 సెంట్ల భూమి అవసరం. స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. 962 చోట్ల స్థలాలను మార్కెటింగ్ శాఖకు అప్పగించారు. 500 టన్నుల గోదాములు 6,500 చ.అ.విస్తీర్ణంలోనూ, 1,000 టన్నుల గోదాములు 11 వేల చ.అ.విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్నారు. తొలిదశలో రూ. 493.15 కోట్లతో నిర్మిస్తున్న 1,134 గోదాముల కోసం 19 ప్యాకేజీల కింద టెండర్లు ఖరారయ్యాయి. సంబంధిత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్స్ పూర్తికాగా, పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 57 గోదాముల నిర్మాణం పూర్తయింది. ఫినిషింగ్ స్టేజ్‌లో 72, సూపర్ స్ట్రక్చర్ స్టేజ్‌లో 142, బేస్మెంట్ స్థాయిలో 290, ఫుటింగ్ స్టేజ్‌లో 179, కాంక్రీట్ స్టేజ్‌లో 89 ఉండగా, మిగిలినవి ఎర్త్ వర్క్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు 88.23 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, రూ. 56.02 కోట్ల మేర చెల్లింపులు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు మరో వైపు కొనుగోలు కేంద్రాల్లో తేమ పరికరాలు, వేయింగ్ బ్యాలెన్స్‌లు, వేయింగ్ స్కేల్స్, కంప్యూటర్లతో పాటు టార్పాలిన్స్ కొనుగోలు చేస్తున్నారు. వీటిని తొలిదశలో 2,156 కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 812 కేంద్రాల్లో వీటి కొనుగోలుకు పరిపాలనా ఆమోదం తెలిపారు. 639 కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలను గుర్తించే ఎస్సైయింగ్ ఎక్యూప్మెంట్స్ (లాబ్వేర్, తేమ మీటర్లు, వెర్నియర్ కాలిపర్స్) సమకూరుస్తున్నారు. ఇప్పటికే 845 కంప్యూటర్స్, 441 తేమ పరికరాలు, 455 వెయింగ్ బాలెన్స్‌లు, 1068 వేయింగ్ స్కేల్స్‌ను రివర్స్‌టెండరింగ్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేశారు. వచ్చే సీజన్ నాటికి గోదాములు తొలిదశలో చేపట్టనున్న గోదాముల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 100 శాతం స్థలాల ఎంపిక పూర్తయ్యింది. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించాం. ఈ నెలాఖరుకల్లా కనీసం 50 శాతం పూర్తి కావాలని, మార్చి నాటికి 100 శాతం పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. – రాహుల్ పాండే, కమిషనర్ మార్కెటింగ్ శాఖ -
3.8 బిలియన్ డాలర్లు అవసరం
సాక్షి, హైదరాబాద్: దేశంలో గిడ్డంగుల స్థలానికి డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్లలో దేశంలో 22.3 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్ ఉందని, దీని కోసం 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం ఉందని సీఐఐ – అనరాక్ ‘ఇండియా వేర్‌హౌసింగ్’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ రంగం 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులను కలిగి ఉందని అనరాక్ క్యాపిటల్ ఎండీ అండ్ సీఈఓ శోభిత్ అగర్వాల్ తెలిపారు. 2018లో 3.4 కోట్లుగా చ.అ.లుగా ఉన్న గ్రేడ్–ఏ గిడ్డంగుల స్థలం 2021 నాటికి 4.85 కోట్ల చ.అ.లకు పెరిగింది. ఏటా 12.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. అలాగే 2018లో 3.78 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌస్ స్థలం సరఫరా.. 2021 నాటికి 10.6 వార్షిక వృద్ది రేటుతో 5.1 కోట్ల చ.అ.లకు చేరింది. ఏడు ప్రధాన నగరాలలోని గ్రేడ్–ఏ గిడ్డంగుల స్థలానికి డిమాండ్ ఉంది. 37 శాతం వాటాతో అత్యధికంగా 16 కోట్ల చ.అ. గిడ్డంగి స్థలంతో పశ్చిమాది నగరాలు (ముంబై, పుణే) తొలిస్థానంలో ఉన్నాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటా 32 శాతంగా కాగా.. భీవండి, చకన్, పన్వెల్, తలోజా వంటి పశ్చిమాది నగరాల వాటా 41 శాతంగా ఉంది. వేర్‌హౌస్ స్థలం అద్దె అత్యధికంగా ముంబైలో చ.అ.కు రూ.27 కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో రూ.20గా ఉన్నాయి. -
రాష్ట్రంలో గోదాములు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ బియ్యం బస్తాలతో నిండుగా కనిపించే గోదాములు స్టాక్ లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. వాటి ముందు ‘గోదాములు కిరాయికి ఇవ్వబడును’అనే బ్యానర్లు వెలుస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ రాష్ట్రంలోని గోడౌన్లలో ఉన్న బియ్యాన్ని అవసరమైన రాష్ట్రాలకు పంపుతోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములకు చేరాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం దాదాపు నాలుగు నెలలుగా సరిగా రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు.. వివిధ కారణాలతో మిల్లింగ్ ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని అవసరమైన వ్యాపారులు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు వేర్ హౌజింగ్ కార్పొరేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. గోదాముల్లో స్టాక్ 43 శాతమే.. భారత ఆహార సంస్థ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌సీఐ, సీడబ్ల్య్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన గోదాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందులో ఎఫ్‌సీఐ తన సొంత గోదాములతోపాటు రాష్ట్ర, కేంద్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల పరిధిలోనివి, ప్రైవేటుకు చెందినవి కలిపి 43 ప్రాంతాల్లోని గోదాములను లీజుకు తీసుకొని నిర్వహిస్తోంది. ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 13.58 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న ఈ గోదాములలో ప్రస్తుతం 5.83 లక్షల టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 42.94 శాతం మాత్రమే. ఇవికాకుండా ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కొన్ని, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే మరికొన్ని గోదాములు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మిల్లుల నుంచి బియ్యం రాకపోవడంతో ఎఫ్‌సీఐ ఖాళీచేసిన గోదాములను ఇతర వ్యాపారులకు, సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు పని లేకపోవడంతో ఈ గోదాముల్లోని హమాలీలు ఇబ్బందిపడుతున్నారు. ఇక్కడి గోదాములు బియ్యానికే పరిమితం రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన గోదాములన్నీ బియ్యం నిల్వ చేయడానికి ఉద్దేశించినవే. ఎఫ్‌సీఐ అప్పుడప్పుడూ గోధుమలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వల్లో గోధుమలు, ఇతర ఆహార పదార్థాలు కలిపి అంతా 5 శాతంలోపేనని.. మిగతా 95 శాతం బియ్యమేనని ఎఫ్‌సీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ బియ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ పూల్ కింద ఇతర రాష్ట్రాలకు పంపిస్తుండడంతో ఖాళీలు ఏర్పడుతున్నాయని వివరించారు. మిల్లుల్లోనే 65 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో సుమారు ఆరు నెలలుగా కస్టమ్ మిల్లింగ్ సజావుగా సాగడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. మిల్లర్లు తమ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఎఫ్‌సీఐ చర్యలకు దిగినప్పుడు మాత్రమే సీఎంఆర్ అప్పగిస్తున్నట్టు హడావుడి చేస్తున్న మిల్లర్లు.. తర్వాత తమ సొంత అవసరాల మేరకే మిల్లింగ్ జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది వానాకాలం ధాన్యం ఇప్పటికీ 15 లక్షల టన్నుల వరకు మిల్లర్ల వద్ద ఉండగా.. గత యాసంగికి సంబంధించిన 50లక్షల టన్నులు టార్పాలిన్ల కింద మగ్గిపోతోంది. అంటే 65 లక్షల టన్నుల ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. దీన్ని మిల్లింగ్ చేస్తే 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి అందుతుంది. ఆ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి నిల్వ చేయనున్నారు. -
వానాకాలం బియ్యం యాడబొయ్యాలె?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం మధ్య మొదలైన ధాన్యం, బియ్యం రగడకు ఇప్పట్లో తెరపడేలా లేదు. వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. 11న ఢిల్లీలో ప్రజాప్రతినిధులంతా ధర్నాకు సిద్ధమయ్యారు. వచ్చే వారంలో యాసంగి కోతలు మొదలవనుండగా ధాన్యం కొనుగోలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు గోదాముల్లోని బియ్యం మూవ్మెంట్ లేక మగ్గిపోతుండగా 2020–21 వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ని ఎక్కడికి తరలించాలో అర్థంకాని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జూలైలోగా వానాకాలం ధాన్యానికి సంబంధించి 47 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (సీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 15.37 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చింది. మిగతా 31.68 ఎల్ఎంటీ బియ్యాన్ని తరలించేందుకు గోదాములు కూడా ఖాళీ లేవు. గడువు ముగిసిందనే నెపంతో 2020–21 యాసంగి సీఎంఆర్ 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోబోమని ఎఫ్‌సీఐ తెగేసి చెప్పింది. ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. తాజాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న కయ్యం నేపథ్యంలో మరోసారి వానాకాలం సీజన్ సీఎంఆర్‌పై వివాదం రేకెత్తే పరిస్థితి కనిపిస్తోంది. గోదాముల్లో జాగా లేదు... రాష్ట్రంలో ఎఫ్‌సీఐ గోదాములతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గోదాములు, ప్రైవేటు గోదాములు 72 ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి సామర్థ్యం 20.05 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ గోదాములన్నీ ప్రస్తుతం 2020–21 యాసంగి, వానాకాలం బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు తరలించే బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అక్కడి అవసరాలకు అనుగుణంగా తీసుకెళ్తుండటం, రైల్వే రేక్‌లను సమయానుకూలంగా సమకూర్చకపోవడంతో గోదాముల్లోని బియ్యంలో లక్క పురుగులు, ఎలుకలు, పందికొక్కులు చేరి పొక్కిలి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లో... ధాన్యం నిల్వలన్నీ మిల్లుల్లో మగ్గే పరిస్థితి నెలకొంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వచ్చే బియ్యాన్ని తరలించేందుకు గోదాములు ఖాళీ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించిన సొమ్ము రీయింబర్స్మెంట్ కింద తిరిగి రాక ఆందోళన చెందుతోంది. ఉత్పత్తి, నిల్వకు మధ్య భారీ తేడా... 2020–21 యాసంగి (రబీ)కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 92.34 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందులో 67 శాతం బియ్యాన్ని (62.53 లక్షల మెట్రిక్ టన్నులు) ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. కానీ మార్చి 31 నాటికి 53.38 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేసింది. ఇంకా 9.15 ఎల్ఎంటీ బియ్యాన్ని ఇవ్వడానికి మే 31 వరకు రాష్ట్రం గడువు కోరినా కేంద్రం ససేమిరా అన్నది. ఇక వానాకాలం సీజన్ సీఎంఆర్ కింద 47 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 15.37 ఎల్ఎంటీ మాత్రమే ఇచ్చింది. మిగతా 31.68 ఎల్ఎంటీ బియ్యం నిల్వ చేసేందుకు గోదాములను ఎప్పటికప్పుడు ఖాళీ చేయడమొక్కటే పరిష్కారం. అయితే ప్రస్తుతం గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తరలించడాన్నిబట్టి కొత్తగా బియ్యం నిల్వలను నింపల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనుగుణంగా ఎఫ్‌సీఐ గోదాములను సమకూర్చుకోకపోవడంతోపాటు గోడౌన్లలోని నిల్వలను ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకపోవడం సమస్యకు కారణంగా అధికారులు చెబుతున్నారు. గోదాములన్నీ బియ్యంతో నిండిపోవడంతో మిల్లుల నుంచి కొత్తగా సీఎంఆర్ సరఫరా చేసే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ వాదిస్తోంది. అయితే గత యాసంగి తాలూకు బియ్యం 9.15 ఎల్‌ఎంటీని కేంద్రం తీసుకోకపోయినా మిల్లింగ్ చేసి రాష్ట్ర అవసరాలకు నిల్వ చేయాల్సిందే. అలాగే వానాకాలం సీజన్ బియ్యం 31.68 ఎల్ఎంటీ బియ్యం కలిపితే 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలకు అనుగుణంగా జూలై నాటికి గోదాములు సిద్ధంగా ఉంటాయా అనేది ప్రశ్న. 20.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించాం: ఎఫ్‌సీఐ డిసెంబర్ 2021 నుంచి ఈ మార్చి వరకు రాష్ట్రంలోని గోదాముల నుంచి 20.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించినట్లు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. 2020–21 యాసంగి సీఎంఆర్ డెలివరీకి సెప్టెంబర్ 2021తో గడువు ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐదుసార్లు గడువు పొడిగించామని, వానాకాలం సీజన్ బియ్యం కోసం జూలై వరకు మాత్రమే గడువు ఉందని ఆయన తెలిపారు. -
ఉద్యోగుల చేతివాటం! అప్పగించమంటే అమ్మేసుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: అమెజాన్ గోదాములకు చేర్చాల్సిన కంప్యూటర్ ఉపకరణాలను స్వాహా చేసి అమ్మేసుకున్న అమేజ్ సొల్యూషన్స్ సంస్థ ఉద్యోగులతో పాటు రిసీవర్లను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసినట్లు దర్యాప్తు అధికారిగా ఉన్న టీమ్–1 ఏసీపీ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ కంప్యూటర్ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది. ఆన్లైన్ ద్వారానూ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు అమెజాన్‌లో ‘ఏ1 ప్రై స్ ఏ1 ప్రొడక్ట్స్’ అనే డిస్ప్లే నేమ్ నమోదై ఉంది. కస్టమర్ల ఆర్డర్లకు తగ్గట్టు ఆనందిత్ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ గోదాములకు చేరుస్తుంటుంది. అక్కడి నుంచి ఈ సరుకు అమెజాన్ ద్వారా వినియోగదారులకు డెలివరీ అవుతుంది. తమ ఉత్పత్తులను నిర్ణీత ప్రమాణాలు, పరిమాణంతో ఉండే బాక్సుల్లో ప్యాక్ చేసే ఆనందిత్ సంస్థ వాటిపై షిప్మెంట్ లేబుల్‌ను అతికిస్తుంది. వీటిని ఈ సంస్థ నుంచి అమేజాన్ గోదాములకు చేర్చే బాధ్యతను ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమేజ్ సొల్యూషన్స్ నిర్వహిస్తుంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆనందిత్ సంస్థ నుంచి ఆయా బాక్సులను సేకరించి భద్రంగా అమేజాన్ గోదాములకు చేరుస్తుంటారు. అమేజ్ సంస్థకు నగరానికి సంబంధించి ఉప్పల్‌లోని హెచ్ఎండీఏ లేఔట్లో ఉన్న గోదాము ద్వారా ఈ రవాణా జరుగుతుంది. ఈ సంస్థలో అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లు డెలివరీ బాయ్స్‌గా, నర్సింగ్ యాదవ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నగరానికి చెందిన వ్యాపారి కృష్ణకుమార్‌తో అనిల్, మనోజ్‌లకు పరిచయం ఉంది. అమేజాన్ గోదాములకు డెలివరీ చేసే సరుకులో కొంత స్వాహా చేసి తీసుకువస్తే తాను ఖరీదు చేస్తానంటూ అతను వీరిద్దరితో చెప్పాడు. దీనికి అంగీకరించిన ద్వయం కొన్నాళ్లుగా సరుకు స్వాహా చేసి కృష్ణకు అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదలు అమెజాన్ సంస్థ నుంచి ఆనందిత్‌కు ఈ–మెయిల్స్ రూపంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్డర్ ప్రకారం సరుకు రావట్లేదని, వచ్చిన వాటిలోనూ కొంత తక్కువ ఉంటోందని వాటి సారాంశం. ఈ నేపథ్యంలో ఆనందిత్ సంస్థ లోతుగా ఆరా తీయగా రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిని దర్యాప్తు చేసిన అధికారులు అనిల్‌కుమార్, మనోజ్‌కుమార్‌లతో పాటు కృష్ణకుమార్‌ను అరెస్టు చేశారు. వీరి సరుకు చోరీ చేస్తున్నారని తెలిసినా యాజమాన్యానికి ఫిర్యాదు చేయని డ్రైవర్ నర్సింగ్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. విచారణ నేపథ్యంలోనే సరుకు మొత్తం అమీర్‌పేట, సికింద్రాబాద్‌ల్లో ఉన్న ఐదుగురు సెల్‌ఫోన్, కంప్యూటర్ దుకాణదారులకు విక్రయించినట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా పరిగణిస్తూ సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రూ.లక్షల విలువైన కంప్యూటర్ విడి భాగాలు రికవరీ చేశారు. ఫిర్యాదుదారులు పేర్కొన్న స్థాయిలో సరుకు చోరీ జరగలేదని భావిస్తున్నారు. దీన్ని నిర్థారించే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. (చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి) -
అద్దెకు మార్కెటింగ్ శాఖ గోడౌన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 1,059 గోదాములు ఉన్నాయి. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునేవారు. మిగిలిన గోడౌన్లను ప్రభుత్వరంగ సంస్థలైన సివిల్ సప్లయిస్, రాష్ట్ర గోదాముల సంస్థకు అద్దెకు ఇచ్చేవారు. అయినప్పటికీ మరికొన్ని గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే వెసులుబాటును మార్కెటింగ్ శాఖ కల్పిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వీటిని అద్దెకు ఇస్తారు. చదరపు అడుగుకు రూ.5పైగా అద్దె వస్తేనే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,53,639 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 258 గోదాములను చదరపు అడుగు రూ.5కు మించి ఎవరు కోట్ చేస్తారో వారికి అద్దెకిచ్చేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. అత్యధికంగా గుంటూరులో 44, అత్యల్పంగా విశాఖపట్నంలో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 7, వైఎస్సార్ జిల్లాలో 6 గోడౌన్లను చదరపు అడుగుకు రూ.6 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మిగిలిన వాటిని కూడా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు లీజుకిచ్చేందుకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
బియ్యం ఎక్కడ నిల్వ చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ గోదాములన్నీ నిండిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ అయిన బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యమని ఆయన ధ్వజమెత్తారు. పౌరసరఫరాల భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌సీఐకి రాష్ట్రంలో 20.37 లక్షల సామర్థ్యం గల గోదాములు ఉండగా, ప్రస్తుతం సామర్థ్యానికి మించి మరో 28 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కువగా నిల్వచేసినట్లు తెలిపారు. గోదాముల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయకుండా కేంద్రం తన వైఫల్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై రుద్దడానికి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
బియ్యం నిల్వకు గోదాములెక్కడ?
సాక్షి, హైదరాబాద్: రైతులు ధాన్యం పండిస్తారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పండించిన ధాన్యాన్ని సేకరించి.. మిల్లింగ్ చేయించి.. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ సూచించిన గోడౌన్లకు రాష్ట్రం పంపిస్తుంది. ఎఫ్‌సీఐ సెంట్రల్‌పూల్ విధానం ద్వారా ఆ బియ్యాన్ని పీడీఎస్, ఇతర సంక్షేమ పథకాల(ఓడబ్లు్యఎస్) కింద మళ్లీ ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. సాధారణంగా ఇదీ ధాన్యం సేకరణ, బియ్యం పంపిణీ విధానం. కానీ, దేశవ్యా ప్తంగా ధాన్యం దిగుబడి పెరిగి, బియ్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రేషన్ విధానాన్ని అమలు చేస్తుంది. అవసరాల మేరకే కొనుగోలు.. ఎఫ్‌సీఐకి ఉన్న గోడౌన్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థల ఆధ్వర్యంలోని గోడౌన్లు, ప్రైవేటు గోడౌన్లను కేంద్రమే అద్దెకు తీసుకుని నిర్వహిస్తుంది. కేంద్రం బియ్యం కొనుగోలు చేస్తేనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడి తిరిగివస్తుంది. అయితే నిల్వసామర్థ్యం, మార్కెటింగ్‌ను బట్టే రాష్ట్రాలు పండించిన పంటలో తనకు అవసరమైన మేరకే బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది. ముందుగానే ఆ సంవత్సరానికి కొనుగోలు చేసే కోటా ఎంతో నిర్ణయించి ఎఫ్‌సీఐ ద్వారా సేకరిస్తుంది. మొత్తం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తే.. నిల్వకు గోడౌన్లు సరిపోవు. గిడ్డంగుల సామర్థ్యమే సమస్య.. 2019–20లో ఎఫ్‌సీఐకి 20.47 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగుల కెపాసిటీ ఉండగా, 2020–21 నాటికి 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గిడ్డంగుల కెపాసిటీ పెరిగింది. అయితే రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న బియ్యం, గిడ్డంగుల కెపాసిటీకి మధ్య చాలా తేడా ఉంది. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో కలిపి 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి, సీఎంఆర్ కోసం మిల్లులకు పంపింది. దీని మిల్లింగ్ ద్వారా దాదాపు 95.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చింది. గత వానాకాలం బియ్యం సెంట్రల్ పూలింగ్ విధానంలో ఎఫ్‌సీఐ ద్వారా పీడీఎస్, ఇతర అవసరాలకు పంపిణీ కాగా మిగిలినది గోడౌన్లకు చేరింది. ఇక యాసంగిలో సీఎంఆర్ ద్వారా రావలసిన 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నిల్వ చేయాలి. ఇందులో ఇప్పటి వరకు దాదాపు 50% సీఎంఆర్ ద్వారా గోడౌన్లకు చేరింది. మిగతా బియ్యం మిల్లుల నుంచి రావలసి ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యం నిల్వ చేయడానికి గోడౌన్లు లేక వేరే రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. 8.13 కోట్ల మెట్రిక్ టన్నుల స్టోరేజీ.. ఎఫ్‌సీఐ, ఇతర గోడౌన్లు కలిపి దేశవ్యాప్తంగా 2,223 ఉన్నాయి. వీటి కెపాసిటీ 8.18 కోట్ల మెట్రిక్ టన్ను లు. ఈ గిడ్డంగుల్లో బియ్యంతో పాటు గోదుమలు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేయాలి. దీంతో బియ్యం నిల్వలకు సమస్య ఎదురవుతోంది. ఏ రాష్ట్రంలో సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని దాదాపుగా అదే రాష్ట్రంలో నిల్వ చేస్తుండటంతో తెలంగాణలో సమస్య వస్తోంది. తెలంగాణలోని 72 గోడౌన్లలో 23 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేసే సామర్థ్యం ఉండగా, ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. తాజాగా యాసంగి బియ్యం వస్తుండటంతో ఎఫ్‌సీఐ చేతులెత్తేసింది. ఇందులో భాగంగానే వానాకాలం పంటను మిల్లులకు పంపించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. బాసుమతికే ఎగుమతుల్లో డిమాండ్ అధిక బియ్యం సమస్యను పరిష్కరించాలంటే రెండే మార్గాలు. ఒకటి నిల్వ సామర్థ్యం పెంచుకోవడం. రెండోది విదేశాలకు ఎగుమతి. బాసుమతి బియ్యం, నాణ్యమైన సన్న బియ్యాన్ని మాత్రమే ఆ దేశాలు తీసుకుంటుండటంతో సమస్య వస్తోంది. నాలుగేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం... రెండుమూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఉప్పు డు బియ్యం సుమారు 50 లక్షల టన్నుల వరకు రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ గోడౌన్లలో పేరుకుపోయినట్లు ఎఫ్‌సీఐ వర్గాల సమాచారం. అందు కే ఆ బియ్యం కొనబోమని కేంద్రం చెబుతోంది. ఉప్పుడు బియ్యం ఎగుమతులు తగ్గడం, దేశంలో ఈ బియ్యం తినే ప్రజలున్న రాష్ట్రాల్లోనూ బాయిల్డ్ మిల్లులు తెరవడంతో గోడౌన్లు ఖాళీ కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల కేంద్రం చెప్పి, నిల్వ బియ్యం నాలుగేళ్లకు సరిపోతాయని పేర్కొంది. 6 కోట్ల మెట్రిక్ టన్నుల సేకరణ.. 2020–21 ఖరీఫ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్‌కు సేకరించిన బియ్యం 6 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇందులో నుంచి 1.20 కోట్ల మెట్రిక్ టన్నులను కరువు కాటకాలు, యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు, సైనికులు, కార్మికుల కోసం నిల్వచేస్తారు. ప్రతి ఏటా ఈ నిల్వలను ఖాళీ చేసి కొత్త స్టాక్‌ను ఉంచుతారు. మరో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. మిగతా 3.6 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. -
బియ్యంతో నిండిపోయిన గోదాములు
నల్లగొండ జిల్లాలో గోదాముల్లో 4,81,838 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అందులో ఎఫ్‌సీఐ గోదాములు బియ్యంతో ఇప్పటికే నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 8.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా మిల్లుల్లో పెట్టింది. గోదాములు ఖాళీ లేక బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. రోజుకు ఒక వ్యాగన్ ద్వారా 3800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అవసరమైన చోటికి పంపాల్సి ఉండగా, 4 రోజులకు ఒక వ్యాగన్ ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్‌లోనూ ఎఫ్‌సీఐతోపాటు చిన్నాచితక గోదాముల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అక్కడ 12 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి మిల్లులకు అప్పగించింది. అక్కడున్న గోదాములు 90 శాతం బియ్యంతో నిండి ఉన్నాయి. అక్కడినుంచి రోజుకు రెండు వ్యాగన్లలో బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు లేదా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తేనే సేకరించిన ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక వ్యాగన్ ద్వారా మాత్రమే బియ్యాన్ని ఎక్స్‌పోర్టు చేస్తుండటంతో మిల్లింగ్ కుంటుపడుతోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా తగ్గడంతో గోదాముల్లో ఖాళీలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మిల్లుల నుంచి బియ్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం చేస్తోంది. దీనికితోడు తాజాగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోబోమని పేర్కొనడంతో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ఎఫ్‌సీఐ ఇచ్చే ప్రక్రియ స్తంభించిపోయింది. దీంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం వర్షాలకు తడిచి నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. కేంద్రం వద్దన్నా ముందుకొచ్చిన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని ఆ చట్టంలో పేర్కొంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లాల్లో గోదాముల సామర్థ్యం తక్కువగా ఉన్నా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ మార్కెట్‌యార్డులు, ఫంక్షన్ హాళ్లను తీసుకొని మిల్లర్లకు ఇచ్చి అక్కడ ధాన్యం నిల్వ చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఎఫ్‌సీఐ గోదాముల్లోని బియ్యం అంతర్రాష్ట్ర సరఫరా మందగించింది. ఒక్కో జిల్లా నుంచి రోజుకు నాలుగైదు వ్యాగన్ల ద్వారా బియ్యం పంపించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యాగన్ ద్వారా బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. నల్లగొండ మండలంలోని ఓ రైస్‌మిల్ ఆవరణలో నిల్వ ఉంచిన ధాన్యం ప్రైవేటు గోదాములు ఉన్నా వాడుకోలేని పరిస్థితి.. ఎఫ్‌సీఐ గోదాములు నిండిపోయిన నేపథ్యంలో ప్రైవేటు గోదాములు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు గోదాములను టెండర్ ద్వారానే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఆన్లైన్ టెండర్ జారీ చేసి, 15 రోజులు సమయం ఇవ్వాలని, తర్వాతే గోదాములను తీసుకోవాలని పేర్కొంది. ఇందుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే వద్దంటున్న కేంద్రం 2019–20 రబీ సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని సీఎంఆర్‌గా మార్చి ఎఫ్‌సీఐ ఇస్తూ వచ్చారు. చివరలో దాదాపు 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇక ఈ సీజన్లో బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. బియ్యం తీసుకోబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గడిచిన సీజన్లలో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేదని, అందుకే ఈ సారి ఇప్పటికే గడువు దాటినందున బియ్యం తీసుకోబోమని పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం సేకరించిన ధాన్యం పరిస్థితి ఏంటన్నది గందరగోళంగా మారింది. -
40శాతం విస్తరణకు అమెజాన్ కీలక నిర్ణయం
-
అమెజాన్ కీలక నిర్ణయం.. భారీగా ఉద్యోగాల కల్పన!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అమెజాన్ తన నిల్వ సామర్థ్యాన్ని దాదాపు 40 శాతం విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, అమెజాన్ ఇండియా 11 కొత్త ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ప్రారంభించనుంది. కాగా ప్రస్తుతం ఉన్న 9 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను మరింత విస్తరించనుంది. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, వేర్ హౌస్ సెంటర్లతో భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అమెజాన్ సిద్ధమైంది. అంతేకాకుండా పదివేల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ.. అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వినియోగదారులకు సేవలనదించడంతో పాటుగా తగినశక్తిని అందించాలనే మా వాగ్ధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో విస్తృత ఎంపిక, వేగవంతమైన డెలివరీతో వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర, బీహర్, గుజరాత్, అసోం, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. -
రైతులకు మేలు చేయడమే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పీఎం కిసాన్ సీఈవో, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఏఐఎఫ్ మిషన్ డైరెక్టర్ వివేక్ అగర్వాల్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. (పల్లెకు 104 పరుగులు) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్)కి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివేక్ అగర్వాల్ తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. (అమరావతికి నిధుల సమీకరణ) ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఉంటాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను ఆర్బీకేలు పరిష్కరిస్తాయన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని వెల్లడించారు. కియోస్క్‌లో ఆర్డర్ చేయగానే 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ధారించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుతాయని తెలిపారు. అలాగే ఈ-క్రాప్ చేస్తామన్నారు. ‘‘గ్రామ సచివాలయంలో ఉన్న రెవెన్యూ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు కలిసి ఈ–క్రాపింగ్ చేస్తారు. వాటిలో పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి.ఇంకా జియో లొకేషన్ ట్యాగ్ కూడా చేస్తారు. రుణాలు రాలేదని ఎవ్వరైనా చెబితే.. వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే బీమా సదుపాయం కూడా కల్పిస్తాం. ఆర్బీకేల్లో కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం. మార్కెట్లో ధరలు తగ్గితే వెంటనే మార్కెటింగ్‌లో జోక్యం (ఎంఐఎస్) చేసుకుంటామని’’ సీఎం తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని, దీని కోసం ప్రత్యేక ఫ్లాట్‌ఫాం కూడా తీసుకువస్తున్నామని సీఎం వెల్లడించారు. అంతే కాకుండా గ్రామాల్లో జనతా బజార్లను తీసుకు వస్తామన్నారు. ‘‘ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలే జరుగుతుంది. వీటితోపాటు ప్రతి గ్రామంలో గోడౌన్లను, స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రీ ప్రాసెసింగ్‌తో పాటు, గ్రేడిండ్ కూడా అక్కడే చేస్తాం. అలాగే మండలాల్లో కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం.టమోటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తాం. ఆర్బీకేల ఆలోచన వచ్చిన దగ్గర నుంచి.. వాటి ఏర్పాటుతో పాటు.. ఈ అంశాలన్నింటిపైనా మేం దృష్టి పెట్టాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయే పరిస్థితి. దీనిపై కూడా దృష్టి పెట్టామని’’ సీఎం తెలిపారు. అమూల్‌తో ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నామని, పాడి పరిశ్రమ వృద్దికి ఇది తోడ్పడుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అణగారిన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు ఇది మంచి ఉపయోగకరమని, పాడి పశువుల పెంపకంతో వీరికి మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నామన్నారు. సీఎం విజన్ బాగుంది: వివేక్ అగర్వాల్ రైతులకు సబ్సిడీలే కాదు.. సదుపాయాలు కల్పించడం అన్నది చాలా ముఖ్యమని వివేక్ అగర్వాల్ అన్నారు. ముఖ్యమంత్రి దార్శినికత రైతులకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు. -
పంటల నిల్వకు 9,000 కొత్త గోదాములు
సాక్షి, అమరావతి: మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరో 9 వేల కొత్త గోదాములు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుబంధంగా పంటల్ని ఆరబెట్టుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌లు సైతం నిర్మించనుంది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు కాగా.. రైతు బంధు పథకానికి వినియోగించగా మిగిలే గోదాములను భారత ఆహార సంస్థ, పౌర సరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు మార్కెటింగ్ శాఖ అద్దెకు ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పశువుల మేత, మందుల విక్రయాలు వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. వీటికి గోదాముల కొరత రాకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ► మార్కెటింగ్ శాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో కొత్త గోదాముల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ► మొత్తం రూ.4 వేల కోట్లతో గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మించడంతోపాటు వీటికి అనుబంధంగా సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ► వీటిలో ఒక్క గోదాముల నిర్మాణానికే రూ.3,150 కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఇతర నిర్మాణాలు, యూనిట్ల ఏర్పాటుకు రూ.350 కోట్లు ఖర్చు కాగలదని అధికారులు అంచనా వేశారు. ► కొత్తగా నిర్మించే ఒక్కో గోదాము నిల్వ సామర్థ్యం 500 టన్నులు. తుపానులు, వర్షాలు కురిసిన సమయంలో పంటలు తడిచిపోకుండా ఉండేందుకు వీటిని వినియోగిస్తారు. ► అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా వీటిని నిర్మిస్తుండటంతో రైతులెవరైనా ఎరువులకు పెద్ద మొత్తంలో ఆర్డరు ఇస్తే... వాటిని ఈ గోదాముల్లో నిల్వ ఉంచి పంపిణీ చేస్తారు. నిధుల సేకరణ, టెండర్లకు చర్యలు మార్కెటింగ్ శాఖను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. అవసరమైన నిధుల సేకరణ, టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంటల్ని ఆరబెట్టుకునే ప్లాట్‌ఫామ్‌తోపాటు 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.35 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశాం. దశల వారీగా వీటిని నిర్మిస్తాం. సత్వరమే వీటిని నిర్మించే పనులను మా శాఖతోపాటు ఇతర ఇంజనీరింగ్ శాఖలకు అప్పగించాలా, మా శాఖలోనే అదనపు డివిజన్ ఏర్పాటు చేయాలా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నాం. – ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
అగ్రి మార్కెటింగ్‌తో భరోసా
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో భాగంగా వాటిని నిల్వ చేయడం కోసం ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీ లేదా కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టమాటా, చీని, అరటి వంటి పంటలను నిల్వ చేసుకునే విధంగా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. దేశ వ్యాప్తంగా ఏయే పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉందనే వివరాలతో పాటు, అన్ని చోట్ల వ్యాపారులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలి. ఆ మేరకు డేటా బేస్ రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీ లేదా కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ రూమ్‌లు, ఆర్బీకేలలో గ్రేడింగ్, సార్టింగ్ పరికరాలు, యంత్రాల కోసం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ఆ మేరకు వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీకేలు–గోదాములు–సదుపాయాలు ► ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించే గోదాముల్లో సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. వీటి కోసం సుమారు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ► ఆయా ఆర్బీకేల పరిధిలో పండే పంటలను దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాలను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ► ప్రతి ఆర్బీకేలో తేమను కొలిచే యంత్రం, వేయింగ్ బాలెన్స్, కాలిపెర్స్, లాబ్‌వేర్‌లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు రూ.92.2 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. రైతులకు తెలుగులో సమాచారం ► రైతులు తమ ఉత్పత్తుల వివరాలను ఆర్బీకేలలో అందివ్వగానే, ఆ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉందన్న సమాచారం, వ్యాపారుల వివరాలు వెంటనే తెలుగు భాషలో తెలియజేసేలా సదుపాయం ఉంటుందని అధికారులు చెప్పారు. ఇందు వల్ల రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తుందని వివరించారు. ► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంటల అమ్మకాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ► రైతులు తమ పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీకేలలో అందిస్తారు. అక్కడ నుంచి ఆ సమాచారం సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. ఈ సమాచారాన్ని అందుకోగానే రైతుల పంట కొనుగోలు జరిగేలా చూడాలి. ► కనీస గిట్టుబాటు ధరకన్నా, తక్కువకు అమ్ముకునే పరిస్థితులు ఉంటే ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకోవాలి. ► ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా సాగడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను సెప్టెంబర్ నాటికి తయారు చేయాలి. ఖరీఫ్ పంట చేతికి వచ్చే నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. -
ఆందోళన బాటలో అమెజాన్ ఉద్యోగులు
వాషింగ్టన్: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా తమకు వ్యక్తిగత సంరక్షణ పరికరాలను అందించకపోవడం వంటి పలు ఆరోపణలతో అమెరికాలోని అమెజాన్ గిడ్డంగుల ఉద్యోగులు సమ్మెకు సిద్ధపడ్డారు. ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనకు గురిచేస్తుంటే, మరోవైపు అమెజాన్ తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ వందల మంది అమెజాన్ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్ధపడటం ఆందోళనకు గురిచేస్తోంది. (వాట్సాప్ యూజర్లకు శుభవార్త) మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుండి 300 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా నిరసనకు దిగనున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్న గిడ్డంగుల వద్ద పని చేసేవారికి రక్షణ పరికరాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని, గిడ్డంగులను శుభ్రపరచడం, భద్రతా సామగ్రి, జీతంతో కూడిన అనారోగ్య సెలవు, ప్రమాద వేతనం కూడా అందించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడిన తమ సహచరులపై ప్రతీకారం తీర్చుకోవద్దని అమెజాన్‌ను కోరుతున్నారు. అమెజాన్ సంస్థకు ఆదాయంమీద ధ్యాసే తప్ప తమ భద్రతపై శ్రద్ధ లేదని మిచిగాన్ లోని అమెజాన్ కార్మికుడు జేలెన్ క్యాంప్ ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గిడ్డంగులను మూసివేసి శానిటైజేషన్ కార్యక్రమాలను పూర్తిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. (రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే) కరోనా మహమ్మారిని అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నసంగతి తెలిసిందే. 130కి పైగా అమెజాన్ గిడ్డంగుల్లో 30 కోవిడ్-19 కేసులు నమోదైనట్టు వర్కర్స్ రైట్స్ గ్రూప్,యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ తెలిపింది. అయితే తాజా పరిణామాలపై ఇంకా స్పందించని యాజమాన్యం, టెంపరేచర్ చెకింగ్, మాస్క్‌లు, శానిటైజేషన్ వంటి ప్రక్రియలను చేపడుతున్నామని గతంలో ప్రకటించింది. మరోవైపు ఈ ఆరోపణలపై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా) -
లోగుట్టు గిడ్డంగులకెరుక!
సాక్షి, హైదరాబాద్: బియ్యం నిల్వల పేరిట భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిర్మించిన గిడ్డంగులను ఏళ్ల తరబడిగా ఖాళీగా పెట్టి ఆమ్యామ్యాల కోసం ప్రైవేటు గిడ్డంగుల్లో నాలుగింతలు అధిక అద్దెతో బియ్యం నిల్వ చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఎఫ్‌సీఐ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (టీఎస్డబ్ల్యూహెచ్సీ) అధికారుల నిర్వాకంతో ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. గిడ్డంగులకు అప్రోచ్ రోడ్డు ఉన్నా లేదని, లేదా మరేదో కుంటి సాకులు చూపి అధికారులు గత ఏడేళ్లుగా ప్రైవేటు గిడ్డంగులకు కోట్లాది రూపాయలను అప్పనంగా దోచిపెట్టారని ఆధారాలతోపాటు బయటపడింది. కొంతమంది ఎఫ్‌సీఐ అధికారులు తమ బినామీలతోనే ప్రైవేటు గిడ్డంగులను కట్టించి వారికే బియ్యం నిల్వ పనులు అప్పగిస్తున్నారని పీపీపీ విధానంలో గిడ్డంగులు నిర్మించి నష్టపోయిన పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. పథకం నేపథ్యం ఇదీ.. పీపీపీ విధానంలో గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రోత్సహించి సరుకుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎఫ్‌సీఐ 2008లో ప్రైవేటు ఎంటర్ప్రెన్యూర్ గ్యారెంటీ (పెగ్) పథకం ప్రవేశపెట్టింది. గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టదు. పెగ్ పథకం కింద నిర్మించే గిడ్డంగుల్లో పదేళ్ల పాటు గ్యారెంటీగా బియ్యం నిల్వ చేసి అద్దె చెల్లిస్తామని, దీంతో పెట్టుబడి వ్యయం తిరిగి రాబట్టుకోవచ్చని ఎఫ్‌సీఐ ధీమా కల్పించింది. దీంతో పలువురు పెట్టుబడిదారులు భారీగా గిడ్డంగులు నిర్మిం చారు. ఏడాదిలోగా శీతల గిడ్డంగులను నిర్మించాలని, రెండో ఏడాది ముగిసేలోగా సమీపంలోని రైల్వే స్టేషన్ నుంచి గిడ్డంగుల వరకు బియ్యం రవాణా కోసం రైల్వే లైను(రైల్వై సైడింగ్) నిర్మించాలనే షరతులను ఎఫ్‌సీఐ పెట్టింది. రైల్వే లైను నిర్మించేందుకు రైల్వే బోర్డు నుంచి రైల్వే ట్రాన్స్‌పోర్టు క్లియరెన్స్ (ఆర్టీసీ) పొందడంలో ఎఫ్‌సీఐ తీవ్ర జాప్యం చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పరిమాణంలో సరుకు రవాణా చేస్తారు? ఎంత రవాణా వ్యాపారం జరుగుతుంది? ఎంత ట్రాఫిక్ ఉంటుంది? తదితర సమాచారాన్ని రైల్వే బోర్డుకు పంపడంలో ఎఫ్‌సీఐ అధికారులు కావాలనే జాప్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నాటి జీఎం లేఖే సాక్ష్యం.. ప్రైవేటు గిడ్డంగులకు బదులు పెగ్ గిడ్డంగులను వినియోగిస్తే ఏటా రూ.కోట్లు మిగులుతాయని పేర్కొంటూ 2017 మే 1న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ స్వయంగా ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని పెగ్ గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తే ఏటా రూ.4.30 కోట్లు, మేళ్లచెరువులోని గిడ్డంగిలో నిల్వ చేస్తే ఏటా రూ.2.23 కోట్లు ఆదా అవుతాయని అందులో పేర్కొన్నారు. ఇదే లెక్కన టేకులసోమారం గిడ్డంగిలో నిల్వ చేసినా ఏటా రూ.2.23 కోట్లు ఆదా కానున్నాయి. వాస్తనానికి ప్రైవేటు గిడ్డంగులకు బదులు పూర్తి స్థాయిలో ఈ మూడు గిడ్డంగులను ఎఫ్‌సీఐ వాడుకుంటే ఏటా ప్రభుత్వానికి రూ.70 కోట్ల వరకు ఆదా అవుతాయని, ఏడేళ్లలో దాదాపు రూ.500 కోట్లు దుర్వినియోగం కాకుండా మిగిలేవని పెగ్ గిడ్డంగుల యజమానులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తూ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. మామూళ్ల దురాశతోనే. ఎఫ్‌సీఐ గిడ్డంగులు కాకుండా ప్రైవేటు గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తే మామూళ్లు వస్తాయన్న దురాశతో కొందరు అధికారులు ఈ జాప్యం చేసినట్లు పెట్టుబడిదారులు ఆరోపిస్తున్నారు. రైల్వే బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చే సరికి రెండేళ్ల జాప్యం జరిగింది. అప్పటికే రైల్వే సైడింగ్ నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. పాత నిబంధనల ప్రకారం ఒకటిన్నర కిలోమీటర్ల రైల్వేలైన్‌ను రైల్వే సొంత ఖర్చుతో నిర్మించనుండగా, కొత్త నిబంధనల్లో ఈ నిడివి అర కి.మీ.కు తగ్గింది. దీంతో మిగిలిన కిలోమీటర్ లైను నిర్మాణ వ్యయ భారం పెట్టుబడిదారులపై పడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో టెండర్లలో ఎఫ్‌సీఐ హామీ ఇచ్చిన అద్దె ధరతో రైల్వే లైన్లు నిర్మిస్తే తమకు గిట్టుబాటు కాదని, ప్రతి బస్తాపై అదనంగా నెలకు రూ.2 అద్దె చెల్లిస్తే రైల్వే లైను పనులు చేపడుతామని పెట్టుబడిదారులు లేఖ రాశారు. రోడ్డు మార్గంతో పోలిస్తే రైల్వేమార్గంలో బియ్యం తరలిస్తే బస్తాపై రవాణా, హమాలీ చార్జీలు కలిపి రూ.20 వరకు అదా అవుతుందని, రూ.2 అదనంగా చెల్లించినా నష్టం లేదని, అయినా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు అంగీకరించలేదని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు. అప్పుడు వద్దని..ఇప్పుడు కావాలని... పత్తి నిల్వకు సీసీఐ ఇటీవల మేళ్లచెరువు, టేకులసోమారం పెగ్ గిడ్డంగులను అద్దెకు తీసుకుంది. ఈ గిడ్డంగులను వాడుకోవడానికి ఏడేళ్లుగా నిరాకరిస్తూ వచ్చిన ఎఫ్‌సీఐ అధికారులు ఈ విషయం తెలుసుకుని.. వాటిని ఖాళీ చేసి తమకు అప్పగిస్తే వాడుకుంటామని ఈ నెల 5న లేఖ రాయడం విశేషం. ఈ గిడ్డంగులను వాడుకోవడానికి సీసీఐకి లేని అభ్యంతరం ఎఫ్సీఐకు ఎందుకు ఉందనే విమర్శలొస్తాయనే జాగ్రత్త పడినట్టు అర్థమవుతోంది. యాదాద్రి జిల్లా టేకుల సోమారంలో రూ.24 కోట్లతో 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చిరాక్ వేర్‌హౌజ్ బిల్డర్స్ సంస్థ 10 గిడ్డంగులను నిర్మించింది. ఈ గిడ్డంగికి అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేదని, భవిష్యత్తులో రోడ్డు ఉన్న స్థలం నుంచి నీటిపారుదల కాల్వ వెళ్లనుందని ఏడేళ్లుగా సాకులు చెబుతూ ఇక్కడ పెట్టాల్సిన బియ్యాన్ని దగ్గరలోని ఓ ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేస్తోంది. ఇవి ఎఫ్‌సీఐ అధికారుల బినామీలవన్న విమర్శలున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో రూ.24 కోట్ల వ్యయంతో 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దేవిశ్రీ బిల్డర్స్ సంస్థ 2013లో 10 గిడ్డంగులను నిర్మించింది. సరైన అప్రోచ్ రోడ్డు లేదనే సాకుతో ఎఫ్‌సీఐ ఈ గిడ్డంగులను సైతం ఖాళీగా పెట్టింది. రైల్వే శాఖకు చెందిన భూమిలో అప్రోచ్ రోడ్డు ఉందని, ఈ గోదాములను ఉపయోగించలేమని తేలుస్తూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు గత నవంబర్ 11న లేఖ రాశారు. నిజామాబాద్ జిల్లా జానకంపేటలో 60 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో ‘లక్ష్మీ కోల్డ్ స్టోరేజీ అండ్ వేర్ హౌసెస్’ 12 గిడ్డంగులను నిర్మించింది. 2013లో నిర్మాణం పూర్తి చేసినా, 2017 వరకు ఈ గిడ్డంగులను ఎఫ్‌సీఐ ఖాళీగా పెట్టింది. ఈ గిడ్డంగిలో బియ్యం నిల్వ చేస్తే నెలకు అద్దె బస్తాపై 90పైసలు మాత్రమే కానుంది. 2017 నుంచి ఈ గిడ్డంగులను పాక్షికంగా మాత్రమే వినియోగించుకుంటోంది. బస్తాకు రూ.4.38 పైసలు చెల్లిస్తూ చుట్టు పక్కల ఉన్న ప్రైవేటు గిడ్డంగుల్లో ఎఫ్‌సీఐ బియ్యం నిల్వ చేస్తోంది. జానకంపేట గిడ్డంగిలో బియ్యం నిల్వ చేస్తే ఏటా రూ.4.32 కోట్లు ఆదా అవుతాయని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ 2017లో ఎఫ్‌సీఐకి లేఖ రాశారు. ప్రైవేటు దోపిడీ రైల్వే లైన్ల నిర్మాణం సాధ్యం కాకపోయినా, రోడ్డు మార్గంలో బియ్యం తరలించి 60% అద్దెతో పెగ్ స్కీం కింద నిర్మించే గిడ్డంగుల్లో బియ్యం నిల్వ చేస్తామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ హామీ ఇచ్చింది. ‘పెగ్’ గిడ్డంగిలో ఎన్ని బస్తాలు నిల్వ చేస్తే ఆ మేరకే అద్దె చెల్లిస్తే సరిపోనుంది. టెండరు ద్వారా నిర్మించిన గిడ్డంగుల్లో 60% అద్దెతో ఒక బస్తా బియ్యం నిల్వ చేస్తే నెలకు రూ.1 వ్యయం మాత్రమే కానుంది. రోడ్డు సరిగ్గా లేదని, హమాలీలు లేరని, క్రాప్ లేదని సాకులు చూపి ఏడేళ్లుగా ఎఫ్‌సీఐ అధికారులు చాలా పెగ్ గిడ్డంగులను ఖాళీగా ఉంచారు. వీటికి బదులుగా ప్రైవేటు గిడ్డంగుల్లో ప్రతి నెలా బస్తాకు రూ.4.68 చొప్పున బియ్యం నిల్వ చేస్తూ కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు. -
గోదాముల నిర్మాణానికి సహకరించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదాముల నిర్మాణానికి సహకరించాలని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రతినిధులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పంటలన్నీ నిల్వ చేసేందుకు గోదాములను ఉపయోగిస్తామన్నారు. మంచి ధర వచ్చినప్పుడు, వీలైనప్పుడు అమ్ముకునే పరిస్థితి రైతులకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో నాబార్డు సహకారంతో 336 ఆధునిక గోదాములను నిర్మించినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల రాకతో పంట దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్మించిన గోదాములు సద్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తరపున తెలంగాణలో అత్యధికంగా గోదాములను నిర్మించాలని కోరారు. భవిష్యత్ అవసరాల కోసం మరిన్ని గోదాముల నిర్మాణం తప్పనిసరని, కాబట్టి కేంద్రం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిపై కార్పొరేషన్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు. -
రైతును ముంచిన శనగ
సాక్షి, రాజుపాళెం : రైతులను శనగ పంట ముంచేసింది. ప్రకృతి సహకరించక, ప్రభుత్వం పట్టించుకోక వారు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది రబీలో జిల్లాలో 84480 హెక్టార్లలో శనగ సాగు చేశారు. విత్తనం వేశాక ఒక్క వాన కూడా పడకపోవడంతో పంట పూర్తిగా ఎండుముఖం పట్టింది. ఎకరాకు కేవలం 2 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రతి రైతు ఎకరాకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ట్రాక్టరు బాడుగలు, కూలీలు తదితర వాటి కోసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. ధర అంతంత మాత్రమే... శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం క్వింటా ధర రూ.3500 పలుకుతోంది. గతంలో రైతులు విత్తనం వేసేటప్పుడు కొనుగోలు చేయగా.. క్వింటా రూ.7 వేలు పలికింది. ఇలా ధర వ్యత్యాసం ఉంటే ఎలా గట్టెక్కుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.8000 కల్పించి ఉంటే.. పరిస్థితి కొంత వరకు బాగుండేదని వారు పేర్కొన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి కౌలుకు తీసుకున్నారు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. అటు అప్పులు కట్టలేక, ఇటు ధాన్యం అమ్ముకోలేక సందిగ్ధంలో ఉన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. చాలా మంది రైతులకు టోకన్లు దొరకక అమ్ముకోలేదు. మరి కొంతమంది రైతులు శనగ పంట నూర్పిడి తర్వాత పొలాల్లోనే వ్యాపారులకు అనామత్ (ధాన్యం వేశాక ఎప్పుడైనా అమ్ముకోవచ్చు) వేశారు. ప్రభుత్వ గోదాములు నిండిపోవడంతో చాలా మంది ప్రైవేటు గోదాములను ఆశ్రయించారు. ఒక్కో బస్తాకు ఏడాదికి రూ.130 బాడుగ చెల్లిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ చూపి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు వేలం నోటీసులు ఒక వైపు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగానికి బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడంతో.. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గోదాముల్లో ఉంచిన ధాన్యాన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. గతంలో క్వింటా ధర రూ.10 వేలు పలికింది. ఇలాంటి ధర వచ్చిన తర్వాత అమ్ముకుందామని కొందరు రైతులు భావించారు. అయితే ఏడాది గడిచినా ధర తక్కువగా ఉండటంతో అమ్ముకోలేక పోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించక ఏడాది పూర్తి కావడంతో.. బ్యాంకర్లు రైతులకు వేలం నోటీసులు పంపారు. ఆ తర్వాత శనగలు వేలం వేస్తామని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించి, రుణాలను రెన్యువల్ చేయాలని కోరినా బ్యాంకర్లు వినుకోవడం లేదు. గతంలో క్వింటా ధర రూ.6000 నుంచి రూ.6500 వరకు ఉండటంతో.. బ్యాంకులు క్వింటాకు రూ.3500 నుంచి రూ.4500 వరకు రుణం ఇచ్చాయి. ప్రస్తుతం క్వింటా రూ.3500 పలుకుతుండటంతో తీసుకున్న అప్పునకు కూడా సరిపోవడం లేదు. ఎమ్మెల్యేను కలిసిన రైతులు రుణం చెల్లించకుంటే ఈ నెల 22న వేలం వేస్తామని బ్యాంకులు పత్రికల్లో ప్రకటన ఇచ్చాయి. దీంతో రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని కలిసి, పరిస్థితి వివరించారు. ఎమ్మెల్యే వెంటనే బ్యాంక్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘రైతులకు రుణాలు ఇచ్చేటప్పుడు ఫలానా రోజు కట్టాలని చెప్పలేదు కదా.. ఉన్నట్టుండి ఇప్పుడు కట్టమంటే ఎలా కడతారు. కాదు కూడదు రుణం వడ్డీతో సహా చెల్లించాలంటే నేనే చెల్లిస్తా. గాంధీ మార్గంలో దీక్ష చేస్తా. శనగలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయనీయబోం’ అని మేనేజర్‌కు ఎమ్మెల్యే చెప్పారు.