
వాషింగ్టన్: ప్రముఖ ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా తమకు వ్యక్తిగత సంరక్షణ పరికరాలను అందించకపోవడం వంటి పలు ఆరోపణలతో అమెరికాలోని అమెజాన్ గిడ్డంగుల ఉద్యోగులు సమ్మెకు సిద్ధపడ్డారు. ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనకు గురిచేస్తుంటే, మరోవైపు అమెజాన్ తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ వందల మంది అమెజాన్ ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపట్టేందుకు సిద్ధపడటం ఆందోళనకు గురిచేస్తోంది. (వాట్సాప్ యూజర్లకు శుభవార్త)
మంగళవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుండి 300 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా నిరసనకు దిగనున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్న గిడ్డంగుల వద్ద పని చేసేవారికి రక్షణ పరికరాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని, గిడ్డంగులను శుభ్రపరచడం, భద్రతా సామగ్రి, జీతంతో కూడిన అనారోగ్య సెలవు, ప్రమాద వేతనం కూడా అందించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడిన తమ సహచరులపై ప్రతీకారం తీర్చుకోవద్దని అమెజాన్‌ను కోరుతున్నారు. అమెజాన్ సంస్థకు ఆదాయంమీద ధ్యాసే తప్ప తమ భద్రతపై శ్రద్ధ లేదని మిచిగాన్ లోని అమెజాన్ కార్మికుడు జేలెన్ క్యాంప్ ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గిడ్డంగులను మూసివేసి శానిటైజేషన్ కార్యక్రమాలను పూర్తిగా చేపట్టాలని డిమాండ్ చేశారు. (రియల్ ఛాలెంజ్ : ఈ దంపతులు ఏం చేశారంటే)
కరోనా మహమ్మారిని అమెరికాను అతలాకుతలం చేస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నసంగతి తెలిసిందే. 130కి పైగా అమెజాన్ గిడ్డంగుల్లో 30 కోవిడ్-19 కేసులు నమోదైనట్టు వర్కర్స్ రైట్స్ గ్రూప్,యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ తెలిపింది. అయితే తాజా పరిణామాలపై ఇంకా స్పందించని యాజమాన్యం, టెంపరేచర్ చెకింగ్, మాస్క్‌లు, శానిటైజేషన్ వంటి ప్రక్రియలను చేపడుతున్నామని గతంలో ప్రకటించింది. మరోవైపు ఈ ఆరోపణలపై నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. (కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా)
Comments
Please login to add a commentAdd a comment