సాక్షి, హైదరాబాద్: దేశంలో గిడ్డంగుల స్థలానికి డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్లలో దేశంలో 22.3 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్ ఉందని, దీని కోసం 3.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం ఉందని సీఐఐ – అనరాక్ ‘ఇండియా వేర్‌హౌసింగ్’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ రంగం 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులను కలిగి ఉందని అనరాక్ క్యాపిటల్ ఎండీ అండ్ సీఈఓ శోభిత్ అగర్వాల్ తెలిపారు.
2018లో 3.4 కోట్లుగా చ.అ.లుగా ఉన్న గ్రేడ్–ఏ గిడ్డంగుల స్థలం 2021 నాటికి 4.85 కోట్ల చ.అ.లకు పెరిగింది. ఏటా 12.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. అలాగే 2018లో 3.78 కోట్ల చ.అ.లుగా ఉన్న వేర్‌హౌస్ స్థలం సరఫరా.. 2021 నాటికి 10.6 వార్షిక వృద్ది రేటుతో 5.1 కోట్ల చ.అ.లకు చేరింది. ఏడు ప్రధాన నగరాలలోని గ్రేడ్–ఏ గిడ్డంగుల స్థలానికి డిమాండ్ ఉంది.
37 శాతం వాటాతో అత్యధికంగా 16 కోట్ల చ.అ. గిడ్డంగి స్థలంతో పశ్చిమాది నగరాలు (ముంబై, పుణే) తొలిస్థానంలో ఉన్నాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటా 32 శాతంగా కాగా.. భీవండి, చకన్, పన్వెల్, తలోజా వంటి పశ్చిమాది నగరాల వాటా 41 శాతంగా ఉంది. వేర్‌హౌస్ స్థలం అద్దె అత్యధికంగా ముంబైలో చ.అ.కు రూ.27 కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో రూ.20గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment