
ముంబై: ఆతిథ్య రంగ కంపెనీ ఎస్పైర్ హాస్పిటాలిటీ గ్రూప్ విస్తరణ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా రానున్న నాలుగేళ్లలో రూ. 550 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. విస్తరణకుతోడు బిజినెస్‌ల ఆధునీకరణను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో 2023కల్లా 20 హోటళ్లు, 700కుపైగా గదులను జత కలుపుకోవాలని ప్రణాళికలు వేసినట్లు గ్రూప్ సీవోవో అఖిల్ అరోరా వెల్లడించారు.
అన్ని బ్రాండ్లనూ కలుపుకుని ప్రస్తుతం 318 గదులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. తాజా పెట్టుబడులను ప్రస్తుత హోటళ్ల ఆధునీకరణ, లీజింగ్ తదితరాలకు సైతం వినియోగించనున్నట్లు వివరించారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్, భిమ్‌టాల్‌తోపాటు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హోటళ్లను నిర్వహిస్తోంది. ఉదయ్‌పూర్‌లో తొలిసారి జానా లగ్జరీ ఎస్కేప్స్ పేరుతో హోటల్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment