పెన్షన్ స్కీమ్‌ల కోసం రిటైర్మెంట్ అడ్వైజర్లు
• నియామకంపై పీఎఫ్‌ఆర్‌డీఏ దృష్టి
• ఎన్‌ఆర్‌ఐ, గల్ఫ్ దేశాల్లో కార్మికులను ఆకర్షించే ప్రయత్నాలు
న్యూఢిల్లీ: ఎన్‌పీఎస్ తదితర పింఛను పథకాలను నిర్వహించే పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) విస్తరణపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), గల్ఫ్ దేశాల్లోని కార్మికులను ఆకర్షించేందుకు వీలుగా రిటైర్మెంట్ అడ్వైజర్లను నియమించే ప్రణాళికలతో ఉంది. ‘‘ఎన్‌ఆర్‌ఐల నుంచి ఎన్‌పీఎస్‌లో చేరిక పెద్దగా లేదు. గతేడాది నవంబర్‌లో దుబాయిలో రోడ్‌షో నిర్వహించిన తర్వాత స్పందన పెరిగింది.
ప్రతీ నెలా 150–160 ఎన్‌పీఎస్ ఖాతాలు ప్రారంభం అవుతున్నాయి. అయినప్పటికీ ఇది చాలా తక్కువే. ఇది దీన్ని మరింత పెంచాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎన్‌ఆర్‌ఐలకు పింఛను పథకాల గురించి వివరించేందుకు వీలుగా రిటైర్మెంట్ అడ్వైజర్లను నియమించాలని అనుకుంటున్నాం’’ అని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ హేమంత్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. తొలుత గల్ఫ్ ప్రాంతంలో చందాదారులను ఆకర్షించే ప్రయత్నం చేసిన తర్వాత స్పందనను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.