నాగ్‌పూర్:మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైన పది రోజులకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన 39 మంది నేతలు మంత్రులుగా ఆదివారం(డిసెంబర్15) ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు.
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,డిప్యూటీసీఎంలు ఏక్‌నాథ్ శిండే,అజిత్ పవార్‌ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాన్‌కులేతోపాటు రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, గణేశ్ నాయక్, మంగళ్‌ప్రభాత్ లోధా, జయ్‌కుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావే, అశోక్ ఉయికే, ఆశిశ్ శేలార్, శివేంద్రసిన్హ భోసలే, జయ్‌కుమార్ గోరె మంత్రులుగా ప్రమాణం చేశారు.
శివసేన నుంచి గులాబ్‌రావ్ పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభూరాజ్ దేశాయ్, ఎన్‌సీపీ నుంచి ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, దత్తాత్రేయ, అధితీ తాత్కరే, మానిక్‌రావ్ కొకాటే, నరహరి జిర్వాల్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మరోవైపు తనకు కేబినెట్ బెర్తు దక్కలేదని శివసేన ఎమ్మెల్యే, పార్టీ విదర్భ కో ఆర్డినేటర్ నరేంద్ర మోడేకర్ అలిగారు. పార్టీ కో ఆర్టినేటర్ పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment