Akasa Air Clearly Beating Indigo Who Started Operations on 2022 - Sakshi
Sakshi News home page

7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!

Published Mon, Mar 27 2023 3:58 PM | Last Updated on Mon, Mar 27 2023 4:53 PM

Akasa Air clearly besting IndiGo who started operations on 2022 - Sakshi

సాక్షి ముంబై: ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ఆవిష్కరించిన ఆకాశ ఎయిర్‌ విస్తరణలో దూసుకుపోతోంది. బడ్జెట్‌ధరల్లో విమాన టికెట్లు అందుబాటులోకి  తీసుకురావాలనే ఆశయంతో  బిగ్‌ బుల్‌ లాంచ్‌ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆకాశ ఎయిర్ ఇపుడు విస్తరణలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత విమానయాన రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే .ఏడు నెలల్లోనే  సంస్థ  తనదైన ఘనతను సాదించింది. 

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఫిబ్రవరి నెలవారీ గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 3 శాతానికి చేరుకుంది. మార్చి చివరి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను చేర్చాలని భావించిన ఎయిర్‌లైన్ సంస్థ ప్రస్తుతం 19 విమానాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయానంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఆగస్టు 4, 2006లో  సేవలను ప్రారంభించగా, ఆగస్టు 7, 2022లో ఆకాశ ఎయిర్‌ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు అప్పట్లో ఇండిగోలో స్టార్టప్ టీమ్‌లో భాగమై ఆదిత్య ఘోష్ ఇప్పుడు ఆకాశ ఎయిర్‌లో  ఉండటం గమనార్హం.

ఇండిగో మార్కెట్ వాటా కేవలం 2.6 శాతం. అలాగే ప్రస్తుతం 75కుపైగా దేశీయ గమ్యస్థానలకు,  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 గమ్యస్థానాలకు తన విమానాలను నడుపుతోంది.  2016  నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్‌సిఎపి)  అమలులోకి వచ్చే వరకు, విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా ప్రయాణించడానికి ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కనీసం  20 విమానాలను కలిగి ఉండాలి.  మారిన నిబంధన ప్రకారం కార్యకలాపాల వ్యవధిపై  ఎలాంటి  ఎటువంటి పరిమితులు లేవు.  దీని ప్రకారం మార్చి 2023 చివరి నాటికి   ఆకాశ  ఎయిర్‌ అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది.

2024 చివరి నాటికి మొత్తం శ్రామికశక్తిని 3వేలకు చేరుకోనుంని సంస్థ దాదాపు 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుందని ఇటీవలి ఆకాశ  ఎయిర్‌ వినయ్ దూబే ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మూడు అంకెల ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్’ చేయనున్నట్లు దూబే వెల్లడించారు. ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న 19 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లతో పాటు, అకాశ ఎయిర్ మరో 72 విమానాలతొ విస్తరిస్తోందని, ఏప్రిల్‌లో ప్రారంభించిన తర్వాత 20వ బోయింగ్ 737 మ్యాక్స్ విదేశీ ఫంక్షన్లకు సిద్ధంగా ఉంటుందని  ఆయన ప్రకటించారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్ మరో తొమ్మిది విమానాలతో మొత్తం సంఖ్య 28కి చేరనుంది. అలాగే వేసవి చివరి నాటికి ప్రస్తుత 110 (17 దేశీయ మార్గాలలో) నుండి 150చేరనుందన. ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు లక్నోనుంచి గోవా, అహ్మదాబాద్‌లకు డైరెక్ట్‌ విమానాలను ప్రారంభించింది ఆకాశ ఎయిర్‌.  నిరంతరాయమైన కనెక్టివిటీని అందించే లక్ష్యంతో,  చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ఈ రెండు డైరెక్ట్ విమానాలు ఆదివారం  లాంచ్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement