హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కంపెనీ పల్సస్ తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు విస్తరించింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు భేటి అయిన సందర్భంగా ఈ విషయమై ఇరువురి మధ్యా ఒక అంగీకారం కుదిరినట్లు పల్సస్ తెలియజేసింది. వచ్చే ఏడాది కాలంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్... పల్సస్, ఒమిక్స్ సారథ్యంలో దంతేవాడ, రాజ్‌నందగావ్, రాయ్‌పూర్‌లో రానున్న సెజ్‌లలోని 3 కేంద్రాల్లో 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని శ్రీనుబాబు ఈ సందర్భంగా చెప్పారు.
అలాగే వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని హిందీలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పల్సస్‌కు దేశంలోని 7 సెజ్ యూనిట్లలో కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులున్నారు. ఇంకా యూకే, సింగపూర్, బెల్జియంలలోనూ సేవలందిస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌కు పల్సస్ విస్తరణ
Published Thu, Aug 9 2018 1:17 AM | Last Updated on Thu, Aug 9 2018 1:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment