న్యూఢిల్లీ: ఆకాశ ఎయిర్.. మరో 4 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలు సన్నాహాల్లో ఉన్నట్లు పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది(2023) చివరికల్లా మూడంకెలలో విమాన కొనుగోలుకి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆర్డర్లు జారీ చేసిన 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లకు జతగా మరో 4 విమానాలకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు తెలియజేసింది.(క్వాంటమ్ ఎనర్జీ విస్తరణ:హైదరాబాద్‌లో మూడో షోరూం)
ప్యారిస్‌లో జరుగుతున్న ఎయిర్ షో సందర్భంగా కంపెనీ ఈ అంశాలను వెల్లడించింది. 2023 చివరికల్లా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే లక్ష్యంతో సాగుతున్నట్లు తెలిపింది. తాజాగా కొనుగోలు చేయనున్న విమానాలతో విస్తరణ పటిష్టంకానున్నట్లు వివరించింది. అంతర్జాతీయ విస్తరణ కోసం నాలుగు 737-8 విమానాల కొనుగోలుకి తెరతీసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు.
దీంతో రానున్న నాలుగేళ్లలో మొత్తం 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ తీసుకోనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా వేగవంత విస్తరణలో ఉన్న కంపెనీ అంతర్జాతీయ రూట్లలోనూ సరీ్వసుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. (దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్)
Comments
Please login to add a commentAdd a comment